madhusudhanreddy
-
పోలీస్ వాహనం బోల్తా,ఎస్సై మృతి
-
రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి
సాక్షి, నల్గొండ: పోచంపల్లి ఎస్సై మధుసూదన్ (35) మంగళవారం తెల్లవారుజామున నార్కట్ పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నల్గొండలో బందోబస్తూ కారులో వెళ్తుండగా తనే డ్రైవ్ చేస్తున్న ఎస్సై బొలెరో పోలీస్ వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఎస్ఐని కామినేని హాస్పిటల్ కు తరలించగా, అక్కడచికిత్స పొందుతూ మృతి చెందారు. తిప్పర్తి మండలానికి చెందిన మధుసూదన్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మహేష్ భగవత్ కంటతడి జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చరీలో ఎస్ఐ మధుసూదన్ మృతదేహం చూసి రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కంట తడిపెట్టారు. అశ్రు నయనాలతో మధుసూదన్ మృతదేహానికి న భగవత్, ఎస్పీ రంగనాధ్, యాదాద్రి డిసిసి రామచంద్రారెడ్డి, పోలీస్ సిబ్బంది నివాళులు అర్పించారు. -
మహిళతో రాసలీలలు.. పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్
చాంద్రాయణగుట్ట: ఓ మహిళతో రాసలీలలు నడుపుతూ ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు ఓ హెడ్ కానిస్టేబుల్. ఈ ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మధుసూదన్‌రెడ్డి(45)కి స్థానికంగా ఉండే ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో మధుసూదన్‌రెడ్డి ఉప్పుగూడ సాయిబాబానగర్‌లో ఓ ఇంట్లో ఆ మహిళతో కలసి ఉండగా.. ఇది గమనించిన ఆమె భర్త బయటి నుంచి గడియపెట్టి స్థానికులకు విషయం చెప్పాడు. దాంతో వారందరూ కలసి మధుసూదన్‌రెడ్డిని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళతో రాసలీలలు.. పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్