న్యూఢిల్లీ : ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్ ఉరిశిక్షను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. మంగళవారం యాకూబ్ పిటిషన్ విచారించిన జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ కురియన్ జోసెఫ్లతో కూడిన ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. ఉరిశిక్షపై స్టే విధించేందుకు జస్టిస్ దవే నిరాకరించగా, ఉరిశిక్ష అమలును జస్టిస్ కురియన్ వ్యతిరేకించారు. దీంతో ఈ పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.
ముంబై పేలుళ్ల కేసులో మెమెన్కు ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 30న ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం మహారాష్ట్ర లోని నాగపూర్ జైల్లో ఉంటున్న యాకూబ్కు అక్కడే ఉరిశిక్ష అమలు చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ఉరిశిక్ష రద్దు చేయాలంటూ యాకూబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
సుప్రీం విస్తృత ధర్మాసనానికి యాకూబ్ పిటిషన్
Published Tue, Jul 28 2015 1:04 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement