
ప్రయాణికుడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం
సాక్షి, బెంగళూరు : బెంగుళూరు ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఓ ఢిల్లీ ప్రయాణికుడి వద్ద రూ. 2.03 కోట్లు విలువచేసే 6.6 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల కర్ణాటక నుంచి బంగారం అక్రమంగా రవాణా అవుతున్న విషయం తెలిసిందే. బంగారం అక్రమణకు పాల్పడుతున్న ఓ ముఠాను బెంగుళూరు పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment