అతడ్ని ఉరితీసినందుకు రూ.10వేల చెక్ | Karnataka college students donate Rs 10,000 to Yakub Memon's executioner | Sakshi
Sakshi News home page

అతడ్ని ఉరితీసినందుకు రూ.10వేల చెక్

Published Thu, Aug 6 2015 11:26 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

అతడ్ని ఉరితీసినందుకు రూ.10వేల చెక్

అతడ్ని ఉరితీసినందుకు రూ.10వేల చెక్

మంగళూరు: ముంబయి పేలుళ్లలో దోషి యాకుబ్ మెమన్ను ఉరితీసిన తలారికి కర్ణాటకు చెందిన ఓ విద్యార్థి సంఘం రూ.10 వేల చెక్ను పంపించింది. అమాయకుల ప్రాణాలు బలిగొన్న అలాంటి వ్యక్తిని ఉరితీసిన తలారిని గౌరవించడం తమకు గర్వంగా ఉందని, అందుకే ఈ చెక్ పంపిస్తున్నామని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది.

పుత్తూరులోని అంబికా పదవి పూర్వ విద్యాలయకు చెందిన కొంతమంది విద్యార్థి నాయకులు తొలుత ఈ ఆలోచన చేసి కాలేజీ యాజమాన్యానికి తెలియజేయగా వారు జైలు అధికారులను సంప్రదించారు. అందుకు వారు అనుమతించడంతో ప్రతి క్లాసులో నుంచి స్వచ్ఛంద విరాళాలు వసూలు చేసి మొత్తం పది వేల రూపాయలను తలారీకి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement