Air port
-
షాకింగ్ వీడియో.. గాల్లోనే రెండు విమానాలు ఢీకొన్నాయా?
ఆకాశంలో తృటిలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఒక విమానం మరో విమానాన్ని ఢీకొట్టిందా? అన్నట్టుగా విమానాలు చేరువయ్యాయి. ల్యాండ్ అవుతున్న ఒక విమానం, టేకాఫ్ అవుతున్న మరో విమానం ఢీకొట్టుకోబోయాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. న్యూయార్క్‌లోని సిరక్యూస్ హాన్కాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జూలై ఎనిమిదో తేదీన ప్రధాన వాణిజ్య విమానయాన సంస్థలకు చెందిన రెండు విమానాలు ఢీకొట్టుకోబోయాయి. ఇక, ఎయిర్‌పోర్ట్‌లో కంట్రోలర్లు మొదట అమెరికన్ ఈగిల్ ఫ్లైట్ AA5511, PSA ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న బొంబార్డియర్ CRJ-700ను రన్‌వే 28లో ల్యాండ్ చేయడానికి క్లియర్ చేశారు. కొద్దిసేపటి తర్వాత వారు డెల్టా కనెక్షన్ DL5421, ఎండీవర్ ఎయిర్ నిర్వహిస్తున్న మరో CRJ-700కి అదే రన్‌వే నుండి బయలుదేరడానికి అనుమతి ఇచ్చారు.ఈ రెండు విమానాలు ఆకాశంలో ఒకానొక సమయంలో చాలా దగ్గరగా ఉన్నాయి. రెండు విమానాలు ఢీకొట్టుకునేంత పనైంది. ఫ్లైట్ రాడార్-24 వెబ్సైట్ ప్రకారం, విమానాలు ఒకదానికొకటి నిలువుగా 700-1,000 అడుగుల దూరంలోకి వచ్చాయి. ఈ సమయంలో డెల్టా విమానంలో 76 మంది ప్రయాణికులు ఉండగా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో 75 మంది ఉన్నారు. అదృష్టవశాత్తూ ప్రమాదం జరగకపోవడం ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. NEW: The FAA has launched an investigation after two planes nearly collided at New York’s Syracuse Hancock International Airport. A commercial flight was forced to abort the landing when an airplane taking off nearly ran into the plane. The planes came within just… pic.twitter.com/jW5pyqZCeM— Collin Rugg (@CollinRugg) July 10, 2024 ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ ఘటనపై సిరక్యూస్ హాన్కాక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ నుంచి విమాన కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలుగలేదన్నారు. ఈ ఘటనపై ఎఫ్ఏఏ విచారణ చేపట్టినట్టు తెలిపారు. -
కెనడా మోజులో వృద్ధునిగా మారిన యువకుడు
విదేశాలకు వెళ్లి, బాగా డబ్బు సంపాదించి, అక్కడే స్థిరపడాలని చాలామంది తాపత్రయ పడుతుంటారు. ఇందుకోసం సక్రమంగా ప్రయత్నాలు సాగించినవారు సాఫీగా విదేశాలకు వెళుతుంటారు. అయితే అక్రమ పద్దతుల్లో విదేశాలకు వెళ్లాలని ప్రయత్నంచే వారు చిక్కుల్లో పడుతుంటారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో 24 ఏళ్ల యువకుడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అరెస్టు చేసింది. ఈ కుర్రాడు 67 ఏళ్ల వ్యక్తి పాస్‌పోర్ట్‌పై కెనడా వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే విమానాశ్రయంలోని సెక్యూరిటీ సిబ్బందికి అతనిపై అనుమానం వచ్చింది. దీంతో అతనిని విచారించగా అసలు విషయం వెల్లడయ్యింది. నకిలీ గుర్తింపుతో విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని తేలింది.సీఎస్ఐఎఫ్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం టెర్మినల్-3 చెక్ ఇన్ ప్రాంతంలో అక్కడి సిబ్బంది అనుమానంతో ఒక వృద్ధుడిని విచారించగా, తాను 1957, ఫిబ్రవరి 10 న జన్మించానని, తన పేరు రష్విందర్ సింగ్ సహోటా అని అధికారులకు తెలిపాడు. ఎయిర్ కెనడా విమానంలో కెనడాకు వెళుతున్నట్లు తెలిపాడు. అయితే అధికారులు అతని పాస్‌పోర్ట్‌ను పరిశీలించగా దానిలోని వివరాలు, అతని రూపం భిన్నంగా ఉంది. అతను తన జుట్టుకు, గడ్డానికి తెల్ల రంగు వేసుకున్నాడని విచారణ అధికారులు గుర్తించారు.ఆ వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు చెకింగ్ పాయింట్‌కు తీసుకెళ్లారు. అక్కడ అధికారులు అతని మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా 2000, జూన్ 10 న జన్మించిన గురు సేవక్ సింగ్ పేరుతో ఉన్న మరో పాస్‌పోర్ట్ సాఫ్ట్ కాపీని గుర్తించారు. దీంతో అతని అసలు పేరు గురు సేవక్ సింగ్ అని, అతని వయసు 24 ఏళ్లని తేలింది. తాను సహోటా పేరుతో ఉన్న పాస్‌పోర్ట్‌పై ప్రయాణించేందుకు ప్రయత్నించానని అంగీకరించాడు. విచారణ అనంతరం అధికారులు ఆ యువకుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. -
ఢిల్లీలో భారీ వర్షం.. విమానాల రాకపోకలకు అంతరాయం!
దేశరాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం సాయంత్రం బలమైన ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇటువంటి ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపధ్యంలో 16 విమానాలను దారి మళ్లించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ విమానాలను సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య మళ్లించినట్లు ఆ అధికారి తెలిపారు. జైపూర్‌కు పది, లక్నోకు మూడు, అమృత్‌సర్‌కు రెండు, అహ్మదాబాద్‌కు ఒక విమానాన్ని పంపినట్లు పేర్కొన్నారు. ఐదు ఎయిర్ ఇండియా విమానాలను ఇతర ప్రాంతాలకు పంపినట్లు మరో అధికారి తెలిపారు. వీటిలో సిడ్నీ నుంచి వస్తున్న విమానాన్ని జైపూర్‌కు పంపించారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం, విమాన ట్రాఫిక్ కారణంగా గౌహతి నుండి ఢిల్లీకి విస్తారా విమానం యూకే 742ను జైపూర్‌కు మళ్లించినట్లు ఆ సంస్థ మీడియాకు తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన ట్రాఫిక్ కారణంగా విమాన కార్యకలాపాలు దెబ్బతిన్నాయని ఇండిగో ఎయిర్‌లైన్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తెలియజేసింది. విమాన ప్రయాణికులు సహాయం కోసం తమ అధికారులను సంప్రదించాలని తెలియజేసింది. కాగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ఢిల్లీలో కాలుష్యం కొంతమేర తగ్గవచ్చని అంచనా. ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్యం కారణంగా ఆకాశంలో పొగమంచు కమ్ముకుంది. మంగళవారం ఢిల్లీలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) శాస్త్రవేత్త ఆర్కె జెనామణి తెలిపారు. ఇది కూడా చదవండి: గుజరాత్లో అకాల వర్షాలు.. #6ETravelAdvisory : Flight operations to/from #Delhi are impacted due to heavy rain. You may keep a tab on your flight status by visiting https://t.co/TQCzzykjgA. For any assistance, feel free to DM. — IndiGo (@IndiGo6E) November 27, 2023 -
వాళ్లిద్దరు నిజంగా కలిశారా..?
Fact Check.. టీమిండియా యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం జట్టులో భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. తనకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న గిల్ మూడు ఫార్మట్లలోనూ(టెస్టు, వన్డే, టి20లు) కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. ఓపెనింగ్ స్థానంలో వస్తూ సెంచరీలతో దడ పుట్టిస్తున్న గిల్ రానున్న కాలంలో జట్టులో కీలక బ్యాటర్‌గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవలీ న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే, టి20 సిరీస్‌లోనూ శుబ్‌మన్ గిల్ అదరగొట్టాడు. ముఖ్యంగా టి20 ఆటకు సరిపోడు అని విమర్శలు వచ్చిన వేళ.. కివీస్‌తో జరిగిన మూడో టి20లో 63 బంతుల్లోనే 126 పరుగులు నాటౌట్.. సుడిగాలి ఇన్నింగ్స్‌తో గట్టి సమాధానమిచ్చాడు. తనపై ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నా ఈ ఇన్నింగ్స్‌తో అవన్నీ తొలగిపోయినట్లేనని చెప్పకనే చెప్పాడు గిల్. టీమిండియా మాజీ క్రికెటర్లు సహా కోహ్లి లాంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్ ఫ్యూచర్ స్టార్ క్రికెటర్ అంటూ గిల్‌పై పొగడ్తలు కురిపించాడు. కచ్చితంగా భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో గిల్ పాత్ర కీలకం కానున్నట్లు స్పష్టంగా తెలియరానుంది. ఈ విషయం పక్కనబెడితే.. సోషల్ మీడియాలో శుబ్‌మన్ గిల్‌కు సంబంధించిన ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరోయిన్, నటి సారా అలీఖాన్‌తో గిల్ ప్రేమాయణం నడుపుతున్నట్లు కొన్నాళ్ల నుంచి రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై అటు గిల్.. ఇటు సారా ఇద్దరు నోరు మెదపలేదు. అయితే మీడియా కంట పడకుండా వీరిద్దరు తమ ప్రేమాయణం కొనసాగిస్తునట్లు క్రికెట్ ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉండగానే.. బుధవారం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గిల్.. సారా అలీఖాన్‌లు సీరియస్‌గా మాట్లాడుకుంటున్న ఫోటోలు బయటికి వచ్చాయి. అయితే వాళ్లిద్దరు నిజంగా కలుసుకున్నారా లేదంటే ఇదంతా గాసిప్ రాయుళ్ల ఎడిటింగ్ పనేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే తాజాగా చక్కర్లు కొడుతున్న ఫోటో పాతదేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నిజానికి సారా అలీఖాన్ అహ్మదాబాద్‌కు రాలేదని.. ఇప్పుడు బయటికి వచ్చిన ఫోటో ఎడిటింగ్ అని.. ఎయిర్‌పోర్ట్‌లో కూర్చొని మాట్లాడుకుంటున్నట్లుగా క్రియేట్ చేశారని నెటిజన్లు పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం గతేడాది కూడా ఇలాంటి ఫోటోనే ఒకటి సోషల్ మీడియాలో పెట్టారని.. అది ఇప్పటిది మాత్రం కాదని కుండబద్దలు కొట్టారు. ఏది ఏమైనా గిల్-సారా అలీఖాన్‌లు మధ్య ప్రేయాయణం నడుస్తుందా లేదా అన్నది పక్కనబెడితే.. వీరికి సంబంధించిన వార్తలతో మాత్రం కొంతమంది బతికేస్తున్నారంటూ నెటిజన్లు పేర్కొన్నారు. ఇక గిల్, సారా అలీఖాన్‌లు కలిసి జైపూర్‌లోని ఒక రెస్టారెంట్లో తొలిసారి కనిపించడంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య ఏదో సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పంజాబీ నటి సోనమ్ భజ్వాతో టీవీ చాట్ షో సందర్భంగా గిల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఒక అమ్మాయితో డేటింగ్లో ఉన్నట్లు.. ఆమె పేరు సారా అని మాత్రమే చెప్పాడు. అయితే సారా అని పేరు చెప్పి ముందు వెనకాల ఏం చెప్పకుండా అభిమానులను కన్ఫ్యూజ్ అయ్యేలా చేశాడు. దీంతో కొంతమంది గిల్.. సారా అలీఖాన్‌తో కాకుండా సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్‌తో రిలేషిన్షిప్ కొనసాగిస్తున్నట్లు పుకార్లు పుట్టించారు. అయితే శుబ్‌మన్ గిల్ చెల్లెలలు షహనీల్కు సారా టెండూల్కర్ మంచి స్నేహితురాలు. వారిద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో తరచు యాక్టివ్‌గా ఉంటారు. ఈ స్నేహం కూడా గిల్, సారా టెండూల్కర్లు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సారా టెండూల్కర్, శుబ్‌మన్ గిల్లు దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వీరిద్దరు ఒకరినొకరు ఫాలో కాకపోవడంతో రిలేషన్షిప్ వార్తలకు కూడ బ్రేక్ పడినట్లయింది. దీంతో గిల్.. సారా అలీఖాన్తోనే డేటింగ్లో ఉన్నాడని.. వారిద్దరి ప్రేమాయణం నడుస్తుందంటూ మరోసారి సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. చదవండి: గిల్‌పై ఇషాన్ కిషన్ ఆగ్రహం.. ఏం పట్టనట్లుగా చహల్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్‌ను ఉతికారేసిన విండీస్ స్టార్ -
మహ్మద్ సిరాజ్ అభ్యర్థన.. స్పందించిన ఎయిర్‌లైన్స్
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత సిరాజ్.. విస్తారా విమానంలో ఢాకా నుంచి ముంబయికి చేరుకున్నాడు. కానీ, ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత సిరాజ్ మూడు బ్యాగుల్లో రెండు మాత్రమే వచ్చాయి. ఈ విషయం అక్కడి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వెంటనే తెచ్చిపెడతామని చెప్పారని, కానీ, ఎంతకీ రాలేదన్నాడు. ఈ మేరకు బ్యాగ్ మిస్సైందని ట్విట్టర్ ద్వారా సదరు ఎయిర్‌లైన్స్ సంస్థకు సిరాజ్ ఫిర్యాదు చేశాడు. ''నేను 26వ తేదీన వరుసగా UK 182, UK 951 విమానంలో ఢాకా నుంచి ఢిల్లీ మీదుగా ముంబయికి ప్రయాణించాను. నేను మూడు బ్యాగ్‌లతో చెక్ ఇన్ అయ్యాను. వాటిలో ఒకటి మిస్ అయ్యింది. కొద్దిసేపటిలో బ్యాగ్ కనుగొని డెలివరీ చేస్తామని ఎయిర్ లైన్స్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. బ్యాగ్‌లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. వీలైనంత త్వరగా బ్యాగ్‌ను హైదరాబాద్‌కు చేరవేయగలరు'' అంటూ ట్వీట్ చేశాడు. సిరాజ్ ట్వీట్‌పై స్పందించిన విస్తారా ఎయిర్‌లైన్స్.. వివరాలు పంపించాలని కోరింది. సిరాజ్ వివరాలు ఇచ్చాడు. అనంతరం సిబ్బంది తన బ్యాగ్ ఎక్కడుందో గుర్తించారని బుధవారం మరో ట్వీట్ ద్వారా సిరాజ్ వెల్లడించాడు. దాన్ని త్వరలోనే తన వద్దకు చేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. @airvistara I was traveling to Mumbai from Dhaka via Delhi on 26th on flight UK182 & UK951 respectively. I had checked in three bags out of which 1 has been misplaced. I was assured the bag will be found and delivered within no time but till now I have not heard anything. 1/2 pic.twitter.com/Z1MMHiaSmR — Mohammed Siraj (@mdsirajofficial) December 27, 2022 Hello Mr. Siraj, this sounds unfortunate. Please note that our staff will try its best to locate your baggage and will update you at the earliest. Rest you to please share your contact number and a convenient time via DM to connect with you. ~Bhumika https://t.co/IaDysdHZUk — Vistara (@airvistara) December 27, 2022 -
జనసైనికులు కాదు...జన సైకోలు : మంత్రి గుడివాడ అమర్నాథ్
-
మంత్రుల కార్లపై కర్రలు , రాళ్లతో దాడిచేసిన జనసేన కార్యకర్తలు
-
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద జనసేన కార్యకర్తల వీరంగం
-
రెండంతస్తుల్లో చర్లపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి రైల్వేస్టేషన్ ఆధునికీకరణపై దక్షిణమధ్య రైల్వే మరో ముందడుగు వేసింది. ఎయిర్‌పోర్టు తరహాలో చర్లపల్లి రైల్వేస్టేషన్ పునర్నిర్మాణానికి తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా విమానాశ్రయం తరహాలో తిరుపతి, సికింద్రాబాద్ స్టేషన్ల పునర్ అభివృద్ధికి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. తిరుపతి స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్‌కు ఒకట్రెండు రోజుల్లో టెండర్లు ఖరారు కానున్నాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్‌లో 4వ టర్మినల్‌గా ఇప్పటికే విస్తరణ పనులు చేపట్టిన చర్లపల్లి స్టేషన్‌ను సైతం ఎయిర్‌పోర్టు తరహాలో అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2023 జూన్ నాటికి చర్లపల్లి స్టేషన్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు పనుల్లో వేగం పెంచినట్లు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వేమేనేజర్ అభయ్‌కుమార్ గుప్తా తెలిపా రు. అన్ని సదుపాయాలతో వినియోగంలోకి రానున్న చర్లపల్లి స్టేషన్ నుంచి కాజీపేట్, విజయవాడ రూట్లో వెళ్లే రైళ్లను నడుపనున్నట్లు పేర్కొన్నారు. సేవలు ఇలా.... చర్లపల్లి స్టేషన్‌ను రెండంతస్తుల్లో పునర్ నిర్మించనున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రయాణికుల విశ్రాంతి గదులు, హోటళ్లు, రైల్వే అధికారుల కార్యాలయాలు తదితర సదుపాయాలు ఉంటాయి. విమానాశ్రయంలో లాగా ప్రయాణికులు ప్రవేశద్వారం నుంచి నేరుగా ప్లాట్‌ఫామ్‌కు చేరుకొనేలా మొదటి అంతస్తు ఉంటుంది. మొదటి విడతలో మొత్తం 8 లైన్లతో ప్లాట్‌ఫాంలను విస్తరిస్తారు. దశలవారీగా ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరగనుంది. అన్ని ప్లాట్‌ఫాంలకు చేరుకొనేలా ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. “రైళ్ల నిర్వహణకు పిట్లైన్లు, ఇక్కడి నుంచి రైళ్లను నడిపేందుకు ప్రత్యేక మార్గాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. చర్లపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా అప్రోచ్ రోడ్ల నిర్మాణం కూడా తుది దిశకు వచ్చింది’ అని డీఆర్ఎం వివరించారు. ఎయిర్‌పోర్టు తరహాలో స్టేషన్ పునర్ అభివృద్ధికి ఇటీవల నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్ పునర్ అభివృద్ధి కోసం ఒకట్రెండు రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. చర్లపల్లి నుంచే వందేభారత్... సెమీ హైస్పీడ్‌గా పేరొందిన వందేభారత్ రైళ్లను చర్లపల్లి నుంచే నడపనున్నారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చర్లపల్లి నుంచి విశాఖ, ముంబై తదితర మార్గాల్లో వందేభారత్ నడపాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైల్వేలోని అన్ని జోన్లకు దశలవారీగా వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
అఫ్గానిస్తాన్: ఎయిర్‌పోర్టులో కాల్పులు.. ఐదుగురు మృతి
-
Jammu Airport: జంట పేలుళ్ల కలకలం.. ఉగ్రకోణంలో దర్యాప్తు!
న్యూఢిల్లీ: జమ్ము విమానాశ్రయం వద్ద ఎయిర్‌ఫోర్స్ కార్యాకలాపాలు నిర్వహించే చోట జంట పేలుళ్ల కలకలం నెలకొంది. శనివారం అర్ధరాత్రి దాటాక హై సెక్యూరిటీ జోన్ పరిధిలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. అయితే పేలుళ్లు స్వల్ప తీవ్రతతో జరగడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. కాగా, రాత్రి 1గం.35ని. నుంచి 1.గం.42 ని.. ఈ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఒక దాడిలో పైకప్పు స్వల్పంగా దెబ్బతిందని, మరో పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగిందని ప్రకటించింది. ఈ ఘటనలో రెండు బ్యారక్‌లు ధ్వంసం అయ్యాయని, ఇద్దరు గాయపడినట్లు తొలుత సమాచారం అందించింది. అయితే డిఫెన్స్ పీఆర్వో మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లదేని ప్రకటించడం విశేషం. Two low intensity explosions were reported early Sunday morning in the technical area of Jammu Air Force Station. One caused minor damage to the roof of a building while the other exploded in an open area. — Indian Air Force (@IAF_MCC) June 27, 2021 కాగా, టెక్నికల్ ఏరియాల్లో ఈ ఘటన జరగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన విషయం తెలిసి ఎన్ఐఏ, ఎన్ఎస్జీ టీంలు రంగంలోకి దిగాయి. ఫోరెన్సిక్ టీంలు క్లూస్ కోసం గాలిస్తున్నాయి. డ్రోన్లలో ఐఈడీ బాంబులు అమర్చిన ఉగ్రవాదులు.. ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారేమోనని అనుమానిస్తున్నారు. చదవండి: అలాగైతేనే పోటీ చేస్తా: మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు -
ఇదేం ఆచారం: అదృష్టం కోసం వ్యక్తి తింగరి పని
బీజింగ్: మనిషి ఆశా జీవి. తన జీవితం గురించి రకరకాల కలలు కంటాడు. ఆర్థికంగా బాగా ఎదగాలని.. లగ్జరీగా జీవించాలని ఆశపడతాడు. తమ కలలు సాకారం చేసుకోవడం కోసం కొందరు బాగా కష్టపడితే.. మరి కొందరు మాత్రం ఈజీగా డబ్బు సంపాదించే మార్గాలపై ఆధారపడతారు. వీరిలో కొందరు లాటరీ టికెట్లు కొని అదృష్ట దేవత కోసం ఎదురు చూస్తుంటారు. మరికొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి అలాంటి పిచ్చి పని చేసి ఎయిర్ పోర్ట్ అధికారుల్ని, పోలీసుల్ని పరుగులు పెట్టించాడు. మనలో కొందరు ప్రయాణాలు చేసే సమయంలో రకరకాల ఆచారాలు, నమ్ముకాలు పాటిస్తుంటారు. వాటిలో బాగా ఫేమస్ కాయిన్ ట్రెడీషన్. అదేంటంటే ప్రయాణిస్తుండగా.. ఏదైనా నది తారసపడితే అందులోకి నాణేలు విసురాతారు. బస్సు, రైళ్లలో ప్రయాణం చేసే వారికే కాక.. విమానంలో ప్రయాణం చేసే వారు కూడా ఈ నమ్మకాన్ని పాటిస్తారు. వీరు ఏం చేస్తారు అంటే తాము ప్రయాణించబోయే విమానం ఇంజిన్లోకి కాయిన్స్ విసురుతారు. అలా చేస్తే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. తాజాగా ఓ యువకుడు అలాగే చేసి ఊచలు లెక్కపెడుతున్నాడు. నేషనల్ మీడియా కథనం ప్రకారం.. చైనాలోని వాంగ్ అనే యువకుడు వైఫాంగ్ నుండి హైకూకు వెళ్లాల్సి ఉంది. అందుకోసం వైఫాంగ్ ఎయిర్ పోర్ట్ నుంచి బీబు గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జీఎక్స్ 8814 నెంబర్ గల ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అనుకున్న సమాయానికి విమానం ఎక్కాడు. 148 మంది ప్రయాణిస్తున్న విమానం రన్ వే మీద ఉండగా వాంగ్ తన దగ్గరున్న ఆరు కాయిన్స్‌ను ఎర్రటి పేపర్లో చుట్టి విమానం ఇంజిన్లోకి విసిరాడు. అవి కాస్త కిందపడిపోవడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు, పోలీసులు పరుగులు పెట్టారు. భద్రతా సమస్యల కారణంగా ఎయిర్ పోర్ట్ అధికారులు ఫ్లైట్ రద్దు చేశారు. ఈ సంఘటన తరువాత యువకుడు వాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు. అయితే ఇలా ఫ్లైయిట్ ఇంజిన్లోకి కాయిన్స్ విసరడం ఇది తొలిసారేం కాదు. గతేడాది 28 ఏళ్ల యువకుడు 'అదృష్టం' కోసం విమానం ఇంజిన్లోకి కాయిన్స్ విసిరాడు. దీంతో యువకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎయిర్ పోర్ట్ అధికారులు 1,20,000 యువాన్ల (రూ. 12.36 లక్షలు) జరిమానా చెల్లించాలని ఆదేశించారు. చేసేదేం లేక సదరు యువకుడు ఆ మొత్తాన్ని కట్టాడు. చదవండి: కడుపులో 4.15 కిలోల బంగారం -
కడుపులో 4.15 కిలోల బంగారం
సాక్షి ప్రతినిధి, చెన్నై: బంగారాన్ని మాత్రల రూపంలో మింగేసి అక్రమరవాణాకు పాల్పడిన 8 మందిని చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వీరి కడుపులో నుంచి రూ. 2.17 కోట్ల విలువైన 4.15 కిలోల బంగారాన్ని బయటకు తీశారు. వందేభారత్ ఎయిర్ ఇండియా విమానం జనవరి 30న దుబాయ్ నుంచి చెన్నైకి చేరుకుంది. అందులో వచ్చిన ప్రయాణికుల్లో 8 మందిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో తనిఖీ చేశారు. ఏమీ దొరకలేదు. అయినా అనుమానం తీరకపోవడంతో విమానాశ్రయంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి కడుపు భాగాన్ని ఎక్స్‌రే తీయగా బంగారు ఉండలు మాత్రల రూపంలో కనపడ్డాయి. (చదవండి: నువ్వు గ్రేట్ బంగారం!) మంచినీళ్లు తాగుతూ మాత్రల రూపంలో బంగారాన్ని మింగినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. ఈ 8 మందిని చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి బంగారు మాత్రలను బయటకు తీశారు. వారి కడుపులో నుంచి వచ్చిన రూ.2.17 కోట్ల విలువైన 4.15 కిలోల 161 బంగారు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. కనకవల్లి, నిషాంతి, కళా, ఫాతిమా, పుదుకోటైకి చెందిన జయరాజ్, జగదీష్, కబర్‌ఖాన్, రామనాథపురానికి చెందిన హకీంలను చెన్నై విమానాశ్రయానికి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. -
బెంగళూరు చేరుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, బెంగళూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరుకు చేరుకున్నారు. సీఎం పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూలులో సీటు దక్కించున్న విషయం తెలిసిందే. తన కుమార్తెను పారిస్‌కు పంపేందుకు వైఎస్ జగన్ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. సీఎం జగన్ రాకతో బెంగళూరు విమానశ్రయం వద్ద ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. కాగా ప్రపంచంలోని టాప్ 5 బిజినెస్ స్కూల్స్‌లో ఇన్సీడ్ ఒకటి. అక్కడ హర్షారెడ్డి మాస్టర్స్ చేయనున్నారు. హర్షారెడ్డి చిన్నప్పటి నుంచి రాసిన ప్రతి పరీక్షలోనూ డిస్టింక్షన్ సాధించారు. ఇప్పటికే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన బహుళ జాతి సంస్థ(ఎంఎన్సీ)లో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా ఉద్యోగం వచ్చినా.. దానిని వదులుకుని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ చేయడానికి మొగ్గుచూపారు. -
కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు..?
సాక్షి, కొత్తగూడెం : కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఈ ప్రాంత వాసుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడచెలక వద్ద సుమారు 1600 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం అధ్యయనం చేసి వెళ్లింది. ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. అయితే ఇక్కడ భూసేకరణ ప్రధాన సమస్యగా ఉంది. అదేవిధంగా సమీపంలోనే అభయారణ్యం ఉండడంతో పర్యావరణ అనుమతులు సైతం తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా భూసేకరణ అంశం కీలకం కానుంది. పునుకుడచెలక వద్ద ఉన్న భూములు అత్యధికం ఆదివాసీలవే కావడం గమనార్హం. తమ భూములను ఇచ్చేది లేదని వారు చెబుతుండడంతో కొంత సందిగ్ధం నెలకొంది. ఏఏఐ బృందం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా స్థల సమస్య రావడంతో ఈ అంశం వెనక్కు వెళ్లింది. అయితే తాజాగా రాష్ట్రంలో ఈనెల 20 నుంచి 23 వరకు మరోసారి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో త్రిసభ్య బృందం పర్యటించనుంది. రాష్ట్రంలో ఆరు చోట్ల ఎయిర్‌పోర్టులు నిర్మించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే బాధ్యతను ఏఏఐకు అప్పగించింది. దీంతో గతంలో ఏఏఐ బృందం కొత్తగూడెం, వరంగల్, మహబూబ్‌నగర్ ఏరియాల్లో పర్యటించి అధ్యయనం చేసింది. సంబంధిత నివేదికను ఆ బృందం ఉన్నతాధికారులకు అందజేసింది. ప్రస్తుతం రానున్న బృందం ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లో పర్యటించనుంది. 20న ఢిల్లీ నుంచి నాగ్‌పూర్ రానున్నారు. 21న నాగ్‌పూర్ నుంచి నేరుగా ఆదిలాబాద్ వస్తారు. 22న నిజామాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 23న హైదరాబాద్ మీదుగా అవసరాన్ని బట్టి మరోసారి మహబూబ్‌నగర్‌లో పర్యటించి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ బృందంలో అమిత్‌కుమార్, నీరజ్గుప్తా, కుమార్ వైభవ్ ఉన్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరక్టర్ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు పర్యటన వివరాలు ప్రకటించారు. కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే మిలటరీ అవసరాలకు... కొత్తగూడెం విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేసుకుంటే బహుముఖ అవసరాలకు ఉపయోగపడుతుందనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనగా తెలుస్తోంది. ఇక కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు భూసేకరణ ప్రధాన సమస్య. ఇతరత్రా చూసుకుంటే అనుకూల అంశాలు ఉన్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 200 కిలోమీటర్ల లోపు ఎయిర్‌పోర్టు నిర్మించకూడదనే ఒప్పందం ఉంది. అయితే కొత్తగూడెం శంషాబాద్ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో దీనికి ఆ సమస్య లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ విమానాశ్రయం కోసం అనేక ఏళ్లుగా డిమాండ్ ఉంది. అశ్వాపురం మండలంలోని హెవీవాటర్ ప్లాంట్ ఉద్యోగులు కొత్తగూడెం ఎయిర్‌పోర్టు సాధన కమిటీ సైతం వేసుకోవడం గమనార్హం. అదేవిధంగా జిల్లాలో మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో సింగరేణి, సారపాకలో ఐటీసీ, పాల్వంచలో ఎన్ఎండీసీ, నవభారత్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎయిర్‌పోర్టు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే మిలటరీ అవసరాలకు సైతం ఉపయోగపడుతుందనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో అభయారణ్యం విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉంది. జిల్లాకు ఆనుకుని ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉండడంతో పాటు సమీపంలో ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో దండకారణ్యం విస్తరించి ఉంది. సరిహద్దుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య నిరంతరం పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తే అత్యవసర సమయాల్లో మిలటరీ అవసరాలకు సైతం ఉపయోగపడుతుందని రెండు ప్రభుత్వాల ఆలోచనగా తెలుస్తోంది. -
భారీగా బంగారం పట్టివేత
సాక్షి, బెంగళూరు : బెంగుళూరు ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఓ ఢిల్లీ ప్రయాణికుడి వద్ద రూ. 2.03 కోట్లు విలువచేసే 6.6 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల కర్ణాటక నుంచి బంగారం అక్రమంగా రవాణా అవుతున్న విషయం తెలిసిందే. బంగారం అక్రమణకు పాల్పడుతున్న ఓ ముఠాను బెంగుళూరు పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. -
రామగుండంలో విమానాశ్రయం!
పాలకుర్తి(రామగుండం) పెద్దపల్లి : జిల్లాలో విమానం ఎగరానుంది. బసంత్‌నగర్ కేంద్రంగా విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఐదుజిల్లాలో విమానశ్రయాలు నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నూతన విమానాశ్రయాల ఏర్పాటుపై పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఏవియేషన్ అధికారులతో హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో రామగుండంతో పాటు వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో విమాన సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల సహకారం తీసుకుని సర్వేప్రక్రియ వేగవంత చేయాలని మంత్రి అధికారులను కోరారు. దీంతో బసంత్‌నగర్‌లో నూతన విమానాశ్రయం ఏర్పాటు అంశానికి బలం చేకూరింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విమానాలు ఎగరనున్నాయి. 40 ఏళ్లు కేశోరాం ఆధీనంలో.. బసంత్‌నగర్‌లో 1972లోనే విమానాశ్రయం ఏర్పాటు జరిగింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు వాయుదూత్ సర్వీసులు నడిచేవి. అయితే ఆరోజుల్లో ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వం కొంతకాలం తర్వాత విమాన సర్వీసులు నిలిపివేసింది. అనంతరం స్థానిక కేశోరాం సిమెంట్ కర్మాగారం యాజమాన్యం విమానశ్రయ స్థలాన్ని లీజుకు తీసుకుని దాదాపు 40 సంవత్సరాల పాటు సొంత అవసరాల కోసం వినియోగించుకుంటోంది. ఏటా కంపెనీ ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ కోసం కంపెనీ అధినేత బసంత్‌కుమార్ బిర్లా ప్రత్యేక విమానంలో వచ్చినప్పుడు విమానశ్రయాన్ని వినియోగించేవారు. ఐదేళ్ల క్రితం కేశోరాం యాజమాన్యం విమానశ్రయ స్థలం లీజు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ప్రభుత్వం రన్‌వే స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. వైఎస్సార్ హయాంలో బీజం.. బసంత్‌నగర్‌లో విమానశ్రయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో తెరమీదకి వచ్చింది. రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన అనంతరంÐð ఎస్ఆర్ బసంత్‌నగర్‌లో విమానశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారంచుట్టారు. ఇందుకోసం అధికారులు భూసర్వే కూడా చేపట్టారు. వైఎస్సార్ అకాల మరణంతో ఈఅంశం మరుగున పడింది. తదనంతరం 2013లో విమానశ్రయ ఏర్పాటు అంశం మళ్లీ తెరమీదికి వచ్చింది. జిల్లా అధికారులు ఇచ్చిన సర్వేరిపోర్టు ఆధారంగా బసంత్‌నగర్‌కు వచ్చిన ఏవియేషన్ అధికారులు స్థానికంగా ఉన్నరన్వేతో పాటు ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.అయితే ప్రతిపాదిత స్థలం చుట్టూ హైటెన్షన్ విద్యుత్ టవర్లు ఉన్నాయనే కారణంతో అధికారులు విముఖత చూపారు. ప్రస్తుతం నిర్వహించిన సర్వేలో టవర్ లైన్లను తప్పించి 290 ఎకరాల స్థలాన్ని అధికారులు సేకరించారు. సులభం కానున్న రవాణా... పారిశ్రామిక జిల్లాగా నూతనంగా ఏర్పాటైన పెద్దపల్లి జిల్లాలో విమానశ్రయం ఏర్పాటుతో సమీప ప్రాంతంలో రవాణాసౌకర్యం మరింత మెరుగపడనున్నది. జిల్లా పరిధిలో రామగుండం, ఎన్టీపీసీ, సింగరేణి, కేశోరాం మొదలగు పరిశ్రమలుండగా, ప్రస్తుతం ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్టీపీసీలో మరో రెండు నూతన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతోంది. ఈ పరిశ్రమల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు కార్మికులు, ఉద్యోగులు, అధికారులుగా పనిచేస్తున్నారు. వీరంతా సొంత అవసరాలతో పాటు వృత్తి, వ్యాపార కార్యాకలాపాల కోసం దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తూ.. వస్తుంటారు. ప్రస్తుతం వీరు రైలు మార్గాల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. లేదంటే హైదరాబాద్‌కు వెళ్లి విమానం ఎక్కాల్సి ఉంటుంది. తద్వారా ఖర్చుతో పాటు సమయాభావం అధికమవుతున్నది. ఈనేపథ్యంలో స్థానికంగా విమానశ్రయం ఏర్పాటైతే అన్నివర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. మరో ‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’ గా పేరుగాంచిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విమానశ్రయం నిర్మాణం జరిగితే పెద్దపల్లి జిల్లా మరింత వేగంగా అభివృద్ధి చెంది ప్రత్యక్షంగా పరోక్షంగా వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నాలుగు జిల్లాలకు అనుకూలం... బసంత్‌నగర్‌లో విమానశ్రయం ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల ప్రజలకు విమానయాన సౌకర్యం అందుబాటులోకి రానున్నది. బసంత్‌నగర్ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండగా కరీంనగర్, జగిత్యాల జిల్లా కేంద్రాలకు 45 కిలోమీటర్లు, మంచిర్యాల జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో ఆయా జిల్లాల పరిధిలోని ప్రాంత వాసులకు ఇంది ఎంతో అనుకూలంగా మారనుంది. -
అక్రమ వెంచర్లపై కొరడా
అడ్డాకుల (దేవరకద్ర): మండల కేంద్రం శివారులో అక్రమంగా వెలచిన అక్రమ వెంచర్లపై అధికారులు కొరడా ఝులిపించారు. గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించిన వాటిపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇంతకు ముందు కూడా అధికారులు చర్యలు చేపట్టినా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు గ్రామ పంచాయతీకి కేటాయించాల్సిన 10శాతం స్థలాలను కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తుండటంతో మరోసారి అధికారులు ఉక్కుపాదం మోపడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం అడ్డాకుల శివారులోని సర్వే నంబర్ 16, 131, 132లలో ఏర్పాటు చేసిన వెంచర్లపై అధికారులు చర్యలు మొదలుపెట్టారు. గ్రామ పంచాయతీకి స్థలాలకు కేయించకుండా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేయడంతో అధికారులు ఇంతకు ముందు నోటీసులు జారీ చేశారు. అయినా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు స్పందించకపోవడంతో సర్పంచ్ రఘు, పంచాయతీ కార్యదర్శి జయవర్ధన్‌రెడ్డి, ఉపసర్పంచ్ భీమన్నయాదవ్ జేసీబీ సాయంతో హద్దురాళ్లను తొలగించారు. అనుమతి లేని ప్లాట్లను ఎవరైనా కొనుగోలు చేస్తే ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాతే ప్లాట్లను విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు. లేదంటే కొనుగోలుదారులు నష్టపోతారని చెప్పారు. విమానాశ్రమం వస్తుందని..! అడ్డాకుల, గుడిబండ గ్రామాలకు సమీపంలో మినీ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండటంతో ప్లాట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. గతం కంటే రెట్టింపు ధరలకు దళారులు ప్లాట్లను విక్రయిస్తున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా వెలసిన అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లు నష్టపోయే అవకాశం ఉన్నందున ఎవరూ వాటిని కొనుగోలు చేయవద్దని అధికారులు కోరుతున్నారు. విమానాశ్రయం ఏర్పాటు అవుతుందన్న సాకుతో అక్రమ వెంచర్లలోని ప్లాట్లను విక్రయిస్తే వాటిని కొనుగోలు చేసి మోసపోవద్దని సూచిస్తున్నారు. -
సిస్టర్ అంటే పిస్టల్ అని ఎయిర్‌పోర్ట్‌ను వణికించాడు
సాక్షి, జైపూర్ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సీనియర్ నేత శశి థరూర్ మాటలను తప్పుగా అర్థం చేసుకొన్న ఓ వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌లో భయానక వాతావరణం సృష్టించాడు. ప్రమాదపు అలారం మీట నొక్కి ఎయిర్పోర్ట్ అధికారులను కాసేపు పరుగులుపెట్టించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఢిల్లీ నుంచి వస్తున్న తన సోదరిని రిసీవ్ చేసుకునేందుకు జైపూర్ ఎయిర్‌పోర్ట్‌కు శశిథరూర్ వెళ్లారు. ఇదే విషయాన్ని థరూర్ మరో వ్యక్తితో అవతలి వ్యక్తికి చెప్పారు. 'వెయిటింగ్ ఫర్ సిస్టర్' అని థరూర్ అనగా ఆ మాటను 'వెయిటింగ్ ఫర్ పిస్టల్' అన్నట్లుగా మరో ప్రయాణీకుడు అర్థం చేసుకొన్నాడు. వెంటనే ఈ మాటలు విని ప్యానిక్ బటన్ ప్రెస్ చేశాడు. ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బందికి చెప్పి వారు చర్యలు తీసుకునేలా చేశాడు. అయితే, థరూర్ వద్దకు చేరుకున్న అధికారులు ఆయనను చూసి షాకయ్యారు. 'థరూర్‌ను మేం ఏమీ అనలేదు. ఆయన ఏ తుపాకీ కలిగి లేరు. ఆయన తన సోదరి కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు. ఆయనను ఎవరో ప్రశ్నించగా మై సిస్టర్ అని చెప్పారు. కానీ, సరిగా వినని మరో వ్యక్తి పిస్టల్ అనుకొని మాకు ఫిర్యాదు చేశాడు. వివరాలు తెలియడంతో ఆ విషయం అంతటితో ముగిసింది' అని ఎయిర్పోర్ట్ అధికారి చెప్పారు. -
అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి
మధురపూడి సభలో సీఎం చంద్రబాబు సీఎం రాక ఆలస్యం విద్యార్థినులతో సభలో నృత్యాలు సాక్షి, రాజమహేంద్రవరం : అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగా మధురపూడి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం ఉన్న 1,750 మీటర్ల రన్‌వేను 3,165 మీటర్లకు విస్తరించేందుకు సోమవారం భూమి పూజ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ కాకినాడలో మరో పోర్టు నిర్మిస్తామని తెలిపారు. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఉభయ గోదావరి జిల్లాలు కేరళ రాష్ట్రాన్ని మించిపోతాయన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే పూర్తవడం సాధ్యం కాదన్నారు. ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ రాజమహేద్రవరం నగరాన్ని ప్రఖ్యాత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ప్యాకేజీ ఇచ్చిందన్నారు. ప్రాంగణమంతా కళాశాల విద్యార్థులే... సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులను నేతలు తరలించారు. సీఎం పర్యటన 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 2:50 గంటలకు మధురపూడికి చేరుకోవాల్సిన ముఖ్యమంత్రి 3:35 నిమిషాలకు చేరుకున్నారు. దీంతో సభకు వచ్చిన వారిని ఉత్సాహపరిచేందుకు వేదికపై కళాశాల విద్యార్థులచే నృత్యాలు చేయించారు. సీఎం పర్యటనతో ఎయిర్‌పోర్టు రోడ్డులో దాదాపు మూడు గంటలసేపు ఆంక్షలు విధించారు. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. విమానా్రÔ¶ యానికి వచ్చే ప్రయాణికుల వాహనాలను అనుమతించలేదు. తమ వారిని తీసుకెళ్లేందుకు వచ్చిన వారినీ బయటే ఉంచేశారు. ఊపిరి పీల్చుకున్న పోలీసులు కశ్మీర్‌లోని యూరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరగడంతో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోని భద్రతా సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మధురపూడి విమానాశ్రయం విస్తరణకు భూమి పూజ చేసి అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించడంతో ఏమవుతుందోనని పోలీసుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం సభకు భారీగా జనసమీకరణ చేయడంతో విమానా్రÔ¶ యానికి భద్రత కల్పిస్తున్న స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్, పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయడం కష్టసాధ్యమైంది. సీఎం వచ్చి వెళ్లే వరకు పోలీసు ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. చివరకు కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి సభ వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
హైదరాబాద్ లో ల్యాండ్ అయిన అతిపెద్ద విమానం
హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్దదైన కార్గో విమానం శుక్రవారం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన అంటనోవ్ ఏఎన్-225 మ్రియా విమానం దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయానికి విచ్చేసింది. ఈ విమానానికి ఆరు టర్బోఫ్యాన్ ఇంజిన్లు ఉండడమే కాకుండా గరిష్ఠంగా 640 టన్నుల సామర్థ్యంతో రవాణా చేయగలుగుతుంది. తుర్కమెనిస్థాన్ నుంచి విమానం హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. -
ఇదేనా అభివృద్ధి?
విమానాశ్రయ నిర్మాణ భూముల సర్వేకెళ్లిన అధికారులకు చుక్కెదురు పాలకులను కంకరతేలిన రోడ్డుపై నడిపించిన కడపల్లె వాసులు శాంతిపురం: ‘వున అభివృద్ధికి ఎరుుర్‌పోర్టు అవసరం. భూవుులు ఇవ్వమంటే ఎలా’ అన్న పాలకులకు జనం చుక్కలు చూపించారు. తమ గ్రామాలకు తీసుకెళ్లి దుస్థితికి చేరిన రోడ్లు, అక్కడి పరిస్థితులను చూపించారు. కోతకు గురై, కంకర తేలిన రోడ్లపై అర కిలోమీటరు దూరం వరకు నడిపించారు. ఈ ఘటన సీఎం సొంత నియోజకవర్గంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూములు సర్వే చేసేందుకు ఢిల్లీ నుంచి అధికార బృందం వచ్చింది. వారి వెంట జెడ్పీటీసీ సభ్యురాలు శకుంతల, ఎంపీపీ పుష్ప నారాయుణస్వామి మండలంలోని కడపల్లి ప్రాంతానికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఆ గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. అభివృద్ధి అంటే ఇదేనా..? అంటూ నిలదీశారు. తవు గ్రావూనికి ఉన్న వుట్టి రోడ్డు, ఊరి పరిస్థితి చూడాలని అభ్యర్థించారు. అందుకు వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు వినలేదు. జెడ్పీటీసీ సభ్యురాలు, ఎంపీపీని బలవంతంగా లాక్కెళ్లి కోతకు గురై, కంకర తేలిన రోడ్డులో దాదాపు అర కిలో మీటరు వరకు నడిపించారు. ఈ రోడ్డులో నడవలేవుంటూ వారు వూర్గ వుధ్యలోనే ఆగిపోయూరు. ఆపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు, పాలకులు అక్కడి నుంచి వెనుదిరిగారు. -
ఆలస్యంగా విమానాలు...ఆందోళనలో ప్రయాణీకులు
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో జెట్ ఎయిర్ వేస్ సర్వీసులు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనివల్ల ప్రయాణీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు చేస్తున్న ఫిర్యాదులపై కూడా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోతున్నారు. -
'మాకు విమానాశ్రయం వద్దు'
విజయనగరం: విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ల్యాండ్ పూలింగ్‌లో తమ భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. సుమారు 7 వేలమంది రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. విమానాశ్రయం వస్తే జిల్లా బాగుపడదని తమకు నీరు అందిస్తే చాలని వారు అన్నారు. సుమారు 150 గ్రామాల రైతులు విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. విమానాశ్రయానికి వందల ఎకరాలు అవసరం లేదని, కేవలం ఆరు, ఏడు ఎకరాలతో విమానాశ్రయం నిర్మించవచ్చని రైతులు మండిపడుతున్నారు. భూముల్ని లాక్కుంటే సహించేది లేదని రైతులు స్పష్టం చేశారు. తమకు విమానాశ్రయాలు అవసరం లేదని, ఉండేందుకు నీడ, తినేందుకు కూడు ఉంటే చాలని రైతులు చెబుతున్నారు. -
సాగునీటి కొరత తీవ్రంగానే ఉంది
డక్కిలి: జిల్లాలో 2 లక్షలు ఎకరాలకు సాగునీటి కొరత ఉందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. మండలంలోని కేబీపల్లి పంచాయతీలోని భీమవరంలో చెరువులో పూడికతీత పనులు, కేబీపల్లి ప్రాథమికి పాఠశాలలో చెట్టు-నీరు కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. 15 రోజుల్లో జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటించి చెరువులను పరిశీలిస్తానని, ఆయకట్టు రైతులతో మాట్లాడి తగు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ఎక్కడా సెం టుభూమి కూడా ఎండకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అగిన బ్రాంచి కాలువ పనులను వచ్చే ఏడాదికల్లా పూర్తిచేస్తామని రైతులకు హమీ ఇచ్చారు. జిల్లాలోని 10,956 చెరువుల్లో పూడికతీత పనులను ప్రజలకు కల్పిస్తామన్నారు. నెల్లూరులో విమానాశ్రయం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. దుగరాజుపట్నం పోర్టు రాబోతుందని చెప్పారు. కలెక్టర్ జానకి మాట్లాడుతూ జిల్లాలో ఒకటిన్నర కోటి మొక్కలను పెంచుతున్నామన్నారు. జిల్లాలో రూ.120కోట్లతో 5,000 పనులను చేపడతామన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని, దీని అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల న్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, జేసీ ఇంతియాజ్, ఏజేసీ రాజ్‌కుమార్, డ్వామా పీడీ వెంకసుబ్బయ్య, డీఆర్డీఏ పీడీ చంద్రమౌళి, డీఈ ఓ అంజనేయులు, జెడ్పీ సీఈఓ జితేంద్ర, ఎంపీపీ పోలంరెడ్డి వెంకటరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ఏలేశ్వరం రామచంద్రనాయు డు, సర్పంచ్ నాగం శైలజ, ఎంపీటీసీ సభ్యుడు పాడి సిద్దయ్య పాల్గొన్నారు. ఉన్న పంటలకు సాగునీరందిస్తాం మనుబోలు : కనుపూరు, కావలి కాలువల పరిధిలో త్వరలో కోతకు రానున్న పంటలకు సాగు నీరందించి కాపాడే ప్రయత్నం చేస్తామని మంత్రి నారాయణ రైతులకు భరోసా ఇచ్చారు. గురువారం ఆయన మండలంలోని జట్లకొండూరు, బండేపల్లి, మడమనూరు, అక్కంపేట గ్రామాల్లో చెరువులను, బండేపల్లి బ్రాంచ్ కాలువ, సాగు నీరందక ఎండిపోతున్న పొలాలను పరిశీలించారు. సాగునీరందక పంటలు ఎండిపోవడం బాధాకరమన్నా రు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండుతున్నాయన్న విమర్శలు సరికాదన్నారు. కనుపూరు, కావలి కాలువల పరిధిలో రానున్న 20-40 రోజుల వ్యవధిలో కోతకు వచ్చే పంటలకు సాగునీరు అందించి పంటలను కాపాడేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇప్పటికే ఎండిపోయిన పంటలకు గాను రైతులకు నష్టపరిహారం చెల్లిస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమివ్వలేదు. మండలంలోని మెట్ట గ్రామాలను సస్యశ్యామలం చేసేందుకు డేగపూడి నుం చి గొట్లపాళెం వరకూ లింక్ కెనాల్‌ను పూర్తి చేస్తామన్నారు. కండలేరు నీటిని ఈ కెనాల్ ద్వారా బండేపల్లి బ్రాంచ్ కెనాల్లో కలిపి మండలంలోని పొలాలకు అందిస్తామన్నారు. ప్రస్తుతం అత్యవసరం గా జిల్లాలో చెరువుల పూడికతీతకు రూ.10కోట్ల నిధులు మంజూరుచేశామన్నారు. రాబోయే ఐదేళ్లలో జిల్లాలో 1.5 నుంచి 2 లక్షల ఎకరాలు ఆయకట్టు పెరిగే లా కృషిచేస్తామన్నారు. వారానికి మూ డు, నాలుగురోజులు జిల్లాలోనే ఉంటానన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు కిరణ్ కుమార్‌రెడ్డి, బాస్కర్‌రెడ్డి, ఆవుల వెంకటరమణయ్య వారి గ్రామాల్లో సమస్యల ను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈఈ వెంకటేశ్వరరావు, ఎస్ఈ రెడ్డయ్య, డీఈ సమీవుల్లా, ఏఈ ఠాగూర్, ఆర్డీఓ సుబ్రమణ్యంరెడ్డి, తహశీల్దార్ కేవీ రమణయ్య, ఎంపీడీఓ హేమలత, ఏఈలు మనోజ్‌నాయక్, సురేష్‌కుమార్ పాల్గొన్నారు.