వివాదంలో నెస్లే కిట్ క్యాట్ చాక్లెట్
ఫాస్ట్ మూవీంగ్ కన్జూమర్ గూడ్స్ కంపెనీ ‘నెస్లే ఇండియా’ వివాదంలో చిక్కుకుంది. మతపరమైన అంశం జోలికి పోవడంతో సోషల్ మీడియాలో కంపెనీని నెటిజనులు దుమ్మెత్తి పోశారు. దీంతో క్షమాపణలు చెప్పిన కంపెనీ.. తన చర్యను వెనక్కి తీసుకుంది.
విషయంలోకి వెళ్తే.. నెస్లే ఇండియా కంపెనీ నుంచి కిట్ క్యాట్ బార్ చాక్లెట్ ఎంత ఫేమస్సో తెలియంది కాదు. ఈ చాక్లెట్ రేపర్‌పై జగన్నాథ స్వామితో పాటు బాలభద్ర, సుభద్ర మాతా చిత్రాలను ముద్రించింది. ఈ చర్యతో మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరు ప్రకటించుకున్నారు. చాక్లెట్లు తిన్నాక ఎక్కడ పడితే అక్కడ రేపర్లను పడేస్తారన్నది వాళ్ల అభ్యంతరం. ఈ నేపథ్యంలో కొందరు ట్విటర్ వేదికగా తమ ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరికొందరు ఎఫ్ఎంసీజీ(Fast-moving consumer goods) అయిన నెస్లేకు పలువురు విజ్ఞప్తులు సైతం చేశారు.
Please remove the Lord Jagannath, Balabhadra and Mata Subhadra Photos In Your @kitkat Chocolate Cover . When People Are Finished The Chocolate They Are Through The Cover On Road, Drain, Dustbin, Etc . So Please Remove The Photos . @Nestle @NestleIndiaCare #Odisha#JayJagannath pic.twitter.com/jJNwSNEs9e
— BARSHA PRIYADARSHINI NAYAK (@i_am_barsha_) January 18, 2022
All the multi national companies in india, who have got right to make it "Mazak" of Hindu's Religious Sentiment. Try it on some other religion and see, it would happen!! Like!! what happened...
Ridiculous Mindset😡#nestle #kitkat #nestleindia pic.twitter.com/kSmATUF07u
— Madhu Begali (@madhu_Begali) January 20, 2022
ये #kitkat वालों को भगवान जगन्नाथ का चित्र छापकर क्या साबित करना चाहते हैं वह भी चाय के केटली में, ऐसे ही आस्था का खिलवाड़ करते रहते हैं यह लोग।#boycott_Kitkat pic.twitter.com/UWHvlAVYaP
— Murli sahu(MG) (@MurliGurupanch) January 20, 2022
ఈ పరిస్థితులతో నెస్లే ఇండియా దిద్దుబాటు చర్యకు దిగింది. ఒడిశా సంప్రదాయన్ని ఇతర ప్రాంతాలకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఏడాదిగా ప్రయత్నిస్తున్నామని ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఆర్ట్‌ను, ఆర్టిస్టులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ పని చేశాం. ఇదెంత సున్నితమైన అంశమో మేం అర్థం చేసుకోగలం. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే.. చింతిస్తున్నాం’’ అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది నెస్లే కంపెనీ. అయితే వివాదాన్ని ముందే ఊహించిందేమో.. ముందస్తు చర్యగా, గత సంవత్సరం మార్కెట్ నుండి ఈ ప్యాక్‌ల ఉపసంహరణను చేపట్టామని ట్విటర్ వేదికగా ప్రకటించుకుంది నెస్లే ఇండియా.
ఇదిలా ఉంటే నెస్లే ఇండియాకు ఇలాంటి వివాదాలేం కొత్త కాదు. కిందటి ఏడాది ఏప్రిల్‌లో మణిపూర్‌లో ఉన్న కెయిబుల్ లాంజావో నేషనల్ పార్క్‌ను.. మేఘాలయాలో ఉన్నట్లు రేపర్ మీద ప్రచురించి తిట్లు తింది. ఆపై క్షమాపణలు చెప్పింది.
Hi @Nestle @NestleIndia @KITKAT!
You are not just the leading plastics polluter in the world, you are also insulting the people of Manipur by putting misinformation in your cover saying our pride Keibul Lamjao National Park is in Meghalaya. This is unacceptable. Apologies asap! pic.twitter.com/cIObwUkSvv
— Licypriya Kangujam (@LicypriyaK) April 22, 2021
Finally they apologized! pic.twitter.com/lRPWOEVJ0j
— Licypriya Kangujam (@LicypriyaK) April 23, 2021