'అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి'
ముంబై : నేడు యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష విదిస్తున్నందున అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరి శిక్ష నేపథ్యంలో నాగ్ పూర్, ముంబైలలోమహారాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితులపై సమీక్షించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. ముంబై, నాగ్పూర్లో భద్రత కట్టుదిట్టం చేయడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని మత పెద్దలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.