మహిళతో రాసలీలలు.. పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్ | head conistable madhusudhanreddy caught with a woman | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 20 2015 2:14 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

ఓ మహిళతో రాసలీలలు నడుపుతూ ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు ఓ హెడ్ కానిస్టేబుల్. ఈ ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మధుసూదన్‌రెడ్డి(45)కి స్థానికంగా ఉండే ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో మధుసూదన్‌రెడ్డి ఉప్పుగూడ సాయిబాబానగర్‌లో ఓ ఇంట్లో ఆ మహిళతో కలసి ఉండగా.. ఇది గమనించిన ఆమె భర్త బయటి నుంచి గడియపెట్టి స్థానికులకు విషయం చెప్పాడు. దాంతో వారందరూ కలసి మధుసూదన్‌రెడ్డిని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement