
ఆలస్యంగా విమానాలు...ఆందోళనలో ప్రయాణీకులు
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో జెట్ ఎయిర్ వేస్ సర్వీసులు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనివల్ల ప్రయాణీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు చేస్తున్న ఫిర్యాదులపై కూడా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోతున్నారు.