న్యూఢిల్లీ: జమ్ము విమానాశ్రయం వద్ద ఎయిర్‌ఫోర్స్ కార్యాకలాపాలు నిర్వహించే చోట జంట పేలుళ్ల కలకలం నెలకొంది. శనివారం అర్ధరాత్రి దాటాక హై సెక్యూరిటీ జోన్ పరిధిలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. అయితే పేలుళ్లు స్వల్ప తీవ్రతతో జరగడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది.
కాగా, రాత్రి 1గం.35ని. నుంచి 1.గం.42 ని.. ఈ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఒక దాడిలో పైకప్పు స్వల్పంగా దెబ్బతిందని, మరో పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగిందని ప్రకటించింది. ఈ ఘటనలో రెండు బ్యారక్‌లు ధ్వంసం అయ్యాయని, ఇద్దరు గాయపడినట్లు తొలుత సమాచారం అందించింది. అయితే డిఫెన్స్ పీఆర్వో మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లదేని ప్రకటించడం విశేషం.
Two low intensity explosions were reported early Sunday morning in the technical area of Jammu Air Force Station. One caused minor damage to the roof of a building while the other exploded in an open area.
— Indian Air Force (@IAF_MCC) June 27, 2021
కాగా, టెక్నికల్ ఏరియాల్లో ఈ ఘటన జరగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన విషయం తెలిసి ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ టీంలు రంగంలోకి దిగాయి. ఫోరెన్సిక్ టీంలు క్లూస్ కోసం గాలిస్తున్నాయి. డ్రోన్లలో ఐఈడీ బాంబులు అమర్చిన ఉగ్రవాదులు.. ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారేమోనని అనుమానిస్తున్నారు.
చదవండి: అలాగైతేనే పోటీ చేస్తా: మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment