గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు షురూ | Greenfield Airport also have authority like private and government | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు షురూ

Published Sat, Aug 24 2013 3:21 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

Greenfield Airport also have authority like private and government

దగదర్తి, న్యూస్‌లైన్: మండలంలోని సున్నపుబట్టి వద్ద ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఎయిర్‌పోర్టు అథారిటీ బృందం స్ప ష్టం చేసింది. దీంతో ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు త్వరలో శ్రీకారం జరిగే అవకాశాలు ఉన్నాయని జిల్లా అధికారులు చెబుతున్నా రు. ఇప్పటికే ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన 3,407.77 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని రెవెన్యూ అధికారులు ఎయిర్‌పోర్టు అథారిటీ బృందానికి తెలిపారు. శుక్రవారం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కమిటీ సభ్యులు భూములను పరిశీ లించారు.
 
 గతంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు పర్యటించేటప్పటికీ 2,480 ఎకరాలు మాత్రమే రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రస్తుత అవసరాల అనుగుణంగా రన్‌వేకు ఇబ్బంది అనుకూలంగా ఢిల్లీ అధికారుల ప్రణాళిక ప్ర కారం 60 మిలియన్స్ పాసింజర్స్ కెపాసిటీకి అనుకూలంగా ఉండేందుకు 3,407 ఎకరాల భూమి విస్తీర్ణాన్ని గుర్తించారు. అందులో పట్టా భూమి 419.66, డీ-ఫారం పట్టా భూమి 526.71, అటవీ భూమి 1121.09, ప్ర భుత్వ భూమి 545.74, సీజేఎఫ్‌ఎస్ భూమి 483.84, చె రువు 29.86, కొండ 281.87 వెరసి మొత్తం 3407.77 ఎ కరాల భూమి ఉందని వివరించారు. దగదర్తి నుంచి సు న్నపుబట్టి వరకు తూర్పు, పడమరకు ఆరు కిలో మీటర్ల పొడవుతో, సున్నపుబట్టి నుంచి దామవరం రోడ్డు వరకు రెండు కిలో మీటర్ల వెడల్పులో ఉన్న భూముల్లో విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా ఉందని ఢిల్లీ అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
 
 దీంతో కొత్త సర్వే ప్రకారం సున్నపుబట్టిలోని చెరువుతో పా టుగా జాతీయ రహదారికి పడమర వైపునున్న గృహాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. తమ గృహాలు విమానాశ్రయానికి పోతాయని తెలిసి ఆందోళన చెందుతున్నా రు. అధికారులు మాత్రం నెల్లూరు, ఒంగోలు పట్టణాలకు మధ్య భాగంలో విమానాశ్రయం ఏర్పాటు చేయడంత్లో రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పారిశ్రామికంగా ఫ్యాక్టరీలు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెబుతున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement