సర్వే చేయలేదని సెల్‌టవర్ ఎక్కాడు.. | a man protest from cell tower cause of did not entered details in survey | Sakshi
Sakshi News home page

సర్వే చేయలేదని సెల్‌టవర్ ఎక్కాడు..

Published Thu, Aug 21 2014 12:53 AM | Last Updated on Mon, Aug 27 2018 8:24 PM

a man protest from cell tower cause of did not entered  details in survey

 శంషాబాద్:  సమగ్ర సర్వేలో భాగంగా అధికారులు తన కుటుంబ వివరాలు నమోదు చేసుకోలేదని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. ఈ సంఘటన  శంషాబాద్ పట్టణంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని గొల్లపల్లి దర్వాజ సమీపంలో పాడుపడిన పోలీస్‌క్వార్టర్‌లో నివాసముంటున్న యా కోబ్(45) స్థాని కంగా కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్యాపిల్లలు ఉన్నారు.

కుటుంబ సర్వే కారణంగా యాకోబ్ మంగళవారం ఇంటివద్దే అందుబాటులో ఉన్నాడు. రాత్రి వరకు కూడా అధికారులెవరూ సర్వే కోసం యాకోబ్ ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆగ్రహానికి గురైన యాకోబ్ బుధవారం సాయంత్రం పట్టణంలోని వైఎన్‌ఆర్ గార్డెన్ సమీపంలోని సెల్‌టవర్‌పై ఎక్కా డు. ఆత్మహత్యకు పాల్పడుతానని ఆందోళన చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, ఆర్‌జీఐఏ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యాకోబ్‌తో ఫోన్లో మాట్లాడి సర్దిచెప్పారు. అధికారులతో పేర్లు నమోదు చేయిస్తామని హామీ ఇవ్వడంతో యూకోబ్ సెల్‌టవర్ పైనుంచి కిందికి దిగాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement