
చండీగఢ్: పంజాబ్‌లోని లూథియానా జిల్లా, సెషన్స్ కోర్టులో గురువారం బాంబు పేలుడు ఘటనలో మరణించిన వ్యక్తిని మాజీ హెడ్ కానిస్టేబుల్ గగన్‌దీప్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. బాంబును అమర్చే క్రమంలో అతను మరణించాడని, అందుకు ఆధారాలు లభించాయని పోలీసులు చెప్పారు.
మాదకద్రవ్యాల ముఠాతో సంబంధాలున్నాయని అతడిని 2019లో పోలీస్ విధుల నుంచి తప్పించారు. రెండేళ్ల కారాగార శిక్ష అనుభవించాక సెప్టెంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యాడని తెలుస్తోంది. గగన్‌దీప్‌ది పంజాబ్‌లోని ఖన్నా జిల్లా. బాంబు తయారీ పరిజ్ఞానాన్ని ఆన్‌లైన్‌లో నేర్చుకుని ఉంటాడని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు అనుమానిస్తున్నారు.