ఇదేనా అభివృద్ధి?
విమానాశ్రయ నిర్మాణ భూముల సర్వేకెళ్లిన అధికారులకు చుక్కెదురు
పాలకులను కంకరతేలిన రోడ్డుపై నడిపించిన కడపల్లె వాసులు
శాంతిపురం: ‘వున అభివృద్ధికి ఎరుుర్‌పోర్టు అవసరం. భూవుులు ఇవ్వమంటే ఎలా’ అన్న పాలకులకు జనం చుక్కలు చూపించారు. తమ గ్రామాలకు తీసుకెళ్లి దుస్థితికి చేరిన రోడ్లు, అక్కడి పరిస్థితులను చూపించారు. కోతకు గురై, కంకర తేలిన రోడ్లపై అర కిలోమీటరు దూరం వరకు నడిపించారు. ఈ ఘటన సీఎం సొంత నియోజకవర్గంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూములు సర్వే చేసేందుకు ఢిల్లీ నుంచి అధికార బృందం వచ్చింది. వారి వెంట జెడ్పీటీసీ సభ్యురాలు శకుంతల, ఎంపీపీ పుష్ప నారాయుణస్వామి మండలంలోని కడపల్లి ప్రాంతానికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఆ గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. అభివృద్ధి అంటే ఇదేనా..? అంటూ నిలదీశారు.
తవు గ్రావూనికి ఉన్న వుట్టి రోడ్డు, ఊరి పరిస్థితి చూడాలని అభ్యర్థించారు. అందుకు వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు వినలేదు. జెడ్పీటీసీ సభ్యురాలు, ఎంపీపీని బలవంతంగా లాక్కెళ్లి కోతకు గురై, కంకర తేలిన రోడ్డులో దాదాపు అర కిలో మీటరు వరకు నడిపించారు. ఈ రోడ్డులో నడవలేవుంటూ వారు వూర్గ వుధ్యలోనే ఆగిపోయూరు. ఆపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు, పాలకులు అక్కడి నుంచి వెనుదిరిగారు.