తప్పయితే.. క్షమించండి: సల్మాన్
ముంబై: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వెనక్కి తగ్గారు. వీటిపై తీవ్ర విమర్శలు రావడంతో సల్మాన్ తాను చేసిన ట్వీట్లను వెనక్కి తీసుకున్నారు. తనవల్ల ఏదైన తప్పు జరిగి ఉంటే క్షమించాలని కోరారు.
సల్మాన్ ట్వీట్లను ఆయన తండ్రి సలీం ఖాన్ తప్పుపట్టారు. ముంబై పేలుళ్ల గురించి సల్మాన్కు అవగాహనలేదని చెప్పుకొచ్చారు. ఇక యోగా గురు బాబా రాందేవ్ సహా రాజకీయ నేతలు, నెటిజెన్లు సల్మాన్ పై విమర్శలు చేశారు. దీంతో సల్మాన్ క్షమాపణలు చెప్పారు. యాకూబ్ అమాయకుడు అని తానెప్పుడూ చెప్పలేదని అన్నారు.
సల్మాన్ అంతకుముందు ఏమన్నారంటే...
1993 ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్కు ఉరిశిక్ష పడిని విషయం తెలిసిందే. దీనిపై సల్మాన్ ట్విట్టర్లో స్పందిస్తూ యాకూబ్ను ఉరితీయొద్దని.. అతడి సోదరుడు, కేసులో ప్రధాన దోషి అయిన టైగర్ మెమన్ను పట్టుకొచ్చి బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశాడు. (పూర్తి వివరాలు చదవండి)