విజయనగరం: విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ల్యాండ్ పూలింగ్లో తమ భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. సుమారు 7 వేలమంది రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. విమానాశ్రయం వస్తే జిల్లా బాగుపడదని తమకు నీరు అందిస్తే చాలని వారు అన్నారు. సుమారు 150 గ్రామాల రైతులు విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు.
విమానాశ్రయానికి వందల ఎకరాలు అవసరం లేదని, కేవలం ఆరు, ఏడు ఎకరాలతో విమానాశ్రయం నిర్మించవచ్చని రైతులు మండిపడుతున్నారు. భూముల్ని లాక్కుంటే సహించేది లేదని రైతులు స్పష్టం చేశారు. తమకు విమానాశ్రయాలు అవసరం లేదని, ఉండేందుకు నీడ, తినేందుకు కూడు ఉంటే చాలని రైతులు చెబుతున్నారు.
'మాకు విమానాశ్రయం వద్దు'
Published Fri, Apr 10 2015 12:45 PM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM
Advertisement
Advertisement