ఆ ఉగ్రవాదికి ఉరి ఖాయం | SC dismisses Yakub Memon's curative petition in Mumbai 1993 blasts case | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 21 2015 4:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కారకుడు, ఉగ్రవాది యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ ఉరశిక్ష దాదాపు ఖరారైంది. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ అతడు పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. దీంతో ముంబై పేలుళ్ల సూత్రధారికి ఉరిశిక్ష అమలు ఖాయమైంది. టాడా కోర్టు అతనికి విధించిన ఉరిశిక్షను ఆ తర్వాత సుప్రీం ధర్మాసనం సమర్ధించింది. ఈ నేపథ్యంలో జూలై 30న యాకూబ్ ను ఉరితీయనున్నారు. యాకూబ్ మెమన్ ఉరిశిక్షను అమలుచేసేందుకు రంగం సిద్ధం చేశామని ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఈ శిక్ష అమలుకానుంది. ప్రస్తుతం ఉరి శిక్ష కోసం ఎదురుచూస్తున్న ఏకైక ఖైదీ మెమన్ మాత్రమే. తనకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా గతంలో రాష్ట్రపతికి పెట్టుకున్న తిరస్కరించడంతో అతని మరణశిక్ష అమలు రూఢీ అయింది.

Advertisement
 
Advertisement
 
Advertisement