సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్
అథారిటీ నుంచి షోకాజ్ నోటీసు
న్యూఢిల్లీ: విద్యుత్ స్కూటర్ల సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌కు వరుసగా షాకులు తగులుతున్నాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అనుచిత వ్యాపార విధానాలతో నిబంధనలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలతో సెంట్రల్ కన్సూ్యమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించినట్లు ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలిపింది.
అయితే, తమ ఆర్థిక, నిర్వహణ కార్యకలాపాలపై దీని ప్రభావం ఉండదని పేర్కొంది. అలాగే, సీసీపీఏ ఎలాంటి జరిమానాలు విధించలేదని తెలిపింది. ఈ వార్తలతో ఓలా షేరు మంగళవారం మరో 6% పడింది. చివర్లో కోలుకుని 5 శాతం లాభంతో రూ. 95 వద్ద క్లోజైంది. వాహనాల సర్విస్ నాణ్యతపై సోషల్ మీడియాలో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాతో ఓలా వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ మధ్య వాగ్వాదం ప్రభావంతో సోమవారం కంపెనీ షేరు 8 శాతం పైగా పతనమైంది.
Comments
Please login to add a commentAdd a comment