district sessions court
-
బ్రిజ్‌భూషణ్‌పై చార్జ్‌షీట్ దాఖలు
మైనర్‌ను లైంగికంగా వేధించినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)పై రెజ్లర్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు తమ రిపోర్టును రిలీజ్ చేశారు. మైనర్‌ను బ్రిజ్ భూషణ్ వేధించినట్లు ఆధారాలు లేవని పోలీసులు తమ చార్జ్‌షీట్‌లో తెలిపారు. బ్రిజ్‌పై మైనర్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఢిల్లీ పోలీసులు తమ రిపోర్టులో కోరారు. కాగా లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు దాదాపు 1000 పేజీల చార్జ్‌షీట్ రిపోర్టును తయారు చేశారు. కేవలం మైనర్ కేసు విషయంలో సుమారు 500 పేజీల నివేదికను పొందుపరిచారు. దాంట్లో ఆ కేసును రద్దు చేయాలని పోలీసులు సూచించారు.విచారణలో తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఇవాళ పోలీసులు అధికారులు రిపోర్టును సమర్పించి 1500 పేజీలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాగా పోలీసులు సమర్పించిన చార్జ్‌షీట్‌పై తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది. ఏప్రిల్‌లో పోక్సో చట్టం కింద బ్రిజ్ భూషణ్‌పై ఓ మైనర్ అథ్లెట్ కేసు దాఖలు చేసింది. బ్రిజ్‌పై ఇచ్చిన స్టేట్మెంట్ను ఆ మైనర్ వెనక్కి తీసుకున్నట్లు పోలీసుల రిపోర్టు ద్వారా తెలుస్తోంది. తనను ఎంపిక చేయకపోవడం పట్ల ఆగ్రహంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌పై కేసును ఫైల్ చేసినట్లు ఆ మైనర్ అథ్లెట్ వెల్లడించింది. చాలా కఠినంగా టోర్నీల కోసం వర్క్ చేశానని, కానీ తనను సెలెక్ట్ చేయలేదని, దాని వల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయానని, ఆ కోపంతో బ్రిజ్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టినట్లు ఆ మైనర్ రెజ్లర్ పేర్కొన్నది. మైనర్ కేసు విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 173 కింద రిపోర్టును రూపొందించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. బాధిత మైనర్ తో పాటు ఆమె తండ్రి నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నట్లు తెలిపారు. జూలై 4వ తేదీన మైనర్ కేసుపై కోర్టు విచారణ జరగనున్నది. చదవండి: 'టైటిల్ గెలిచిన మత్తులో ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం' జూలై 3 నుంచి వింబుల్డన్.. ప్రైజ్‌మనీ భారీగా పెంపు -
బాంబు పెట్టింది మాజీ హెడ్ కానిస్టేబుల్
చండీగఢ్: పంజాబ్‌లోని లూథియానా జిల్లా, సెషన్స్ కోర్టులో గురువారం బాంబు పేలుడు ఘటనలో మరణించిన వ్యక్తిని మాజీ హెడ్ కానిస్టేబుల్ గగన్‌దీప్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. బాంబును అమర్చే క్రమంలో అతను మరణించాడని, అందుకు ఆధారాలు లభించాయని పోలీసులు చెప్పారు. మాదకద్రవ్యాల ముఠాతో సంబంధాలున్నాయని అతడిని 2019లో పోలీస్ విధుల నుంచి తప్పించారు. రెండేళ్ల కారాగార శిక్ష అనుభవించాక సెప్టెంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యాడని తెలుస్తోంది. గగన్దీప్ది పంజాబ్‌లోని ఖన్నా జిల్లా. బాంబు తయారీ పరిజ్ఞానాన్ని ఆన్లైన్లో నేర్చుకుని ఉంటాడని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు అనుమానిస్తున్నారు. -
ఐదుగురికి జీవిత ఖైదు
- హత్యకేసులో ముద్దాయిలుగా తేల్చిన కోర్టు - వెలుగోడు వాసులకు శిక్ష విధిస్తూ ఆదేశం కర్నూలు (లీగల్) : వెలుగోడు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన ఐదుగురు ముద్దాయిలుగా తేలడంతో జీవితఖైదు, రూ. 3వేల ప్రకారం జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా సెషన్స్‌కోర్టు తీర్పు చెప్పింది. వెలుగోడులో 2007 జనవరి 3వ తేదీన చిన్న జమ్మన్నపై గొడ్డళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని క్షత్రగాత్రుడి భార్య తెలుగు మద్దమ్మ వెలుగోడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త చిన్న జమ్మన్న ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తెలుగు రామాంజినేయులుకు మద్దతు ఇవ్వలేదని కక్షగట్టి దాడి చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో తెలుగు రామాంజనేయులు (అప్పటి వెలుగోడు సర్పంచ్), అతని సోదరుడు జంబులయ్య, బంధువులు హరిప్రసాద్, మల్లయ్య, రామకృష్ణ, వెంకట్రాముడిపై పోలీసులు హత్యాయత్నం చేసు నమోదు చేశారు. గాయపడిన చిన్న జమ్మన్న చికిత్స పొందుతూ కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో జనవరి 8వ తేదీన మృతిచెందడంతో హత్య కేసుగా మార్పు చేశారు. కేసు విచారణలో ఉండగానే రెండో నిందితుడు హరిప్రసాద్ మృతిచెందాడు. నేరం రుజువు కావడంతో మిగతా ఐదుగురికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వీవీ శేషుబాబు తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరుపున పీపీ రాజేంద్రప్రసాద్ వాదించారు.