బీజేపీ ఎంపీ అభ్యర్థి సంబీత్‌ పాత్ర వివాదాస్పద వ్యాఖ్యలు | Sambit Patra Slip Of Tongue On Lord Jagannath And PM Modi Creates Controversy, Opposition Condemn | Sakshi
Sakshi News home page

Sambit Patra Controversy: బీజేపీ ఎంపీ అభ్యర్థి సంబీత్‌ పాత్ర వివాదాస్పద వ్యాఖ్యలు

Published Tue, May 21 2024 7:23 AM | Last Updated on Tue, May 21 2024 9:51 AM

Sambit Patra slip of tongue on Lord Jagannath Opposition condemn

భువనేశ్వర్‌: లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీల నేతలు ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. పూరీ జగన్నాథ స్వామిపై పూరీ​ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ  అభ్యర్థి సంబిత్‌ పాత్ర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సంబిత్‌ పాత్ర ఆదివారం పాల్గొన్న ప్రచార ర్యాలీ అనంతం మీడియాతో మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ స్వామి ప్రధాని మోదీకి భక్తుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రతిపక్షాలు ఆ  వ్యాఖ్యలను తీవ్రంగా ఖండింస్తూ.. విమర్శలు గుప్పించారు.

సంబిత్‌ పాత్ర వ్యాఖ్యలపై ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌ స్పందించారు. ‘శ్రీ జగన్నాథ్‌ మహాప్రభు విశ్వానికినే దేవుడు. అటువంటి దేవుడినే మోదీకి భక్తుడు అనటం భగవంతున్ని కించపర్చడమే.దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం.  ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జగన్నాథ్‌ స్వామి కోట్లాది మంది భక్తుల  విశ్వాసలను కించిపర్చినట్లే’ అని ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.

 

సంబిత్‌ పాత్ర చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘అధికార మత్తులో ఉ‍న్న బీజేపీ.. మన దేవుళ్లను సైతం విడిచిపెట్టడం లేదు. ఇక ప్రజలను మాత్రం ఎలా విడిచిపెడుతుంది. జగన్నాథ్‌ స్వామిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండింస్తున్నాం. కోట్లాది మంది జగన్నాథ్‌ స్వామి భక్తులను కించిపర్చినట్లే. జూన్ 4న ప్రజల సంకల్పం ముందు బీజేపీ అహకారం నాశనం అవుతుంది’ అని  ‘ఎక్స్‌’ వేదికగా మండిపడ్డారు.

విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి సంబిత్‌ పాత్ర  స్పందించారు. ‘నమస్కార్‌ నవీన్‌ జీ.  ఈ రోజు నరేంద్ర మోదీ రోడ్డు షోకు సంబంధించిన పలు న్యూస్‌ చానెల్స్‌తో మాట్లాడాను. ఎక్కడ మాట్లడినా ప్రధాని మోదీ.. శ్రీ జగన్నాథ్‌ స్వామికి పెద్ద భక్తుడని చెబుతా వస్తున్నా. అదేవిధంగా మోదీ.. జనన్నాథ్‌ స్వామికి భక్తుడు అనబోయి పొరపాటున వ్యతిరేకార్థంలో మాట్లాడాను. దీనిని పెద్ద విషయం చేయకండి. మనమంతా కొన్ని నోరుజారీ మాట్లాడుతాం’ అని సంబిత్‌ పాత్ర వివరణ  ఇచ్చారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement