ఛండీఘర్: పంజాబ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. గియాస్‌పురా ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ కంపెనీలో గ్యాస్ లీకేజీ కారణంగా ఎనిమిది మంది మరణించగా.. మరికొందరు అస్వస్థతకు గురుయ్యారు. దీంతో, రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించింది.
వివరాల ప్రకారం.. లూథియానాలోని గియాస్‌పురా ప్రాంతంలో సువా రోడ్‌లోని గోయల్ మిల్క్ ప్లాంట్ కూలింగ్ సిస్టమ్ పరిశ్రమ నుంచి ఆదివారం ఉదయం గ్యాస్ లీక్ అయ్యింది. ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఎనిమిది మంది మృతిచెందారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గుర్యయారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందం చేరుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. గ్యాస్ కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న వారిని అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించినట్టు లూథియానా అసిస్టెంట్ డీసీపీ సమీర్ వర్మ తెలిపారు.
VIDEO | At least eight people killed in gas leak at a factory in Punjab's Ludhiana. NDRF team carrying out rescue operation. More details are awaited. pic.twitter.com/OHw8vD7LBu
— Press Trust of India (@PTI_News) April 30, 2023
ఇక, ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. మృతుల వివరాలు ఇవే..
సౌరవ్ (35), వర్ష (35), ఆర్యన్ (10), చూలు (16), అభయ్ (13), కల్పేష్ (40), తెలియని మహిళ (40), తెలియని మహిళ (25), తెలియని పురుషుడు (25), నీతూ దేవి మరియు నవనీత్ కుమార్.
ఇది కూడా చదవండి: సూడాన్ టూ భారత్.. ఆనందంలో బాధితులు..
Comments
Please login to add a commentAdd a comment