డక్కిలి: జిల్లాలో 2 లక్షలు ఎకరాలకు సాగునీటి కొరత ఉందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. మండలంలోని కేబీపల్లి పంచాయతీలోని భీమవరంలో చెరువులో పూడికతీత పనులు, కేబీపల్లి ప్రాథమికి పాఠశాలలో చెట్టు-నీరు కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. 15 రోజుల్లో జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటించి చెరువులను పరిశీలిస్తానని, ఆయకట్టు రైతులతో మాట్లాడి తగు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ఎక్కడా సెం టుభూమి కూడా ఎండకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అగిన బ్రాంచి కాలువ పనులను వచ్చే ఏడాదికల్లా పూర్తిచేస్తామని రైతులకు హమీ ఇచ్చారు. జిల్లాలోని 10,956 చెరువుల్లో పూడికతీత పనులను ప్రజలకు కల్పిస్తామన్నారు. నెల్లూరులో విమానాశ్రయం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. దుగరాజుపట్నం పోర్టు రాబోతుందని చెప్పారు. కలెక్టర్ జానకి మాట్లాడుతూ జిల్లాలో ఒకటిన్నర కోటి మొక్కలను పెంచుతున్నామన్నారు.
జిల్లాలో రూ.120కోట్లతో 5,000 పనులను చేపడతామన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని, దీని అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల న్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, జేసీ ఇంతియాజ్, ఏజేసీ రాజ్‌కుమార్, డ్వామా పీడీ వెంకసుబ్బయ్య, డీఆర్‌డీఏ పీడీ చంద్రమౌళి, డీఈ ఓ అంజనేయులు, జెడ్పీ సీఈఓ జితేంద్ర, ఎంపీపీ పోలంరెడ్డి వెంకటరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ఏలేశ్వరం రామచంద్రనాయు డు, సర్పంచ్ నాగం శైలజ, ఎంపీటీసీ సభ్యుడు పాడి సిద్దయ్య పాల్గొన్నారు.
ఉన్న పంటలకు సాగునీరందిస్తాం
మనుబోలు : కనుపూరు, కావలి కాలువల పరిధిలో త్వరలో కోతకు రానున్న పంటలకు సాగు నీరందించి కాపాడే ప్రయత్నం చేస్తామని మంత్రి నారాయణ రైతులకు భరోసా ఇచ్చారు. గురువారం ఆయన మండలంలోని జట్లకొండూరు, బండేపల్లి, మడమనూరు, అక్కంపేట గ్రామాల్లో చెరువులను, బండేపల్లి బ్రాంచ్ కాలువ, సాగు నీరందక ఎండిపోతున్న పొలాలను పరిశీలించారు. సాగునీరందక పంటలు ఎండిపోవడం బాధాకరమన్నా రు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండుతున్నాయన్న విమర్శలు సరికాదన్నారు.
కనుపూరు, కావలి కాలువల పరిధిలో రానున్న 20-40 రోజుల వ్యవధిలో కోతకు వచ్చే పంటలకు సాగునీరు అందించి పంటలను కాపాడేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇప్పటికే ఎండిపోయిన పంటలకు గాను రైతులకు నష్టపరిహారం చెల్లిస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమివ్వలేదు. మండలంలోని మెట్ట గ్రామాలను సస్యశ్యామలం చేసేందుకు డేగపూడి నుం చి గొట్లపాళెం వరకూ లింక్ కెనాల్‌ను పూర్తి చేస్తామన్నారు.
కండలేరు నీటిని ఈ కెనాల్ ద్వారా బండేపల్లి బ్రాంచ్ కెనాల్‌లో కలిపి మండలంలోని పొలాలకు అందిస్తామన్నారు. ప్రస్తుతం అత్యవసరం గా జిల్లాలో చెరువుల పూడికతీతకు రూ.10కోట్ల నిధులు మంజూరుచేశామన్నారు. రాబోయే ఐదేళ్లలో జిల్లాలో 1.5 నుంచి 2 లక్షల ఎకరాలు ఆయకట్టు పెరిగే లా కృషిచేస్తామన్నారు. వారానికి మూ డు, నాలుగురోజులు జిల్లాలోనే ఉంటానన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు కిరణ్ కుమార్‌రెడ్డి, బాస్కర్‌రెడ్డి, ఆవుల వెంకటరమణయ్య వారి గ్రామాల్లో సమస్యల ను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈఈ వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ రెడ్డయ్య, డీఈ సమీవుల్లా, ఏఈ ఠాగూర్, ఆర్‌డీఓ సుబ్రమణ్యంరెడ్డి, తహశీల్దార్ కేవీ రమణయ్య, ఎంపీడీఓ హేమలత, ఏఈలు మనోజ్‌నాయక్, సురేష్‌కుమార్ పాల్గొన్నారు.
సాగునీటి కొరత తీవ్రంగానే ఉంది
Published Fri, Feb 20 2015 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement