పేలుళ్లతో దద్దరిల్లిన అఫ్గాన్
56 మంది మృతి, వంద మందికిపైగా గాయాలు
కాబూల్: అఫ్గానిస్తాన్ మంగళవారం ఉగ్రవాదుల బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. 56 మంది మృతిచెందగా, వందమందికిపైగా గాయపడ్డారు. కాబూల్‌లోని పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో జరిగిన రెండు పేలుళ్లలో 38 మంది బలి కాగా, ఒక ఎంపీ సహా 72 మంది గాయపడ్డారు. మొదట ఆత్మాహుతి దాడి, తర్వాత కారు బాంబు దాడి జరిగాయి. మృతుల్లో పలువురు పౌరులు, జవాన్లు ఉన్నారు.
తామే దాడులు చేశామని తాలిబాన్ ప్రకటించింది. మరోపక్క.. హెల్మాంద్ రాష్ట్ర రాజధాని లష్కర్ ఘాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు చనిపోయారు. కాందహార్ రాష్ట్ర గవర్నర్ భవన ప్రాంగణంలో జరిగిన మరో పేలుడులో 9 మంది చనిపోగా, యూఏఈ రాయబారి అబ్దుల్లా కాబీ సహా 16 మంది గాయపడ్డారు.