
ఉరిశిక్ష అమలు ఎలా?
ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకూబ్ మెమన్కు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దాంతో.. అసలు ఉరిశిక్షను ఎలా అమలుచేస్తారన్న విషయం సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది..
ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకూబ్ మెమన్కు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దాంతో.. అసలు ఉరిశిక్షను ఎలా అమలుచేస్తారన్న విషయం సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది..
- ఉరి తీసేందుకు ఒక అంగుళం (రెండున్నర సెంటీమీటర్ల) వ్యాసం, 19 అడుగుల పొడవు ఉండే తాడును సిద్ధం చేస్తారు
- ఖైదీ బరువుకు ఒకటిన్నర రెట్ల బరువుండే బస్తాలతో వారం రోజుల ముందే రెండు తాళ్లను పరీక్షించి వాటిని లాక్ చేస్తారు
- రేపు ఉరిశిక్ష అమలు చేస్తారనగా.. ఈరోజు సాయంత్రం మరోసారి సూపరింటెండెంట్ సమక్షంలో వాటిని పరీక్షిస్తారు
- ఉరిశిక్ష అమలుచేసే సమయంలో జైలు సూపరింటెండెంట్, జైలు వైద్యాధికారి, జిల్లా మేజిస్ట్రేట్, ఇద్దరు ప్రభుత్వ సాక్షులు తప్పనిసరిగా ఉండాలి.
- ఉరి తీసే సమయాలు కూడా నెలల వారీగా మారతాయి
- మే నుంచి ఆగస్టు వరకు అయితే ఉదయం 6 గంటలకు ఉరి తీస్తారు
- నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే ఉదయం 8 గంటలకు ఉరి తీస్తారు
- మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మాత్రం ఉదయం 7 గంటలకు ఉరితీస్తారు
- ఖైదీకి అర్థమయ్యే భాషలో అతడిని ఉరి తీస్తున్నట్లు చెబుతారు
- యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలుచేసేందుకు రూ. 22 లక్షలు కేటాయించారు
- మెమన్ ఉరితీతకు తగినంత ఫిట్గానే ఉన్నాడని నాగపూర్ జైలర్ తెలిపారు
- ఇప్పటివరకు భారతదేశంలో 169 మందిని ఉరి తీశారు.. యాకూబ్ మెమన్ 170వ వ్యక్తి అవుతాడు
- ఉరి తీసే ప్రదేశానికి అత్యంత సమీపంలోనే యాకూబ్ మెమన్ ఇప్పుడు ఉన్నాడు
- రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇప్పటికి 12 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు
- ఉరిశిక్ష విధించే ఖైదీని సాధారణంగా ఆరోజు అర్ధరాత్రి 2.30 గంటలకు నిద్ర లేపుతారు.
- అప్పుడే స్నానం చేయాలని అడుగుతారు.
- ఆ తర్వాత జైలు సూపరింటెండెంట్, మేజిస్ట్రేట్ డెత్ వారెంట్ చదువుతారు.
- అనంతరం ఖైదీకి ఇష్టమైన టిఫిన్ పెడతారు.
- తర్వాత అతడి చివరి కోరిక ఏంటో అడుగుతారు.
- ఆ వెంటనే అతడ్ని ఉరికంబం వద్దకు తీసుకెళ్తారు.