షాకింగ్‌ వీడియో.. గాల్లోనే రెండు విమానాలు ఢీకొన్నాయా? | Delta And American Eagle Planes Nearly Collide In Mid-Air | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ వీడియో.. గాల్లోనే రెండు విమానాలు ఢీకొన్నాయా?

Published Thu, Jul 11 2024 9:17 PM | Last Updated on Thu, Jul 11 2024 9:17 PM

Delta And American Eagle Planes Nearly Collide In Mid-Air

ఆకాశంలో తృటిలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఒక విమానం మరో విమానాన్ని ఢీకొట్టిందా? అన్నట్టుగా విమానాలు చేరువయ్యాయి. ల్యాండ్‌ అవుతున్న ఒక విమానం, టేకాఫ్‌ అవుతున్న మరో విమానం ఢీకొట్టుకోబోయాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. న్యూయార్క్‌లోని సిరక్యూస్ హాన్‌కాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జూలై ఎనిమిదో తేదీన ప్రధాన వాణిజ్య విమానయాన సంస్థలకు చెందిన రెండు విమానాలు ఢీకొట్టుకోబోయాయి. ఇక, ఎయిర్‌పోర్ట్‌లో కంట్రోలర్‌లు మొదట అమెరికన్ ఈగిల్ ఫ్లైట్ AA5511, PSA ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న బొంబార్డియర్ CRJ-700ను రన్‌వే 28లో ల్యాండ్ చేయడానికి క్లియర్ చేశారు. కొద్దిసేపటి తర్వాత వారు డెల్టా కనెక్షన్ DL5421, ఎండీవర్ ఎయిర్ నిర్వహిస్తున్న మరో CRJ-700కి అదే రన్‌వే నుండి బయలుదేరడానికి అనుమతి ఇచ్చారు.

ఈ రెండు విమానాలు ఆకాశంలో ఒకానొక సమయంలో చాలా దగ్గరగా ఉన్నాయి. రెండు విమానాలు ఢీకొట్టుకునేంత పనైంది. ఫ్లైట్‌ రాడార్‌-24 వెబ్‌సైట్ ప్రకారం, విమానాలు ఒకదానికొకటి నిలువుగా 700-1,000 అడుగుల దూరంలోకి వచ్చాయి. ఈ సమయంలో డెల్టా విమానంలో 76 మంది ప్రయాణికులు ఉండగా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో 75 మంది ఉన్నారు.  అదృష్టవశాత్తూ ప్రమాదం జరగకపోవడం ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు.

 

 

ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ ఘటనపై సిరక్యూస్ హాన్‌కాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్ట్ నుంచి విమాన కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలుగలేదన్నారు. ఈ ఘటనపై ఎఫ్‌ఏఏ విచారణ చేపట్టినట్టు తెలిపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement