
యాకూబ్ మెమన్ అంత్యక్రియలు పూర్తి
యాకూబ్ మెమన్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం 5.15 గంటలకు ముగిశాయి.
ముంబై: యాకూబ్ మెమన్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం 5.15 గంటలకు ముగిశాయి. దక్షిణ ముంబైలోని మెరైన్ లైన్స్ ప్రాంతంలో బదాకబరస్థాన్ శ్మశాన వాటికలో ముస్లిం మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అతడి తండ్రి సమాధి వద్దే యాకూబ్ ను పూడ్చిపెట్టారు.
నాగపూర్ సెంట్రల్ జైల్లో ఈ ఉదయం ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత యాకూబ్ మెమన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మధ్యాహ్నం మెమన్ భౌతిక కాయాన్ని ముంబైకు తరలించారు. మరోవైపు మెమన్ నివాసానికి పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకుని అతడి కోసం ప్రార్థనలు చేశారు. అయితే ఎటువంటి నినాదాలు చేయొద్దని వారికి పోలీసులు సూచించారు. మెమన్ నివాసం వద్ద భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మొహరించారు.