సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో టైమర్ బాంబులు పేల్చి 44 మంది అమాయ కుల మరణాలకు దారితీసిన ఇండియన్ ము జాహిదీన్ ఉగ్ర ఘాతుకంపై ఎట్టకేలకు తీర్పు వెలు వడింది. పోలీసులు అరెస్టు చేసిన ఐదు గురు నిందితుల్లో అనీక్ షఫీక్ సయీద్, మ హ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను న్యాయ స్థానం మంగళవారం దోషులుగా నిర్ధారించిం ది. వారిద్దరూ నేరానికి పాల్పడినట్లు రుజువైందని కోర్టు స్పష్టం చేసింది. దేశంపై తిరుగుబాటు, హత్య, కుట్ర, పేలుడు పదారా ్థల నిరోధక చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలా పాల నిరోధక చట్టం తదితర వాటి కింద సయీద్, చౌదరిలను దోషులుగా పేర్కొంది. అయితే మరో ఇద్దరు నిందితులైన సాదిక్ ఇష్రార్ షేక్, ఫరూఖ్ షర్ఫుద్దీన్ తర్ఖాష్‌లు పేలుళ్లకు పాల్పడినట్లు నిరూపించే సరైన సాక్ష్యాధారాలు లేవంటూ వారిని నిర్ధోషులు గా ప్రకటించింది.
ఈ మేరకు రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి. శ్రీనివాసరా వు మంగళవారం తీర్పు నిచ్చారు. దోషులకు ఈ నెల 10న శిక్షలు ఖరారు చేస్తామని, నిందితులకు సహకరించిన తారీఖ్ అంజూమ్ ఎహసాస్ విషయంలోనూ ఆ రోజునే నిర్ణయం వెలువరిస్తామని కోర్టు స్పష్టం చేసింది. భద్రతా కారణాలరీత్యా నిందితుల ను ఉంచిన చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రత్యేక కోర్టు గదిని ఏర్పాటు చేసి విచారణ చేపట్టగా తీర్పును కూడా అక్కడి నుంచే జడ్జి వెలువరిం చారు. మీడియా ప్రతినిధులకు కోర్టులోకి అనుమతి లేకపోవడంతో తీర్పు పూర్తి పాఠం రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి రానుంది. కేసు విచారణలో సుమారు 170 మంది సాక్షుల వాంగ్మూలాల ను న్యాయస్థానం నమోదు చేసింది.
ఈ కేసులో మరో ముగ్గురు నిందితులైన ఇండియ న్ ముజాహిదీన్ వ్యవ స్థాపకుడు రియాజ్ భత్కల్, అతని సోదరుడు ఇక్బాల్ భత్కల్, అమీర్ రజాఖాన్‌లు పేలుడు జరిగినప్పటి నుంచీ ఇంకా పరారీలోనే ఉన్నారు. ప్రస్తుతం వారు పాకిస్తాన్‌లో ఆశ్ర యం పొందుతున్నారు. దోషులకు మరణశిక్ష విధించాల్సిందిగా కోరాలని ప్రాసి క్యూషన్ నిర్ణయించింది. ఈ కేసులో న్యాయ స్థానం ఇద్దరు నిందితులను నిర్దోషు లుగా ప్రకటించడంపై బాధితులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఎంతమాత్రం సరికాదని, ట్రయల్ కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పుతో కేసు మూతబడ లేదని, బాధిత కుటుంబాలకూ న్యాయం జరగలేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్‌లో విమర్శించారు.
నాటి నుంచి నేటి వరకు... జంట పేలుళ్ల కేసులో
11 ఏళ్ల 11 రోజుల తర్వాత తీర్పు
రాజధానిలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో జంట పేలుళ్లు జరిగి మంగళవారానికి 11 ఏళ్ల 11 రోజులైంది. ఈ కేసులో కోర్టు తీర్పు మంగళవారం వెలువడిన నేపథ్యంలో ఉగ్ర ఘాతుకం చోటుచేసుకున్నప్పటి నుంచి తీర్పు వెలువడే వరకు చోటుచేసుకున్న పరిణామాలు ఇలా...
25-08-07
రాత్రి 7–7.30 గంటల మధ్య గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో పేలిన బాంబులు. దిల్‌సుఖ్‌నగర్ ఫుట్‌ఓవర్ బ్రిడ్జి కింద పేలని బాంబు స్వాధీనం. ఈ పేలుళ్లపై అదే రోజు సైఫాబాద్, సుల్తాన్ బజార్, మలక్‌పేట పోలీసు స్టేషన్లలో కేసుల నమోదు.
27-08-07
ఉగ్రవాద పేలుళ్ల కేసులు కావడంతో సీసీఎస్ ఆధ్వర్యంలోని సిట్‌కు బదిలీ. నాడు లుంబినీ పార్కులో ఉన్న నాసిక్‌కు చెందిన అమృతవాహిని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడి ఊహాచిత్రం విడుదల.
15-09-08
2007 సెప్టెంబర్ 13న ఢిల్లీలో వరుస పేలుళ్లకు బాధ్యత ప్రకటించుకున్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) బాధ్యత ప్రకటించుకుంది. ఈ కేసులో నిందితుల షెల్టర్ గుర్తించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. జామియానగర్‌లోని బాట్లాహౌస్ ఎల్–18 ఫ్లాట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆతిఖ్ అలియాస్ బషర్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదుల మృతి, ముగ్గురు అరెస్ట్. ఈ ఉదంతంతో కదిలిన ఐఎం డొంక.
06-10-08
ఢిల్లీ ఎన్‌కౌంటర్‌లో దొరికిన ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం. మొత్తం ఐఎం గుట్టు విప్పిన ముంబై క్రైమ్ బ్రాంచ్. 2005 ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా 11 విధ్వంసాలకు పాల్పడిన ఐఎం ఉగ్రవాదుల్లో దాదాపు 20 మంది అరెస్ట్. వారిలోనే హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు నిందితులు ఉండటంతో సిట్ పోలీసుల దర్యాప్తు కొలిక్కి. పీటీ వారెంట్‌పై నిందితుల తరలింపు, విచారణకు సిట్ ప్రయత్నాలు ప్రారంభం.
30-11-08
ఉగ్రవాదంపై పోరుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) రూపుదిద్దుకున్న ఏడాది తర్వాత అధికారిక దర్యాప్తు ప్రారంభం. జంట పేలుళ్ల ఉదంతంతోపాటు పేలని బాంబుపై సిట్‌లో నమోదైన మూడు కేసులు ఈ విభాగానికి బదిలీ.
01-02-09
జంట పేలుళ్ల కేసులో నిందితులైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల్లో అనీఖ్ షఫీఖ్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి పీటీ వారెంట్‌పై ముంబై నుంచి హైదరాబాద్‌కు...
09-02-09
కేసు దర్యాప్తులో కీలకమైన టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్వహణ. లుంబినీ పార్కులో బాంబు పెట్టిన అనీఖ్, హబ్సిగూడలోని బంజారా నిలయంలో బస చేసిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను గుర్తించిన సాక్షులు.
25-03-09
కేసులోని ఇతర నిందితులైన ఐఎం సహ వ్యవస్థాపకుడు సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్ పీటీ వారంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చిన ఆక్టోపస్.
15/28-05-09, 20-06-09
కేసులో ఆక్టోపస్ అధికారుల కీలక ఆధారాల సేకరణ. లుంబినీ పార్కులో పేలుడుకు సంబంధించి 2009 మే 15న, పేలని బాంబుపై అదే నెల 28న, గోకుల్‌చాట్ పేలుడు ఉదంతానికి సంబంధించి అదే ఏడాది జూన్ 20న నాంపల్లి కోర్టులో చార్జిషీట్ల దాఖలు.
03-02-2012
జంట పేలుళ్లకు నిధులు అందించిన తారీఖ్ అంజుమ్ హసన్‌ను దుబా య్ నుంచి డిపోర్టేషన్‌పై తీసుకొచ్చిన ఢిల్లీ పోలీసులు. పీటీ వారంట్‌పై సిటీకి తరలించిన సీఐ సెల్ అధికారులు. అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు.
07-08-2018
చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ప్రత్యేక కోర్టులో (నాంపల్లి కోర్టు అనుమతితో) కేసుల విచారణ పూర్తి.
04-09-2018
మూడు కేసుల్లో అరెస్టయిన ఐదుగురు నిందితుల్లో అనీఖ్, అక్బర్‌లపై నేరం నిరూపణ. సాదిఖ్, ఫారూఖ్‌లపై వీగిపోయిన అభియోగాలు. నాలుగో చార్జ్‌షీట్‌లో నిందితుడైన తారీఖ్ దోషా కాదా అనే విషయంతో పాటు అనీఖ్, అక్బర్‌లకు సోమవారం ఖరారు కానున్న శిక్షలు.
Comments
Please login to add a commentAdd a comment