ముంబై పేలుళ్ల కారకుడు, ఉగ్రవాది యాకూబ్ మెమన్ను ఈ నెల 30న ఉరి తీయనున్నారు. ఉరిశిక్ష అమలును ఆపాలంటూ మెమెన్ దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో టాడా కోర్టు అతనికి విధించిన ఉరిశిక్షను జూలై 30న అమలు చేయనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్న మెమెన్కు అదే జైల్లో ఈ శిక్ష అమలు కానుంది. 1993 మార్చి, 12 ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో సుమారు 257 మంది మరణించారు. 700 మంది తీవ్రంగా గాయపడిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. యాకూబ్ను ముంబై పేలుళ్ల కుట్రదారుడుగా తేల్చిన టాడా కోర్టు 2007 లో యాకూబ్ , మరో పదిమందికి ఉరిశిక్ష విధించింది. అయితే మార్చి 21, 2013న తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు, యకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన పది మందికి ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షకు తగ్గించింది.
Published Wed, Jul 15 2015 3:14 PM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement