head conistable
-
అర్ధరాత్రి హెడ్‌కానిస్టేబుల్ ఇంట్లో చోరీ!
ఖమ్మం: ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి బెటాలియన్ హెడ్‌కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగిన ఘటన సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గంగారం 15వ బెటాలియన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కోరం లక్ష్మణ్‌రావు, నాగకుమారి దంపతులు బేతుపల్లిలోని గౌండ్లబజార్లో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి సత్తుపల్లిలో ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. కిచెన్ తలుపులు తీసి ఉండటాన్ని గమనించారు. బీరువాలోని రూ.12 లక్షల విలువ చేసే 18 తులాల బంగారంతో పాటు రూ.25 వేల నగదును అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్తుపల్లి ఎస్ఐ కుశకుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో ఇంట్లో కూడా.. గ్రామంలోని పటంబజార్లో దొడ్డా శ్రీనివాసరావు ఇంట్లోకి ముసుగులు ధరించిన దుండగులు మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వచ్చి సీసీ కెమెరాల వైర్లను కత్తిరించారు. ప్రధాన ద్వారం తలుపు పగులగొట్టి లోనికి ప్రవేశించి బెడ్రూంలోని కబోర్డులో దుస్తులు, వస్తువులను కిందపడేసి వెతికినా వారికి ఏమీ లభించకపోవడంతో వెనుదిరిగారు. ఇంటి యజమాని అమెరికా వెళ్లినట్లు తెలిసింది. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి కూడా చదవండి: మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా.. -
కడపలో విషాదం.. కుటుంబంతో సహా హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, వైఎస్సార్ కడప జిల్లా: కడప కో-ఆపరేటివ్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కడప టూ టౌన్ హెచ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు.. కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలను, రివాల్వర్ తో కాల్చి తానూ కాల్చుకునీ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఇంగ్లిష్ జల సంధిని ఈదిన ఆంధ్ర హెడ్ కానిస్టేబుల్!
విజయవాడ: స్విమ్మింగ్ మౌంట్ ఎవరెస్ట్‌గా ప్రసిద్ధికెక్కిక ప్రఖ్యాత ఇంగ్లిష్ జలసంధిని అంతర్జాతీయ స్విమ్మర్ తులసీచైతన్య సునాయాసంగా ఈదాడు. ఇంగ్లండ్‌లోని డోవర్ తీరం నుంచి ఫ్రాన్స్‌లోని కలైస్ తీరం వరకూ ఈ జలసంధి ఉంది. అక్కడి ఆర్గనైజర్లకు రూ.4 లక్షలు చెల్లించి ఆయా దేశాల అనుమతులు తీసుకుని ఈ నెల 27న 33.79 కిలోమీటర్ల పొడవున్న జలసంధిని 15 గంటల 18 నిమిషాల్లో ఈదాడు. స్విమ్మర్ తులసీచైతన్య విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గతంలో పాక్ జలసంధి(భారత్–శ్రీలంక), జీబ్రా జలసంధి(తరిఫా–మెహారో), బోడెన్సీ జలసంధి(జర్మనీ–స్విట్జర్లాండ్)లను ఈదిన రికార్డులున్నాయి. ఇంగ్లండ్ తీరంలో ఉన్న మరో రెండు జల సంధులను ఈదేందుకు తులసీచైతన్య సిద్ధమవుతున్నాడు. మైనస్ డిగ్రీల చలి, షార్క్‌లు, జెల్లీ ఫిష్‌లు కలిగిన ఇంగ్లిష్ జలసంధిని సాహసోపేతంగా ఈదిన తులసీచైతన్యను కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి రమేష్ అభినందించారు. ఇదీ చదవండి: Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం -
గంజాయి ఆయిల్‌తో హెడ్‌కానిస్టేబుల్ అరెస్టు
వైరా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి ఖమ్మంకు నిషేధిత గంజాయి ఆయి ల్ను తరలిస్తున్న ఒక హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా వైరా ఎస్ఐ వీరప్రసాద్ తెలిపిన వివరాలివి. కొత్తగూడెంలోని ఆరో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ సపావత్ రాజ్‌కుమార్.. బుద్ది దుర్గాప్రసాద్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై రూ.2లక్షల విలువైన 2 బాటిళ్ల గంజాయి ఆయిల్‌తో శుక్రవారం మధ్యాహ్నం బయల్దేరాడు. వైరా సమీపాన పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో పరిశీలించగా ఆయిల్ బయట పడింది. వీరిని అరెస్టు చేసి మధిర కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ తెలిపారు. -
బాంబు పెట్టింది మాజీ హెడ్ కానిస్టేబుల్
చండీగఢ్: పంజాబ్‌లోని లూథియానా జిల్లా, సెషన్స్ కోర్టులో గురువారం బాంబు పేలుడు ఘటనలో మరణించిన వ్యక్తిని మాజీ హెడ్ కానిస్టేబుల్ గగన్‌దీప్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. బాంబును అమర్చే క్రమంలో అతను మరణించాడని, అందుకు ఆధారాలు లభించాయని పోలీసులు చెప్పారు. మాదకద్రవ్యాల ముఠాతో సంబంధాలున్నాయని అతడిని 2019లో పోలీస్ విధుల నుంచి తప్పించారు. రెండేళ్ల కారాగార శిక్ష అనుభవించాక సెప్టెంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యాడని తెలుస్తోంది. గగన్దీప్ది పంజాబ్‌లోని ఖన్నా జిల్లా. బాంబు తయారీ పరిజ్ఞానాన్ని ఆన్లైన్లో నేర్చుకుని ఉంటాడని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు అనుమానిస్తున్నారు. -
రమ్య హత్య కేసు: హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలు
-
తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
-
తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, చిత్తూరు: తిరుపతిలోని రేణిగుంటలో విషాదం చోటుచేసుకుంది. ఆర్పీఎఫ్ బ్యారక్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆనందరావు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా చింతలపోలూరుకి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రేణిగుంట సీఐ అంజూ యాదవ్ మాట్లాడుతూ.. శ్రీకాకుళానికి చెందిన హెచ్ ఆనందరావు అనే హెడ్ కానిస్టేబుల్ ఇటీవల సెలవులపై వెళ్లి ఆగష్టు 3న తిరిగి విధుల్లో చేరినట్లు తెలిపారు. అయితే ఈరోజు ఉదయం 3 గంటల సమయంలో ర్వేల్వే బ్యారక్ ఆర్మర్ గదిలోకూర్చీలో కూర్చొని తుపాకీతో కాల్చుకొని మరణించినట్లు వెల్లడించారు. నిన్న ఉదయం 6 గంటల నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు అతను విధుల్లో ఉండాల్సి ఉంది. ఉదయం 4 గంటలకు ఏఎస్సై రాజు పిస్తోల్‌ను డిపాజిట్ చేసేందుకు రాగా కానిస్టేబుల్ మరణించిన వార్త తెలిసిందన్నారు. దీనిపై విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించలేదని అంజూ యాదవ్ పేర్కొన్నారు. -
తుపాకీతో హెడ్‌కానిస్టేబుల్ హల్చల్
సాక్షి, వరంగల్/రామన్నపేట: వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి వద్ద ఆర్ముడ్ రిజర్వ్ హెడ్‌కానిస్టేబుల్ తుపాకీతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎంజీఎం ఆస్పత్రి ప్రిజనరీ (ఖైదీల) వార్డు వద్ద విధులు నిర్వర్తిస్తున్న కొండవీటి విఘ్నేశ్వర బాలప్రసాద్ శనివారం రాత్రి భోజనానికి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అతిగా మద్యం సేవించి తన వద్ద ఉన్న తుపాకీతో ప్రజలను బెదిరించడం మొదటుపెట్టాడు. ఇది గమనించిన స్థానికులు 100 నంబర్‌కు డయల్ చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతడి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకోవడంతో పాటు, రక్త నమూనాలు సేకరించారు. అనంతరం మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. హెడ్‌కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏసీపీ గిరికుమార్ తెలిపారు. -
‘పండుగ’ను క్యాష్ చేసుకుందామని అడ్డంగా దొరికాడు
మహేశ్వరం: టపాసుల దుకాణం అనుమతి కోసం ఓ దుకాణదారుడి నుంచి లంచం అడగడంతో అగ్నిమాపక కార్యాలయం హెడ్ కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామానికి చెందిన కడారి దుర్గాప్రసాద్ గ్రామంలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. దీపావళి సందర్భంగా గ్రామంలో టపాసుల దుకాణం ఏర్పాటుకు అనుమతి కావాలని మహేశ్వరం అగ్నిమాపక కార్యాలయంలో సంప్రదించాడు. హెడ్ కానిస్టేబుల్ గురువయ్య దుకాణం ఏర్పాటుకు రూ.2,500 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇవ్వలేనని రూ.1,500 తీసుకోవాలని దుకాణదారుడు దుర్గాప్రసాద్ హెడ్ కానిస్టేబుల్‌ను కోరాడు. అనంతరం ఈ విషయాన్ని ఈ నెల 20వ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు ఫోన్ రికార్డులను పరిశీలించి కేసు నమోదు చేసుకొని పథకం ప్రకారం శనివారం అగ్నిమాపక కార్యాలయంపై అధికారులు దాడి చేశారు. హెడ్‌కానిస్టేబుల్ గురవయ్యను విచారించి కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. మహేశ్వరం అగ్నిమాపక కార్యాలయం పరిధిలో మొత్తం 43 టపాసుల దుకాణాలకు అనుమతులు తీసుకున్నారు. ఒక్కో దుకాణదారుడి నుంచి రూ.2 వేల నుంచి 3 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకొని అనుమతి ఇచ్చిన 43 టపాసుల దుకాణదారులను విచారించి డబ్బులు తీసుకున్నట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సూర్యనారయణ తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్ గురువయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే 94404 46140లో సమాచారం ఇవ్వాలని కోరారు. -
విత్తన పంపిణీలో అపశృతి
గంట్యాడ : ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో గురువారం జరిగిన విత్తనాల సరఫరాలో అపశృతి చోటుచేసుకుంది. బందోబస్తుకు వచ్చిన హెచ్‌సీ రామకృష్ణ అనుకోకుండా సెప్టిక్ ట్యాంక్‌లో పడిపోయారు. అయితే ఆ ట్యాంక్ వాడుకలోలేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. పడిపోయిన హెచ్సీని అక్కడే ఉన్న ఎస్సై పి. నారాయణరావు, తదితరులు పైకి లాగి, ప్రథమ చికిత్స కోసం గంట్యాడ పీహెచ్‌సీకి తరలించారు. -
ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
సాక్షి, సూర్యపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ హెడ్‌కానిస్టేబుల్ శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో దామెదర్ రెడ్డి అనే వ్యక్తి హెడ్ కానిస్టేబులుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం పోలీస్ స్టేషన్లోనే అతను పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. కుమారుడి గృహ హింస కేసు విషయంలో రూరల్ ఎస్సై లవకుమార్ వారం రోజుల క్రితం దామోదర్ రెడ్డి పై చేయి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మనస్థాపానికి గురై దామెదర్ ఆత్మహత్య యత్నించినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. -
వివాహేతర సంబంధం.. హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
చెన్నై: మహిళా పోలీసుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న హెడ్ కానిస్టేబుల్‌ను పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. తిరుచ్చి కేకేనగర్‌కు చెందిన పన్నీర్ సెల్వం (39) సాయుధ పోలీసు దళంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. సెల్వం భార్య అర్బుతమేరి (36) ప్రైవేటు కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తన భర్త సాయుధ పోలీసు దళంలో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, అంతేకాకుండా అదనపుకట్నం కోసం చిత్రహింసలు పెడుతున్నట్లు పోలీసు కమిషనర్ సంజయ్ మాథూర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో అర్బుతమేరి పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలంటూ కమిషనర్ పోలీసులకు ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు పన్నీర్ సెల్వంను, మహిళా పోలీసును కంటోన్మెంట్ మహిళా పోలీసు స్టేషన్లో హాజరుపరిచారు. భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు పన్నీర్ సెల్వంపై కేసు నమోదైంది. దీంతో సెల్వంను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత అతన్ని సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా హఠాత్తుగా అస్వస్థతకు గురికావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అతనికి పోలీసు భద్రతతో చికిత్స అందిస్తున్నారు. ఇలావుండగా పన్నీర్ సెల్వంను సస్పెండ్ చేస్తూ పోలీసు కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. -
మహిళతో రాసలీలలు.. పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్
చాంద్రాయణగుట్ట: ఓ మహిళతో రాసలీలలు నడుపుతూ ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు ఓ హెడ్ కానిస్టేబుల్. ఈ ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మధుసూదన్‌రెడ్డి(45)కి స్థానికంగా ఉండే ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో మధుసూదన్‌రెడ్డి ఉప్పుగూడ సాయిబాబానగర్‌లో ఓ ఇంట్లో ఆ మహిళతో కలసి ఉండగా.. ఇది గమనించిన ఆమె భర్త బయటి నుంచి గడియపెట్టి స్థానికులకు విషయం చెప్పాడు. దాంతో వారందరూ కలసి మధుసూదన్‌రెడ్డిని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళతో రాసలీలలు.. పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్