ముడా స్కామ్‌: సీఎం సిద్ధరామయ్యకు షాక్‌ | CM Siddaramaiah MUDA scam judgement details | Sakshi
Sakshi News home page

ముడా స్కామ్‌: సీఎం సిద్ధరామయ్యకు షాక్‌

Published Tue, Sep 24 2024 11:17 AM | Last Updated on Mon, Sep 30 2024 6:51 PM

CM Siddaramaiah MUDA scam judgement details

బెంగళూరు: కర్ణాటకలో  సంచలనం సృష్టించిన ముడా స్కామ్‌ కేసులో సీఎం సిద్ధరామయ్యకు షాక్‌ తగిలింది. ఈ కేసులో గవర్నర్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ.. సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ముడా స్మామ్‌లో గవర్నర్‌  తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.  

ఇక.. గవర్నర్‌ ఆదేశాలను  సీఎం సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా హైకోర్టు తీర్పు వెల్లడించింది. బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమై భద్రత ఏర్పాటు చేశారు.

మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదంలో.. ఖరీదైన భూములు ఆయన భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్‌ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లోత్‌ అనుమతి ఇవ్వటం కర్ణాటక రాజకీయల్లో సంచలనం సృష్టించింది. 

ఇదిలాఉండగా... సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్‌లో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను  ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్‌ మార్కెట్‌ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది.

	కర్ణాటకలో ముడా స్కామ్ ప్రకంపనలు..

చదవండి: కర్ణాటకలో మరో కుంభకోణం కలకలం.. కోవిడ్ వేళ వెయ్యి కోట్ల స్కాం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement