ప్రధాని మోదీ వ్యాఖ్యలపై నవీన్‌ పట్నాయక్‌ కౌంటర్‌.. | What Naveen Patnaik Said On PM Modi Conspiracy Behind His Health Remark | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై నవీన్‌ పట్నాయక్‌ కౌంటర్‌..

Published Wed, May 29 2024 9:22 PM | Last Updated on Wed, May 29 2024 9:51 PM

What Naveen Patnaik Said On PM Modi Conspiracy Behind His Health Remark

బిహార్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం నవీన్‌ పట్నాయక్‌, ప్రధాని నరేంద్ర మోదీ పరస్పర విమర్శలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యం చుట్టూ చేరాయి. సీఎం ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మోదీ స్పందిస్తూ.... రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఆరోగ్యం క్షీణించడం వెనక గల కారణాలపై ఓ కమిటీ వేసి విచారణ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

తాజాగా మోదీ వ్యాఖ్యలపై సీఎం నవీన్‌ పట్నాయక్‌ కౌంటరిచ్చారు. : తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.   తీవ్ర ఎండలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు.  తన ఆరోగ్యంపై  ప్రధాని మోదీకి అంత ఆందోళన ఉంటే.. తనకు ఫోన్ చేసి ఉండాల్సిందని పట్నాయక్ అన్నారు. గత పదేళ్లుగా తన ఆరోగ్యంపై బీజేపీ పుకార్లు పుట్టిస్తోందని విమర్శించారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, గత నెల రోజులుగా రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నానని, ఈ విషయంలో ప్రధానికి హామీ ఇస్తున్నానని ఎద్దేవా చేశారు. తన ఆరోగ్యం బాగా లేకపోతే ఈ ఎండ వేడిమి మధ్య నేను ప్రచారం చేయలేనని అన్నారు.

కాగా ఒడిశాలో బారపదాలో ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుడూ..సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘నవీన్‌ ఆరోగ్యం విషయంలో ఏదో కుట్ర జరుగుతోందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. సీఎం అనారోగ్యం వెనుక ఎవరున్నారని తెలుసుకోవడం ఒడిషా ప్రజల హక్కు.ఆయన తరఫున ప్రభుత్వాన్ని నడుపుతోన్న వ్యక్తినే ముఖ్యమంత్రి ఆరోగ్యం క్షీణించడానికి కారణమా? ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. పట్నాయక్‌ ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలను అన్వేషించేందుకు కమిటీని ఏర్పాటుచేస్తాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

ఒడిశా ముఖ్యమంత్రి కదలికలను కూడా సీఎం సన్నిహితుడు పాండియన్‌ నియంత్రిస్తున్నాడంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించిన మరుసటిరోజే ప్రధాని ఈవిధంగా స్పందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement