Lord Jagannath Photo On KitKat Wrapper: See Netizens Reaction Goes Viral - Sakshi
Sakshi News home page

వివాదంలో నెస్లే కిట్‌ క్యాట్‌ చాక్లెట్‌.. రేపర్‌ మీద ఆ బొమ్మలపై అభ్యంతరం

Published Thu, Jan 20 2022 3:47 PM | Last Updated on Thu, Jan 20 2022 5:19 PM

Netizens Fire On Nestle Over Lord Jagannath Pic on KitKat Wrapper - Sakshi

ఫాస్ట్‌ మూవీంగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ కంపెనీ ‘నెస్లే ఇండియా’ వివాదంలో చిక్కుకుంది. మతపరమైన అంశం జోలికి పోవడంతో సోషల్‌ మీడియాలో కంపెనీని నెటిజనులు దుమ్మెత్తి పోశారు. దీంతో క్షమాపణలు చెప్పిన కంపెనీ.. తన చర్యను వెనక్కి తీసుకుంది. 


విషయంలోకి వెళ్తే..  నెస్లే ఇండియా కంపెనీ నుంచి కిట్ క్యాట్ బార్‌ చాక్లెట్‌ ఎంత ఫేమస్సో తెలియంది కాదు. ఈ చాక్లెట్‌ రేపర్‌పై జగన్నాథ స్వామితో పాటు బాలభద్ర, సుభద్ర మాతా చిత్రాలను ముద్రించింది. ఈ చర్యతో మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరు ప్రకటించుకున్నారు. చాక్లెట్‌లు తిన్నాక ఎక్కడ పడితే అక్కడ రేపర్‌లను పడేస్తారన్నది వాళ్ల అభ్యంతరం. ఈ నేపథ్యంలో కొందరు ట్విటర్‌ వేదికగా తమ ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరికొందరు ఎఫ్‌ఎంసీజీ(Fast-moving consumer goods) అయిన నెస్లేకు పలువురు విజ్ఞప్తులు సైతం చేశారు. 

ఈ పరిస్థితులతో నెస్లే ఇండియా దిద్దుబాటు చర్యకు దిగింది. ఒడిశా సంప్రదాయన్ని ఇతర ప్రాంతాలకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఏడాదిగా ప్రయత్నిస్తున్నామని ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఆర్ట్‌ను, ఆర్టిస్టులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ పని చేశాం. ఇదెంత సున్నితమైన అంశమో మేం అర్థం చేసుకోగలం. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే.. చింతిస్తున్నాం’’ అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది నెస్లే కంపెనీ. అయితే వివాదాన్ని ముందే ఊహించిందేమో..  ముందస్తు చర్యగా, గత సంవత్సరం మార్కెట్ నుండి ఈ ప్యాక్‌ల ఉపసంహరణను చేపట్టామని ట్విటర్‌ వేదికగా ప్రకటించుకుంది నెస్లే ఇండియా. 

ఇదిలా ఉంటే నెస్లే ఇండియాకు ఇలాంటి వివాదాలేం కొత్త కాదు. కిందటి ఏడాది ఏప్రిల్‌లో మణిపూర్‌లో ఉన్న కెయిబుల్‌ లాంజావో నేషనల్‌ పార్క్‌ను.. మేఘాలయాలో ఉన్నట్లు రేపర్‌ మీద ప్రచురించి తిట్లు తింది. ఆపై క్షమాపణలు చెప్పింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement