Puri Jagannath Swami
-
పూరీలో తెరుచుకున్న.. రత్నభండార్
భువనేశ్వర్: అశేష భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచి్చంది. ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ స్వామికి శతాబ్దాలుగా రాజులు, భక్తులు కానుకగా సమరి్పంచిన వజ్రాభరణాలు, వెండి, బంగారు నిల్వలను దాదాపు 46 ఏళ్ల తర్వాత తొలిసారిగా తనిఖీచేయనున్నారు. ఆభరణాలను తూకం వేసి, నాణ్యత లెక్కించి, అవసరమైతే మరమ్మతులు చేయనున్నారు. ఆలయంలోని రహస్య ఖజానా గది జీర్ణావస్థకు చేరిన నేపథ్యంలో గదికి మరమ్మతులు చేయనున్నారు. అంతవరకు అపారమైన ఖజానాను జాగ్రత్తగా వేరేచోట భద్రపరచనున్నారు. ప్రభుత్వ కమిటీ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేసి ఖజానా యజమానులైన విమలా మాత, మహాలక్షీ ఆజ్ఞ తీసుకున్నారు. తర్వాత ఖజానాకు రక్షకుడైన లోకనాథ్ స్వామి అనుమతి తీసుకున్నారు. మధ్యాహ్నం 1.28 గంటలకు ఖజానా గది తలుపులు తెరిచారు. 11 మంది మాత్రమే సంప్రదాయ దుస్తుల్లో గదిలోకి వెళ్లారు. ఆభరణాలను లెక్కించకుండానే సాయంత్రం 5.20కి బయటికి వచ్చారు. తరలింపు మరో రోజున‘‘లోపలి గది తాళాలు తెరుచుకోకపోవడంతో వాటిని పగలగొట్టి తెరిచాం. ఆభరణాలు, విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌లోకి తరలించి సీల్ వేశాం. అన్నింటినీ ఒకే రోజు తరలించడం కష్టం. త్వరలో తేదీని నిర్ణయించి తరలింపు మొదలెడతాం. రిపేర్ల తర్వాత ఆభరణాలకు విలువ కట్టే పని మొదలుపెడతాం’ అని ఏఎస్ఐ శాఖ అధికారులు వెల్లడించారు. గదిలోని ఆభరణాలను తరలించేందుకు సిద్ధం చేసిన 4.5 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల లోతున్న పెద్ద టేకు చెక్కపెట్టెలను గది వద్దకు తెప్పించారు. గదిలో పాములేవీ లేవని తేలింది. -
మరికొద్ది గంటల్లో తెరుచుకోనున్న పూరీ రత్నభాండాగారం
దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల గది రేపే తెరుచుకోనుంది.ఈ రత్న భాండాగారంపై ఏళ్లుగా చర్చ నడుస్తోంది. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని.. వీటి విలువ వెలకట్టలేనిదని అంచనాలున్నాయి.ఆదివారం పూరీలోని ప్రముఖ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని తెరవనున్నారు. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. అక్కడ ఉంచిన విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు.46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా.. సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. అయితే.. పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భండారంలోకి ప్రవేశించే అవకాశం ఉందని సేవకుడు హరేకృష్ణ మహాపాత్ర అంటున్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేస్తుండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించిన సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు కూడా.👉పూరీ జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. 👉అయితే.. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. అయితే.. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. దీంతో.. ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.👉భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రబీంద్ర నారాయణ్ మిశ్రా వెల్లడించారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటిని పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్‌లకు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ.. ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్కకట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదు.👉ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే.. హైకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ రఘుబీర్ దాస్ కమిషన్ బృందం భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న పరిశీలనకు వెళ్లింది. అయితే, రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందం.. పైకప్పుల పెచ్చులు ఊడటం, గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం లభ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. 👉జగన్నాథుని రత్న భాండాగారాన్ని గురించిన మొదటి అధికారిక వివరణ 1805లో అప్పటి పూరీ కలెక్టర్ చార్లెస్ గోమ్స్ నివేదికలో వచ్చింది. ఆ సమయంలో రత్న భాండాగారంలో రత్నాలు పొదిగిన బంగారు, వెండి ఆభరణాలు, 128 బంగారు నాణేలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1333 రకాల వస్త్రాలు లభించాయి. 👉కాగా, 1978లో జగన్నాథ ఆలయంలోని రత్నాల దుకాణాన్ని తెరిచినప్పుడు అక్కడ 454 బంగారు ఆభరణాలు, 293 వెండి వస్తువులు లభించాయి. 1982 – 1985 సంవత్సరాలలో రత్న భండాగారం తెరచుకుంది. కానీ అప్పటికి విషయాలు లెక్కించలేదు.👉జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. 2021లో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా మాట్లాడుతూ.. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం, 12,831 భరీల బంగారం (ఒక భరీ సుమారు 12 గ్రాములతో సమానం), 22,153 భరీల వెండితోపాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. ఎంతో విలువైన రాళ్లతో కూడిన 22,153 భరీల వెండి కూడా నిపుణులు గుర్తించారు. వీటితోపాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి. అయితే, పలు కారణాల వల్ల 14 బంగారు, వెండి ఆభరణాలను కొలవలేకపోయినందున వాటిని ఈ జాబితాలో పొందుపరచలేదని చెప్పారు.👉రఘుబీర్ కమిటీ నివేదికపై జులై 10లోగా స్పందన తెలియజేయాలంటూ ఒడిశా హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాళాలు ఎలా మాయమయ్యాయని.. డూప్లికేట్ తాళాలతో వాటిని తెరవాల్సిందేనని విపక్ష పార్టీలు పట్టుబట్టాయి. రాజకీయం చేయొద్దని బీజేడీ కోరినా.. బీజేపీ, కాంగ్రెస్‌లు వెనక్కి తగ్గలేదు. అయితే ఈలోపే ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీ.. ఎన్నికల హామీ మేరకు రత్న భాండాగారం తెరిపించేందుకు సిద్ధమైంది.👉ఒడిశా పూరీ జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారాన్ని తెరిపించి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ జడ్జి బిశ్వనాథ్ రథ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో.. ఈ నెల 14న(ఆదివారం) రత్న భాండాగారం రహస్య గదిని తిరిగి తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి ఆ కమిటీ సిఫార్సు చేసింది.👉జగన్నాథ ఆలయంలోని రత్నాల భాండాగారాన్ని తెరిచే బాధ్యతను బిశ్వనాథ్ కమిటీనే తీసుకుంది. ఆయన నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీకి ఈ బాధ్యతను అప్పజెప్పారు. ఈ కమిటీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో ఉంచిన వస్తువులను లెక్కించి వాటిపై నివేదికను రూపొందిస్తుంది. సంప్రదాయ దుస్తుల్లో.. రత్న భాండాగారం తెరిచి అక్కడున్న వస్తువులను లెక్కిస్తారని తెలుస్తోంది. -
బీజేపీ ఎంపీ అభ్యర్థి సంబీత్ పాత్ర వివాదాస్పద వ్యాఖ్యలు
భువనేశ్వర్: లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీల నేతలు ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. పూరీ జగన్నాథ స్వామిపై పూరీ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సంబిత్ పాత్ర ఆదివారం పాల్గొన్న ప్రచార ర్యాలీ అనంతం మీడియాతో మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ స్వామి ప్రధాని మోదీకి భక్తుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండింస్తూ.. విమర్శలు గుప్పించారు.సంబిత్ పాత్ర వ్యాఖ్యలపై ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ‘శ్రీ జగన్నాథ్ మహాప్రభు విశ్వానికినే దేవుడు. అటువంటి దేవుడినే మోదీకి భక్తుడు అనటం భగవంతున్ని కించపర్చడమే.దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జగన్నాథ్ స్వామి కోట్లాది మంది భక్తుల విశ్వాసలను కించిపర్చినట్లే’ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.BJP नेता संबित पात्रा का कहना है कि महाप्रभु भगवान श्री जगन्नाथ नरेंद्र मोदी के भक्त हैं। यह महाप्रभु का घोर अपमान है। इस बयान से करोड़ों भक्तों की आस्था को चोट पहुंची है।मोदी भक्ति में लीन संबित पात्रा को यह पाप नहीं करना चाहिए था। इस घृणित बयान के लिए खुद नरेंद्र मोदी को… pic.twitter.com/di0So3FxCz— Congress (@INCIndia) May 20, 2024 సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘అధికార మత్తులో ఉన్న బీజేపీ.. మన దేవుళ్లను సైతం విడిచిపెట్టడం లేదు. ఇక ప్రజలను మాత్రం ఎలా విడిచిపెడుతుంది. జగన్నాథ్ స్వామిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండింస్తున్నాం. కోట్లాది మంది జగన్నాథ్ స్వామి భక్తులను కించిపర్చినట్లే. జూన్ 4న ప్రజల సంకల్పం ముందు బీజేపీ అహకారం నాశనం అవుతుంది’ అని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు.విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి సంబిత్ పాత్ర స్పందించారు. ‘నమస్కార్ నవీన్ జీ. ఈ రోజు నరేంద్ర మోదీ రోడ్డు షోకు సంబంధించిన పలు న్యూస్ చానెల్స్‌తో మాట్లాడాను. ఎక్కడ మాట్లడినా ప్రధాని మోదీ.. శ్రీ జగన్నాథ్ స్వామికి పెద్ద భక్తుడని చెబుతా వస్తున్నా. అదేవిధంగా మోదీ.. జనన్నాథ్ స్వామికి భక్తుడు అనబోయి పొరపాటున వ్యతిరేకార్థంలో మాట్లాడాను. దీనిని పెద్ద విషయం చేయకండి. మనమంతా కొన్ని నోరుజారీ మాట్లాడుతాం’ అని సంబిత్ పాత్ర వివరణ ఇచ్చారు.Naveen Ji Namaskar!I gave number of bytes today to multiple media channels after the massive success of Shri Narendra Modiji’s Road Show in Puri today, everywhere I mentioned that Modi ji is an ardent “Bhakt” of Shri Jagannath Mahaprabhu ..by mistake during one of the bytes I… https://t.co/6Q1Kuj5E6O— Sambit Patra (Modi Ka Parivar) (@sambitswaraj) May 20, 2024 -
పూరీ, హసన్ ఆలయాల్లో తోపులాట
పూరీ/హసన్: ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుని ఆలయం, కర్ణాటకలో హసన్‌లో ఉన్న హసనాంబ ఆలయాల్లో శుక్రవారం వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. రద్దీ కారణంగా చోటుచేసుకున్న తోపులాటల్లో 27 మంది వరకు గాయపడ్డారు. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు వివరించారు. శుక్రవారం వేకువజాము నుంచే ఆలయానికి భక్తుల రాక మొదలైందని శ్రీ జగన్నాథ్ ఆలయ అధికారులు తెలిపారు. మంగళ హారతి సమయంలో గేట్లు తెరవడంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుని 10 మంది భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. వీరిలో ఎక్కువ మంది వృద్ధ మహిళలున్నారని అన్నారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు చెప్పారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారని తెలిపారు. ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువైందే తప్ప తోపులాట జరగలేదని పూరీ ఎస్పీ కేవీ సింగ్ స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలోని హసనాంబ ఆలయంలో క్యూలైన్లలోని వారు విద్యుత్ షాక్‌కు గురై 17 మంది వరకు గాయపడ్డారు. ఇది తోపులాటకు దారితీసింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. బాధితులు చెబుతున్న కరెంట్ షాక్ విషయమై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. -
వివాదంలో నెస్లే కిట్ క్యాట్ చాక్లెట్
ఫాస్ట్ మూవీంగ్ కన్జూమర్ గూడ్స్ కంపెనీ ‘నెస్లే ఇండియా’ వివాదంలో చిక్కుకుంది. మతపరమైన అంశం జోలికి పోవడంతో సోషల్ మీడియాలో కంపెనీని నెటిజనులు దుమ్మెత్తి పోశారు. దీంతో క్షమాపణలు చెప్పిన కంపెనీ.. తన చర్యను వెనక్కి తీసుకుంది. విషయంలోకి వెళ్తే.. నెస్లే ఇండియా కంపెనీ నుంచి కిట్ క్యాట్ బార్ చాక్లెట్ ఎంత ఫేమస్సో తెలియంది కాదు. ఈ చాక్లెట్ రేపర్‌పై జగన్నాథ స్వామితో పాటు బాలభద్ర, సుభద్ర మాతా చిత్రాలను ముద్రించింది. ఈ చర్యతో మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరు ప్రకటించుకున్నారు. చాక్లెట్లు తిన్నాక ఎక్కడ పడితే అక్కడ రేపర్లను పడేస్తారన్నది వాళ్ల అభ్యంతరం. ఈ నేపథ్యంలో కొందరు ట్విటర్ వేదికగా తమ ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరికొందరు ఎఫ్ఎంసీజీ(Fast-moving consumer goods) అయిన నెస్లేకు పలువురు విజ్ఞప్తులు సైతం చేశారు. Please remove the Lord Jagannath, Balabhadra and Mata Subhadra Photos In Your @kitkat Chocolate Cover . When People Are Finished The Chocolate They Are Through The Cover On Road, Drain, Dustbin, Etc . So Please Remove The Photos . @Nestle @NestleIndiaCare #Odisha#JayJagannath pic.twitter.com/jJNwSNEs9e — BARSHA PRIYADARSHINI NAYAK (@i_am_barsha_) January 18, 2022 All the multi national companies in india, who have got right to make it "Mazak" of Hindu's Religious Sentiment. Try it on some other religion and see, it would happen!! Like!! what happened... Ridiculous Mindset😡#nestle #kitkat #nestleindia pic.twitter.com/kSmATUF07u — Madhu Begali (@madhu_Begali) January 20, 2022 ये #kitkat वालों को भगवान जगन्नाथ का चित्र छापकर क्या साबित करना चाहते हैं वह भी चाय के केटली में, ऐसे ही आस्था का खिलवाड़ करते रहते हैं यह लोग।#boycott_Kitkat pic.twitter.com/UWHvlAVYaP — Murli sahu(MG) (@MurliGurupanch) January 20, 2022 ఈ పరిస్థితులతో నెస్లే ఇండియా దిద్దుబాటు చర్యకు దిగింది. ఒడిశా సంప్రదాయన్ని ఇతర ప్రాంతాలకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఏడాదిగా ప్రయత్నిస్తున్నామని ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఆర్ట్‌ను, ఆర్టిస్టులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ పని చేశాం. ఇదెంత సున్నితమైన అంశమో మేం అర్థం చేసుకోగలం. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే.. చింతిస్తున్నాం’’ అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది నెస్లే కంపెనీ. అయితే వివాదాన్ని ముందే ఊహించిందేమో.. ముందస్తు చర్యగా, గత సంవత్సరం మార్కెట్ నుండి ఈ ప్యాక్‌ల ఉపసంహరణను చేపట్టామని ట్విటర్ వేదికగా ప్రకటించుకుంది నెస్లే ఇండియా. ఇదిలా ఉంటే నెస్లే ఇండియాకు ఇలాంటి వివాదాలేం కొత్త కాదు. కిందటి ఏడాది ఏప్రిల్‌లో మణిపూర్‌లో ఉన్న కెయిబుల్ లాంజావో నేషనల్ పార్క్‌ను.. మేఘాలయాలో ఉన్నట్లు రేపర్ మీద ప్రచురించి తిట్లు తింది. ఆపై క్షమాపణలు చెప్పింది. Hi @Nestle @NestleIndia @KITKAT! You are not just the leading plastics polluter in the world, you are also insulting the people of Manipur by putting misinformation in your cover saying our pride Keibul Lamjao National Park is in Meghalaya. This is unacceptable. Apologies asap! pic.twitter.com/cIObwUkSvv — Licypriya Kangujam (@LicypriyaK) April 22, 2021 Finally they apologized! pic.twitter.com/lRPWOEVJ0j — Licypriya Kangujam (@LicypriyaK) April 23, 2021 -
అందం... చందం... ఆషాఢం
మాసం ఆషాఢం అనగానే శూన్యమాసమనీ, శుభకార్యాలకు పనికిరాదనీ పెదవి విరుస్తుంటారు చాలామంది. ఆషాఢమనేది కొత్తగా పెళ్లయిన భార్యాభర్తల పాలిట విలన్ లాంటిదని పళ్లు కొరుక్కుంటారు ఇంకొంతమంది. నిజానికి ఆషాఢమాసం తెలంగాణ ప్రాంతంలో గ్రామదేవతలకు బోనాలు సమర్పించే మాసం. విజయవాడ కనకదుర్గమ్మను భక్తులు శాకంబరిదేవిగా అలంకరించి మురిసిపోతారు. జగానికే నాథుడైన పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర జరిగేది ఈ నెలలోనే. అని తల్లీతండ్రీ తర్వాత స్థానంలో ఉన్న గురువులను పూజించి, గౌరవించే గురుపౌర్ణమి వేడుకలు జరిగేది ఆషాఢంలోనే కదా! ఆడపడచులందరూ గోరింటాకుతో ఎర్రగా మిరప్పళ్లలా పండిన చేతులతో కనిపించేది, ఈ కాలంలో విరివిగా వచ్చే వాక్కాయలతో పప్పు, మునగకాడలతో ఘుమఘుమలాడే చారో పులుసో కాచుకునేది, పొట్లకాయ కూర, పెరుగుపచ్చడి చేసుకునేది ఆషాఢంలోనే! కొత్తగా పెళ్లయ్యి, పుట్టింటి మీద బెంగను అత్తమామలకి చెప్పుకోలేక తనలో తనే సతమతమవుతూన్న కొత్తకోడలి పాలిట ఆపద్భాంధవి ఆషాఢం కాదా! అత్తగారు, మామగారు, ఆడపడచులు, మరుదులను అర్థం చేసుకుంటూ, వాళ్లకి కావలసినవి వేళకు ఎలా అమర్చగలమా అని ఆందోళన పడే వేళ నేనున్నానంటూ వచ్చి, కళ్లు తుడిచేది ఆషాఢమే కదా! మొన్న మొన్ననే పెళ్లయ్యింది.. భార్యతో ఇంకా అచ్చటాముచ్చటా తీరనేలేదు... ఇంతలోనే నా పాలిటి విలన్లా దాపురించింది ఆషాఢం అని తిట్టుకునే రోజులా ఇవి! ఎప్పుడో పోయాయి. ఆషాఢంలో అత్తాకోడలూ, అత్తా అల్లుడూ నే కదా, ఒక గడప దాటకూడనిది, మొగుడూ పెళ్లాల విషయంలో ఆ రూలేమీ లేదు కదా అని ఎట్లాగో అట్లా నానా తంటాలు పడుతూ వెళ్లి, భార్యను ఆమె బాబాయి ఇంటికో, పిన్నిగారింటికో రప్పించుకుంటే సరి, అక్కడ కూడా మర్యాదలన్నీ అందుకోవచ్చుకదా! అని ఆలోచించని వాళ్లు, దానిని వెంటనే అమలు చెయ్యని వాళ్లు చాలా అరుదు. అసలు ఆషాఢంలో కలుసుకోకూడనిదే భార్యాభర్తలు. ఎందుకంటే ఆషాఢంలో భార్యాభర్తలు కలిసి ఉండటం వల్ల గర్భోత్పత్తి జరిగి, ఎండాకాలంలో పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అప్పుడే భూమిమీదికొచ్చిన చిన్నారులు ఆ ఎండలను తట్టుకోలేక నానా ఇబ్బందులూ పడతారు. వాళ్ల బాధలు చూడలేక మళ్లీ మనం బాధపడాలి. అదొక్కటేనా? వ్యవసాయ పనులు ఆరంభమయ్యేది తొలకరి జల్లులు కురిసే ఆషాఢంలోనే. అంతకాలం ఎండవేడిమికి భూమిలోపలి పొరల్లో దాగి ఉన్న క్రిమికీటకాలు వర్షాలకు బయటికొచ్చి, వీరవిహారం చేస్తాయి. ఈగలూ దోమలూ ముసిరి, రకరకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అందుకే ఆషాఢంలో పెళ్లిళ్లు జరగవు. కొత్తగా పెళ్లయినవాళ్లేమో, భార్య ఇంటిదగ్గర ఉండి, ఆమె మీదకు ధ్యాస మళ్లుతూ ఉంటుంది. దానిమూలంగా వ్యవసాయ పనులు దెబ్బతింటాయి. రైతులకు ఇంత అన్నం పెట్టేది, ఆధారభూతమయ్యేదీ వ్యవసాయపనులే కదా, అందువల్లే పెద్దవాళ్లు నవ వధూవరుల మధ్యలో ఆషాఢాన్ని అడ్డం పెట్టారు. ఇన్ని విషయాలున్నాయన్నమాట ఆషాఢంలో అత్తాకోడలూ ఒక ఇంటి గడప దాటకూడదనడం వెనక! ఇక ఆషాఢం వచ్చింది మొదలు- గోరింటాకు పెట్టుకోకూడదటే ఆ చేతులకూ అని బామ్మలు, అమ్మమ్మలు సణుగుడు మొదలెడతారు. వాళ్ల సణుగుడు తట్టుకోలేక కన్నెపిల్లలు ఎవరి దొడ్లోనో ఉన్న గోరింట చెట్టునుంచి ఇంత ఆకు దూసుకొచ్చి, అందులో ఇంత చింతపండు ముద్ద వేసి, మధ్యమధ్యలో నాలుగు బొట్లు మజ్జిగ వేస్తూ నూరడం మొదలెడతారు. మెదిగిందా లేదా అని రోట్లోకి ఆకును తోసేటప్పుడే చిలకముక్కుల్లా ఎర్రగా పండిన అమ్మ చేతులని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. కొత్తగా పెళ్లయి, పుట్టింటికి వచ్చిన నవ వధువులు కూడా ఆషాఢంలో చేతులనిండా గోరింటాకు పెట్టుకుని, తిరిగి అత్తారింటికి వెళ్లాక అమ్మ లేదా చెల్లి పెట్టిన గోరింటాకు చేతులను చూసుకుంటూ వారి జ్ఞాపకాల్లో మునిగిపోతారు. ఎర్రగా పండిన చేతులను భర్తకు చూపించి మురిసిపోతారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనక శాస్త్రీయ కారణాలేమిటంటే, గోరింట వల్ల గోళ్లకు అందం రావడమేకాక, గోరుచుట్టు వంటివి రాకుండా ఉంటాయి. గోరింటాకు మందారంలా పండితే మంచిమొగుడొస్తాడని, సింధూరంలా పూస్తే కలవాడొస్తాడని పెద్దలు చెబుతారు. అదే వివాహితలకు అయితే వారి కడుపు, కాపురం కూడా చక్కగా పండుతాయని పెద్దలు చెబుతారు. ఇవన్నీ ఒకప్పటి తీపి జ్ఞాపకాలు. ఇప్పుడయితే ఆషాఢం వచ్చిందంటే బంపర్ సేల్సు, డిస్కౌంట్ సేల్సు, ఆఫర్ల మీద ఆఫర్లు, కేజీల్లెక్కన చీరలమ్ముతారు... క్రెడిట్ కార్డుకు చిల్లులు పొడుస్తారు. సెల్ఫోన్లు కూడా ఒకటి కొంటే మూడు ఉచితం అని ఊరించడం, కొన్న తర్వాత ఫ్రీ పీసులకు మా పూచీ లేదని ముందే చెప్పాం కదండీ అని గిల్లుతూనే కావాలంటే, మరో పీసొచ్చింది చూడండి, ఎక్స్ఛేంజ్ చేసుకుని చూడండి అని ఊరడింపులు... ఇవి చూస్తుంటే ఆషాఢమంటేనే ఒకలాంటి బెంగ. డిస్కౌంట్ అంటేనే దిగులు..! - బాచి