larger bench
-
థాక్రే రాజీనామా చేయకపోయి ఉంటే.. : సుప్రీం కోర్టు
ఢిల్లీ: శివసేన కేసులో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నైతిక విజయంగా భావిస్తోంది థాక్రేకు చెందిన శివసేన వర్గం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో థాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమన్న రాజ్యాంగ ధర్మాసనం.. అసెంబ్లీలో జరిగే బలపరీక్షలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కిందటి ఏడాది శివసేన పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభ పరిస్థితుల్లో.. బలనిరూపణ పరీక్షకు వెళ్లకుండానే ఉద్దవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఇవాళ్టి తీర్పులో ప్రధానంగా ప్రస్తావించిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్. ఒకవేళ థాక్రే గనుక రాజీనామా చేసి ఉండకపోయి ఉంటే.. ఈ కోర్టు ఇవాళ ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించి ఉండేదని స్పష్టం చేసింది. ► విప్‌ను నియమించాల్సింది రాజకీయ పార్టీ. అంతేగానీ శాసనసభా పక్షం కాదు. కాబట్టి, ఏక్నాథ్ షిండే క్యాంప్ నియమించిన విప్ చెల్లుబాటు కాదు. కాబట్టి, శివసేన విప్‌గా భరత్ గోగావాలేను నియమిస్తూ హౌజ్ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సరికాదు. ► అలాగే.. ఒక పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలను, లేదంటే పార్టీల మధ్య నెలకొన్న కలహాలను బలనిరూపణ పరీక్ష పరిష్కరించలేదు. ► ఆ సమయంలో ఉద్దవ్ థాక్రే పార్టీ మెజార్టీ కోల్పోయారనే అధికారిక సమాచారం నాటి గవర్నర్ వద్ద లేదు. అయినా ఆయన బలనిరూపణకు ఆదేశించారు. ఆయనది రాజకీయ జోక్యం.. తొందరపాటు నిర్ణయం. ఆ నిర్ణయం తప్పు కూడా అని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ► గవర్నర్ విచక్షణాధికారం అమలు చేయడం చట్టానికి అనుగుణంగా లేదని సుప్రీం కోర్టు కానిస్టిట్యూషన్ బెంచ్ అభిప్రాయపడింది. ► అయితే.. బలపరీక్షకు వెళ్లకుండా ఉద్దవ్ థాకక్రే రాజీనామా చేసిన క్రమంలో.. బీజేపీ మద్దతు ద్వారా మెజార్టీ ఉందని ప్రకటించుకున్న షిండే వర్గాన్ని.. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడం ద్వారా గవర్నర్ సరైన పనే చేశారని బెంచ్ అభిప్రాయపడింది. అలాగే.. బలనిరూపణకు ముందుకు వెళ్లలేని సీఎంను.. ఇవాళ తన ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించమని అడిగే హక్కు కూడా ఉండదు అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ► చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. మొత్తం 141 పేజీల తీర్పు కాపీని ఈ కేసు కోసం సిద్ధం చేసింది. ► ఈ సందర్భంగా 2018 నాబమ్ రెబియా కేసు(తన తొలగింపును కోరుతూ తీర్మానం పెండింగ్‌లో ఉన్నప్పుడు స్పీకర్ అనర్హత ప్రక్రియను ప్రారంభించలేరని)ను ప్రస్తావించిన బెంచ్.. ఆ కేసులోనూ పలు అంశాలపై నిర్ణయాలు జరగలేదని, కాబట్టి విస్తృత ధర్మాసనానికి అంశాల్ని బదిలీ చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. దీంతో.. శివసేన కేసులో ఇంకా తుది తీర్పు రాలేదనే భావించాలి. ► ఇక సుప్రీం కోర్టు తీర్పు తమ నైతిక విజయమని పేర్కొన్న ఉద్దవ్ థాక్రే.. ఇప్పుడున్న సీఎం, డిప్యూటీ సీఎంలకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా తన మాదిరే రాజీనామా చేయాలంటూ ఉద్దవ్ థాక్రే పిలుపు ఇచ్చారు. ► మరోవైపు సుప్రీం కోర్టు తమకు అనుకూలంగానే ఉందని షిండే వర్గం ప్రకటించుకుంది. మహారాష్ట్రలో ఇప్పుడు సుస్థిరమైన ప్రభుత్వం కొనసాగేందుకు వీలు కలిగిందని అభిప్రాయపడింది. -
హిజాబ్ తీర్పు: సుప్రీంలో ఊహించని పరిణామం
న్యూఢిల్లీ: కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించటంపై నిషేధం విధించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై గురువారం తీర్పు సందర్భంలో.. సుప్రీం కోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించారు. దీంతో సరైన దిశానిర్దేశం కోసం ఈ పిటిషన్లను సీజేఐకి సిఫారసు చేస్తున్నట్లు జస్టిస్ హేమంత్ గుప్తా తెలిపారు. సుమారు పదిరోజులపాటు హిజాబ్ పిటిషన్లపై వాదనలు వినింది ద్విసభ్య న్యాయమూర్తుల ధర్మాసనం. చివరికి.. కర్ణాటక హైకోర్టును తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా.. తీర్పును తోసిపుచ్చారు జస్టిస్ సుధాన్షు దులియా. దీంతో ఈ వివాదం సీజేఐకి ముందుకు చేరగా.. మరో బెంచ్ లేదంటే రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థుల దుస్తులపై కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. స్కూల్స్, పాఠశాలల్లో హిజాబ్ ధరించకూడదని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయాటనికి నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 10 రోజుల పాటు వాదనలు విన్న జస్టిస్ హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఇరువురు జడ్జీలు హిజాబ్ నిషేధంపై ఏకాభిప్రాయానికి రాకపోవటం గమనార్హం. ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
‘శబరిమల’పై సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: శబరిమల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం గురువారం తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై సమీక్ష సందర్భంగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం మత వ్యవహారాలకు సంబంధించిన కొన్ని అంశాలను విస్తృత ధర్మాసనం పరిశీలిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కక్షిదారుల తరఫు న్యాయవాదులు దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని విస్తృత బెంచ్ గురువారం కేసును విచారించింది. రోజంతా సాగిన ఈ విచారణ తరువాత జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. ‘ఆదేశాలు సోమవారం జారీ చేస్తాం. విస్తృత ధర్మాసనం చర్చించాల్సిన అంశాలను కూడా అదే రోజు ఖరారు చేస్తాం’ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కక్షిదారుల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్. నారిమన్‌తో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఢిల్లీ న్యాయాధికారుల కేసును ప్రస్తావించారు. ఆ కేసులో నారీమన్ ఇంగ్లాండ్ న్యాయశాస్త్ర గ్రంథం హాల్స్బరీలోని ఓ నిబంధనను ప్రస్తావించారని, దాని ప్రకారం సుప్రీంకోర్టుకు ఏ రకమైన ఆంక్షల్లేని న్యాయపరిధి లభిస్తుందని... శబరిమల కేసుకు అది వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. ఒక తీర్పుపై సమీక్ష జరిపే సమయంలో న్యాయ సంబంధిత ప్రశ్నలను లేవనెత్తరాదన్నది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల వాదనగా ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: ఏప్రిల్‌లో మందిర నిర్మాణం!) -
హైకోర్టు విచక్షణకే లాయర్ల హోదా: సుప్రీం
న్యూఢిల్లీ: లాయర్ల హోదాపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారాన్ని హైకోర్టులకే వదిలేస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా అత్యున్నత బెంచ్‌కు సూచించింది. లాయర్లకు సీనియర్లుగా హోదా ఇవ్వడం సమస్యేమీ కాదని, దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వొచ్చని జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ నవీన్ సిన్హా పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం సంబంధిత ఫైళ్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ ముందు ఈ రోజే ఉంచాలని కోర్టు కార్యదర్శిని ఆదేశించారు. -
సుప్రీం విస్తృత ధర్మాసనానికి యాకూబ్ పిటిషన్
న్యూఢిల్లీ : ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్ ఉరిశిక్షను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. మంగళవారం యాకూబ్ పిటిషన్ విచారించిన జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. ఉరిశిక్షపై స్టే విధించేందుకు జస్టిస్ దవే నిరాకరించగా, ఉరిశిక్ష అమలును జస్టిస్ కురియన్ వ్యతిరేకించారు. దీంతో ఈ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ముంబై పేలుళ్ల కేసులో మెమెన్‌కు ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 30న ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం మహారాష్ట్ర లోని నాగపూర్ జైల్లో ఉంటున్న యాకూబ్‌కు అక్కడే ఉరిశిక్ష అమలు చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ఉరిశిక్ష రద్దు చేయాలంటూ యాకూబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.