ప్రముఖ బాంగ్రా పాప్ గాయకుడు దలేర్ మెహందీని మనుషుల అక్రమ రవాణా కేసులో పాటియాలా కోర్టు దోషిగా తేల్చింది. తన మ్యూజికల్ ట్రూప్ విదేశాల్లో చేసే కార్యక్రమాల్లో భాగంగా అక్కడి వెళ్లే వారితో పాటు.. కొంత మందిని అక్రమంగా విదేశాలకు తీసుకెళ్లినట్టుగా 2003లో దలేర్ మెహందీ, అతని సోదరుడు షంషేర్ సింగ్‌లపై కేసు నమోదైంది. యూఎస్, యూకే, కెనడా లతో పాటు మరికొన్ని దేశాలకు దలేర్ మనుషులను తీసుకెళ్లినట్టుగా ఆరోపణలు వచ్చాయి