court verdict
-
సీబీఐ వల్లే ఇలా జరిగింది.. కోర్టు తీర్పు సంతృప్తిగా లేదు: మమతా బెనర్జీ
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కి సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ కేసులో తాము.. దోషికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశాము. కోర్టు తీర్పు విషయంలో సంతృప్తి చెందలేదని వెల్లడించారు.ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో కోర్టులపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. మేమంతా దోషి సంజయ్ రాయ్‌కి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశాం. కానీ, కోర్టు మాత్రం జీవిత ఖైదు విధించింది. కోర్టు తీర్పు విషయంలో మేము అసంతృప్తిగానే ఉన్నాం. ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బలవంతంగా బదిలీ చేశారు. సీబీఐ కారణంగానే ఇలా జరిగింది. ఒకవేళ వారి చేతుల్లోనే ఉంటే మరణశిక్ష పడేలా పోలీసులు శాయశక్తులా ప్రయత్నించేవారు. బాధితురాలికా న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. జీవిత ఖైతు చిన్న శిక్ష వంటిది. ఇలాంటి నేరస్థులను తప్పకుండా ఉరితీయాలి’ అని డిమాండ్ చేశారు. VIDEO | RG Kar rape and murder case: Here's what West Bengal CM Mamata Banerjee (@MamataOfficial) said on Sealdah Court sentencing convict Sanjoy Roy to life term till death. "We have been demanding death sentence to the convict since Day 1 and we are still demanding the… pic.twitter.com/DdJBpJoZ4H— Press Trust of India (@PTI_News) January 20, 2025ఇదిలా ఉండగా.. ఆర్జీకర్ వైద్యుర్యాలి కేసులో తీర్పును వెల్లడిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. ఈ శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు విన్నారు. తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని సంజయ్ రాయ్ తన వాదన వినిపించగా.. ఇది అరుదైన కేసు అని.. అతడికి మరణ శిక్ష విధించాలని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. ఇక, శనివారం న్యాయస్థానం సంజయ్‌ను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. అలాగే, దోషికి జీవిత ఖైదు విధించడమే కాకుండగా.. బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు.. సంజయ్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: కోల్కత్తా కేసు వివరాలు ఇలా.. -
ట్యూషన్ టీచర్‌కు 111 ఏళ్ల జైలు.. ఏం నేరం చేశాడంటే..?
తిరువనంతపురం: విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ట్యూషన్ టీచర్‌కు కేరళలోని స్పెషల్ ఫాస్ట్–ట్రాక్ కోర్టు ఏకంగా 111 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి, ఇటువంటి నేరానికి పాల్పడినందున జాలి చూపాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన మనోజ్(44) తను ఉండే ఇంట్లోనే ట్యూషన్లు చెబుతుండేవాడు. అతడి వద్దకు వచ్చే 11వ తరగతి బాలికను 2019లో ఓ రోజు ప్రత్యేక క్లాసుకని పిలిపించుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదంతా సెల్ఫోన్లో షూట్ చేశాడు.ఈ ఘటనతో భయపడిపోయిన బాలిక ట్యూషన్‌కు వెళ్లడం మానేసింది. మనోజ్ తన ఘనకార్యాన్ని చెప్పుకునేందుకు ఆ ఫొటోలను మరికొందరికి పంపాడు. విషయం తెలిసి బాధితురాలి కుటుంబీకులు ఫోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మనస్తాపానికి గురైన మనోజ్ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మనోజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి సెల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. బాలికపై అత్యాచారం జరిపిన ఫొటోలు అందులో ఉన్నట్లు గుర్తించారు.అయితే, అదే సమయంలో ఆఫీసులో ఉన్నట్లు అక్కడి రిజిస్టర్‌లోని సంతకం చూపి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ, మనోజ్ ఫోన్లోని కాల్ రికార్డుల ఆధారంగా అవన్నీ తప్పని తేలింది. దీంతో, ప్రత్యేక కోర్టు నిందితుడికి 111 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.1.05 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది అదనంగా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని జడ్జి ఆర్.రేఖ తీర్పు వెలువరించారు. -
అన్ని కాలేజీలకు ఒకే ఫీజు సరికాదు
సాక్షి, అమరావతి: పీజీ మెడికల్, డెంటల్ కోర్సులకు రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీలని్నంటిలో ఏకీకృత ఫీజు సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఆర్ఎంసీ) సిఫారసుల మేరకు 2020–21 నుంచి 2022–23 విద్యా సంవత్సరాలకు ఫీజును ఖరారు చేస్తూ ప్రభుత్వం 2020 మే 29న జారీ చేసిన జీవో 56ను రద్దు చేసింది.ఈ జీవో చట్టం ముందు నిలబడదని స్పష్టం చేసింది. ఏపీహెచ్ఈఆర్ఎంసీ అన్నీ మెడికల్, డెంటల్ కాలేజీలను ఒకే గాటన కట్టి, ఏకీకృత ఫీజు నిర్ణయించడం చట్ట విరుద్ధమన్న కాలేజీల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆ కాలేజీలు ప్రతిపాదించిన ఫీజుల వివరాలను పరిగణనలోకి తీసుకుని తిరిగి ఫీజు ఖరారు చేయాలని, ఆపైన రెండు నెలల్లో ఆదేశాలు జారీ చేయాలని కమిషన్‌ను ఆదేశించింది.ఒకవేళ ప్రతిపాదించిన ఫీజుతో కాలేజీలు విభేదిస్తే, ఆ కాలేజీ యాజమాన్యం అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేయాలంది. కమిషన్ ఫీజులను పెంచితే, పెంచిన మేర బ్యాలెన్స్ మొత్తాలను అభ్యర్థుల నుంచి వారిచి్చన హామీ మేరకు కాలేజీలు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. అదనపు ఫీజు వసూలులో నిర్ణయం అంతిమంగా కాలేజీలదేనని స్పష్టం చేసింది. జీవో 56ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఈ ఏడాది సెప్టెంబర్‌లో విచారణ జరిపి, తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువరించింది.ఏకీకృత ఫీజు వల్ల కొన్ని లాభపడుతూ ఉండొచ్చు..ఏకీకృత ఫీజు విద్యార్థుల ప్రయోజనాలకు కూడా విరుద్ధం కావొచ్చునని హైకోర్టు తీర్పులో పేర్కొంది. తక్కువ ఫీజు ఉంటే మరింత ఎక్కువ చెల్లించాలని విద్యార్థులను కాలేజీలు బలవంతం చేయవచ్చునని తెలిపింది. ఏకీకృత ఫీజు వల్ల తగిన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది లేని కాలేజీలు లాభపడే అవకాశం ఉందని పేర్కొంది. మంచి సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది కల్పిస్తున్న కాలేజీలకు ఇది నష్టం కలిగించవచ్చని తెలిపింది. ఇటువంటి కాలేజీలు ఎక్కువ ఫీజులు కోరడంలో తప్పులేదని తెలిపింది.ఫీజుల ఖరారుకు ముందు కాలేజీలు సమర్పించిన ఆదాయ, వ్యయాలు, మౌలిక సదుపాయాల వివరాలని్నంటినీ కమిషన్ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదంది. ఆచరణ సాధ్యం కాని ఫీజును నిర్ణయించడం వల్ల ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులు అందించే విద్యా సంస్థలు మూతపడతాయని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఆయా కాలేజీల నాణ్యత, సమర్థత, ఉత్పాదకతపైనా ప్రభావం చూపుతుందని తెలిపింది. -
మస్క్ వేతన ప్యాకేజీపై కోర్టు తీర్పు
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఇలాన్‌మస్క్ వేతన ప్యాకేజీకి సంబంధించి డెలవేర్ కోర్టు మరోసారి స్పందించింది. మస్క్‌కు అత్యధికంగా 55.8 బిలియన్ అమెరికన్ డాలర్ల(సుమారు రూ.4.6 లక్షల కోట్లు) వేతన ప్యాకేజీ ఇస్తే వాటాదారులకు అన్యాయం చేసినట్లేనని కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా సమర్థించుకుంది.ఆ ప్యాకేజీకి మస్క్ అనర్హుడుఇలాన్మస్క్ షేర్లు, నగదు, ఇతర అలవెన్స్‌ల రూపంలో 2018లో 55.8 బిలియన్ డాలర్లు వేతనాన్ని తీసుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక వేతన ప్యాకేజీ. ఈ ప్యాకేజీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రిచర్డ్ టోర్నెట్టా అనే కంపెనీ వాటాదారు డెలవేర్ కోర్టును ఆశ్రయించారు. ఇంత మొత్తంలో వేతనం ఇవ్వడం కార్పొరేట్ ఆస్తులను దుర్వినియోగం చేయడమేనని తన ఫిర్యాదులో తెలిపారు. కంపెనీ డైరెక్టర్లపై ఒత్తిడి తెచ్చి నిబంధనలకు విరుద్ధంగా తాను ఈ ప్యాకేజీ పొందారని చెప్పారు. ఈ వ్యవహారంపై కోర్టు గతంలో స్పందించి అంత ప్యాకేజీకి మస్క్ అనర్హుడని పేర్కొంది.పిటిషన్ తోసిపుచ్చిన కోర్టుడెలవేర్ కోర్టు గతంలో తానిచ్చిన తీర్పును తాజాగా సమర్థించుకుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో తిరిగి మస్క్ ప్యాకేజీపై నిర్ణయం తీసుకున్నారు. షేర్ హోల్డర్లకు ఓటింగ్ ఏర్పాటు చేసి గతంలో మాదిరి 55.8 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీకి ఆమోదం పొందారు. ఇది గత తీర్పునకు వ్యతిరేకంగా ఉండడంతో తాజాగా కోర్టు స్పందించింది. అయితే, ముందుగా వెలువడిన తీర్పునకు బదులుగా మస్క్ పిటిషన్ దాఖలు చేశారు. వాటాదారుల ఓటింగ్‌ను పరిగణించి తనకు వేతన ప్యాకేజీను ఆమోదించాలనేలా తీర్పును సవరించాలని కోరారు. కానీ కోర్టు తన పిటిషన్‌ను తోసిపుచ్చింది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..మస్క్ ఏమన్నారంటే..డెలవేర్ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై మస్క్ స్పందించారు. ‘కంపెనీ నిర్ణయాలు, ఓటింగ్‌పై నియంత్రణ సంస్థ అధికారులు, వాటాదారులకే ఉండాలి. ఈ వ్యవహారం న్యాయమూర్తులకు అవసరం లేదు’ అన్నారు. టెస్లా సంస్థ దీనిపై స్పందింస్తూ కోర్టు తీర్పును పైకోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పింది. -
పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!
కుమారుడికి పెళ్లి కూతురుని వెతకడంలో విఫలమైన ఓ మ్యాట్రిమోనీ కంపెనీపై తండ్రి కోర్టుకెళ్లిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరిపించిన కోర్టు కుమారుడి తండ్రికి రూ.60,000 చెల్లించాలని కంపెనీని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఇంతకీ తండ్రి, కంపెనీ మధ్య ఎలాంటి వివాదం ఉందో, దీనిపై కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలుసుకుందాం.సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన ప్రమోషన్ ఆధారంగా కుమార్ అనే వ్యక్తి దిల్మిల్ అనే మ్యాట్రిమోనీ కంపెనీను మార్చిలో ఆశ్రయించాడు. తన కుమారుడు బాలాజీకి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. అందుకు పెళ్లి కూతురును వెతికే బాధ్యతను కంపెనీకి అప్పగించాడు. సంస్థ అందుకు నెల రోజుల సమయం విధించింది. ప్రతిగా ఇనిషియల్ పేమెంట్ ఛార్జీల కింద కుమార్ నుంచి రూ.30,000 వసూలు చేసింది. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం నెల తర్వాత కుమార్ వెళ్లి వివరాలు అడిగితే కంపెనీ స్పందించలేదు. ఏప్రిల్ నెలాఖరు వరకు ఆగాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. ఏప్రిల్ తర్వాత కూడా తనకు పెళ్లికుతురి వివరాలు పంపలేదు. దాంతో మే నెలలో కళ్యాణ్ నగర్‌లోని దిల్మిల్ మ్యాట్రిమోనీ కంపెనీకి కుమార్ లీగల్ నోటీసులు పంపాడు. కోర్టు నోటీసులకు కూడా కంపెనీ స్పందించలేదు. దాంతో బెంగళూరు వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైంక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్అక్టోబరు 28న న్యాయస్థానం దిల్మిల్ సంస్థపై చర్యలు చేపట్టింది. కుమార్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. తాను ముందుగా చెల్లించిన సొమ్ముపై 6 శాతం వడ్డీతోపాటు నష్ట పరిహారంగా రూ.20,000 చెల్లించాలని ఆదేశించింది. కస్టమర్‌కు మానసిక వేదన కలిగించినందుకు రూ.5000, లీగల్ ఖర్చులకు మరో రూ.5000 చెల్లించాలని కంపెనీని స్పష్టం చేసింది. -
చిన్నారిపై హత్యాచారం కేసులో దోషికి మరణశిక్ష..
సంగారెడ్డి జోన్: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచి్చంది. బాలికపై అత్యాచారం, హత్య చేసిన కేసులో దోషికి కోర్టు మరణ శిక్ష విధించినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. ఆయన గురువారం ఎస్పీ కార్యాలయంలో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. బిహార్‌లోని సికిందర్ ప్రాంతానికి చెందిన గఫాఫర్ అలీఖాన్ (61) బీడీఎల్ పరిధిలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత అక్టోబర్ 16న ఆదిత్రి కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే భార్యాభర్తలు తమ మనవరాలిని సెక్యూరిటీ గార్డు వద్ద ఉంచి పనికివెళ్లారు. అదేరోజు వీరి పక్క రూములో ఉండే గఫాఫర్ అలీ పనికి వెళ్లకుండా మద్యం తాగి తిరుగుతున్నాడు.11 గంటల ప్రాంతంలో సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న చిన్నారిని గమనించాడు. బాలికకు కూల్‌డ్రింక్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. చిన్నారికి నిందితుడు మద్యం కలిపి ఉన్న కూల్‌డ్రింక్ తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం అందరికీ చెబుతుందేమోనని చిన్నారిని అక్కడే హత్య చేశాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి బీడీఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ రవీందర్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అప్పటి డీఎస్పీ పురుషోత్తం రెడ్డి చార్జ్‌షీటు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు విన్న ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి జయంతి.. బాలికపై హత్యాచారం చేసిన గఫాఫర్ను దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించారు. అతడి కుటుంబ సభ్యులు చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. 27 ఏళ్ల తర్వాత జిల్లాలో మరణశిక్ష: 27 ఏళ్ల తర్వాత జిల్లాలో కోర్టు మరణశిక్షను విధించినట్లు ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించారు. కేసును త్వరితగతిన విచారించేందుకు హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్నామని, కేవలం 11 నెలల వ్యవధిలోనే విచారణ పూర్తిచేసి నిందితుడికి కోర్టు మరణ శిక్ష విధించిందని చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి ఎస్ఐ, విచారణ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఎస్పీ అభినందించారు. -
థాయిలాండ్ ప్రధానికి ఉద్వాసన
బ్యాంకాక్: అవినీతి మరక అంటుకున్న వ్యక్తిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుని నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ థాయిలాండ్ ప్రధాన మంత్రి స్రెట్టా థావీసిన్ను అక్కడి రాజ్యాంగ ధర్మాసనం ప్రధాని పదవి నుంచి తొలగించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీని రద్దుచేయాలంటూ ఒక కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన వారం రోజులకే ఇలా ప్రధాన మంత్రి పదవి ఊడిపోవడం గమనార్హం. ‘‘ నన్ను క్షమించండి. నన్ను కోర్టు అనైతిక ప్రధానిగా భావించిందిగానీ నేను అలాంటి వ్యక్తినికాదు. ఏదేమైనా కోర్టు తీర్పును శిరసావహిస్తా’ అని తీర్పు తర్వాత ప్రధాని స్రెట్టా వ్యాఖ్యానించారు. స్రెట్టాకు వ్యతిరేకంగా 5:4 మెజారిటీతో బుధవారం కోర్టు తీర్పు వెలువరిచింది. తక్షణం తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. ఏప్రిల్‌లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పిచిత్ చుయెన్బన్ను మంత్రిగా ఎంపికచేశారు. అయితే 2008లో ఆయన ఒక జడ్జికి 55వేల అమెరికన్ డాలర్లు లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయి ఆరు నెలలపాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యారు. అవినీతి నేతకు మళ్లీ మంత్రి పదవి కట్టబెట్టారంటూ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తడం తెల్సిందే. -
‘అనర్హత’ పిటిషన్లపై తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. రాజ్యాంగపరమైన అంశాల నేపథ్యంలో ఏప్రిల్ నుంచి సుదీర్ఘ వాదనలు విన్నది. పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున సుప్రీంకోర్టు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు పలు తీర్పులను ఉదహరిస్తూ వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కేపీ.వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్.. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లోకి చేరారని ఆయనను కూడా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్ వేశారు. నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయతి్నంచిన స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ ఎలీ్పనేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. దానం, కడియం తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సుప్రీంకోర్టు వేర్వేరు తీర్పుల ప్రకారం స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేసేందుకు వీల్లేదు. స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పదిరోజులకే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్‌కు కనీస గడువు కూడా ఇవ్వకుండానే న్యాయ సమీక్ష కోరడం చెల్లదు. తాజా పిటిషన్లను కొట్టేయాలి.. లేనిపక్షంలో డివిజన్ బెంచ్‌కు నివేదించాలి. గత శాసనసభ స్పీకర్ ఎదుట పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లో స్పీకర్‌కు నిర్దిష్ట గడువు నిర్ణయించేందుకు ఇద్దరు న్యాయమూర్తుల హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది’అని పేర్కొన్నారు. లిఖితపూర్వక వాదనలను శుక్రవారం సమర్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వాదనలు పూర్తి కావడంతో న్యాయమూర్తి.. తీర్పు రిజర్వు చేశారు. -
అతనికి ఉరే సరి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అత్యంత పాశవికంగా చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన దినేశ్‌కు ఉరిశిక్షే సబబని చెప్పింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో నమోదైన ఈ కేసులో నిందితుడు దినేశ్‌కుమార్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు 2021లో దోషిగా తేల్చింది. ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై దినేశ్ హైకోర్టులో సవాల్ చేయగా, ట్రయల్ కోర్టు నిర్ణయం సబబేనంటూ.. ఉరిశిక్షను ఖరారు చేస్తూ బుధవారం హైకోర్టు తీర్పునిచ్చింది. అప్పీల్‌ను కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదంది. ఇలాంటి కేసుల్లో నిందితులకు సత్వరం శిక్షలు పడితేనే.. బాధితులకు కొంతైనా న్యాయం జరుగుతుందని చెప్పింది. దినేశ్ అప్పీల్‌పై జస్టిస్ శామ్ కోషి, జస్టిస్ సాంబశివరావు నాయుడు విచారణ చేపట్టారు. కేసు పూర్వాపరాలు...హైదరాబాద్‌లోని అల్కాపురి టౌన్షిప్లో ఒడిశాకు చెందిన భార్యభర్తలు పనిచేసేవారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దినేశ్ అక్కడే సెంట్రింగ్ పనిచేసేవాడు. ఒడిశా దంపతులతో కలిసిమెలిసి ఉండేవాడు. 2017, డిసెంబర్ 12న ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న వారి ఐదేళ్ల కుమార్తెకు చాక్లెట్ల ఆశ చూపి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బండరాయితో మోది హత్య చేశాడు.నేరం అంగీకరించిన నిందితుడుచిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. చిన్నారి చివరిసారిగా దినేశ్‌తో కనిపించిందనే ఆధారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దుస్తులకు అంటుకున్న గునుగు పూలను గమనించి అతడే నేరం చేశాడని నిర్ధారణకు వచ్చారు. దినేశ్‌ను అరెస్ట్ చేశారు. కిడ్నాప్, అత్యాచారం, హత్యతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కేసులో వేగంగా విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టు 2021, ఫిబ్రవ రిలో దినేశ్‌ను దోషిగా నిర్ధారిస్తూ మరణ శిక్ష విధించింది. తలారి లేడు.. ఉరి కంబమూ లేదు..రాష్ట్రంలోని జైళ్లలో ఎక్కడా నేరస్తులకు ఉరి శిక్ష అమలు చేసేందుకు తలారి లేడు.. కంబమూ లేదు. రాష్ట్ర పరిధిలో ఉరిశిక్ష అమలు జరిగి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైనే అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోని ముషీరాబాద్, రాజమండ్రి జైళ్లలో ఉరి తీసేందుకు వీలు ఉండేది. అయితే ముషీరాబాద్ జైలు తీసేసిన తర్వాత ఉరి అమలు చేసే వీలు లేకుండాపోయింది. చర్లపల్లిలో స్థలం ఉన్నా.. నిర్మాణం చేపట్టలేదు. అలాగే తలారి కావాల్సి వస్తే ఇతర ప్రాంతాల నుంచో లేదా ఇక్కడే ఎవరన్నా ముందుకొస్తే వారికి శిక్షణ ఇప్పించో అమలు చేయాల్సిన పరిస్థితి. దినేశ్‌కు హైకోర్టు ఉరి శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా మారింది.‘అమానుషమైన దారుణాలకు పాల్పడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో.. ఇలాంటి మరణ శిక్షల ద్వారా తెలియజేయాలి. అయితే, మరణశిక్షపై భిన్నాభిప్రాయాలున్నాయి. మరణశిక్షకు బదులుగా మారేందుకు అవకాశం ఇచ్చేలా జీవితఖైదు విధిస్తే సరిపోతుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. ఇలాంటి వారు బాధితురాలి తల్లిదండ్రుల పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. తమ ఐదేళ్ల కుమార్తె తప్పిపోయిన తర్వాత బాధితురాలి తల్లిదండ్రులు మొదటిసారిగా ఆమె మృతదేహాన్ని చూసినప్పుడు, ఆమె ప్రైవేట్ భాగాలపై గాయాలతో నగ్నంగా పడి ఉండటాన్ని చూసినప్పుడు ఎంత విలవిలలాడిపోయారో ఎవరికీ తెలియదు. చిన్నారి తలపై బండరాళ్లతో కొట్టారు. నేరం జరిగిన ఏడేళ్ల తర్వాత కూడా ఆ దృశ్యం తల్లిదండ్రుల మదిలో మెదులుతూనే ఉంటుంది’ –హైకోర్టు ధర్మాసనం -
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పై నేడు తీర్పు
-
ఫైబర్ నెట్ స్కామ్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు
-
Live : చంద్రబాబు క్వాష్ పిటిషన్ మంగళవారానికి వాయిదా
Updates.. 07:00 PM చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా జాతీయ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తోన్న లోకేష్.. సూటిగా అడిగిన ఎన్నో ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోతున్నారు. నిజంగా అవినీతి జరగలేదని కానీ, చంద్రబాబు తప్పు చేయలేకపోయారని గానీ సూటిగా చెప్పలేకపోతున్నారు. చాలా ప్రశ్నలకు నీళ్లు నమలడం, రొడ్డకొట్టుడు పాత ఆరోపణలు చేయడం తప్ప అసలు కేసు మూలాల్లోకి వెళ్లడం లేదు. మచ్చుకు ఒక ఉదాహరణ ఇది. ఇండియాటుడే : షెల్ కంపెనీలకు నిధులు తరలిపోయాయన్న అభియోగంపై ఏమంటారు? లోకేష్ : స్కిల్ డెవలప్మెంట్ పథకం మాది కాదు, గుజరాత్ నుంచి మేం కాపీ కొట్టామంతే. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ అదే జరిగింది. మా పాత్ర ఏమీ లేదు. ఇండియాటుడే : ఇక్కడ పథకం కాదు, ఏపీలో మీ హాయంలో నిధులు షెల్ కంపెనీలకు తరలించారన్నారన్న ఆరోపణలకు ఏమంటారు? లోకేష్ : 2021లో FIR నమోదయింది. చాలా మందిని విచారించారు. మనీ లాండరింగ్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు IT, ED నోటీసులు వచ్చాయి ఇండియాటుడే : మనీ లాండరింగ్ జరగలేదని మీరంటున్నారు, మరి కేంద్ర సంస్థలు నోటీసులెందుకు ఇచ్చాయి? కేవలం రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారంటారా? లోకేష్ : అవును, కేవలం రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారు. డబ్బులు తరలించారంటున్నారు కానీ ప్రూవ్ చేయలేదు. చంద్రబాబుకు చేరాయని కానీ, నాకు చేరాయని కానీ నిరూపించలేకపోయారు. ఇండియాటుడే : ఈడీ దర్యాప్తు చేస్తోంది కదా? అంతే కాదు.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని YSRCP చాలా కేసుల గురించి చెబుతోంది? ఆధారాలు చూపిస్తోంది కదా? లోకేష్ : నాలుగున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం ఉంది. మాపై అమరావతి, ఫైబర్‌గ్రిడ్, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ఆరోపణలు చేశారు. కానీ మాపై ఎలాంటి ఆరోపణలను నిరూపించలేకపోయింది. ఇండియాటుడే : ఎన్నికలు సమీపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ దీన్ని ఎలా చూస్తుంది ? రెండు పార్టీల మధ్య వైరంగానా? లోకేష్ : చాలా చెప్పారు, చంద్రబాబుపై ఎన్నో ఆరోపణలు చేశారు కానీ, నిరూపించలేదు ఇండియాటుడే : చంద్రబాబు ఇంకొన్నాళ్లు జైల్లో ఉంటే మీ పార్టీ ఏం చేయబోతుంది? సానుభూతి కోసం మీరు ప్రయత్నిస్తారా? లోకేష్ : తెలుగుదేశం ఎన్నో సవాళ్లను చూసింది. ఎన్టీఆర్‌ను అప్పుడు ఇందిరాగాంధీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఇప్పుడు కూడా చూస్తున్నాం. నిజంగా లోకేష్ నిజాయతీగా మాట్లాడే వ్యక్తి అయితే, చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌కు వచ్చిన ఇన్‌కమ్‌టాక్స్ నోటీసుల గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? రెండు వేల కోట్ల మొత్తం మనీ లాండరింగ్ అయిందన్న నోటీసుల మీద నోరెందుకు మెదపలేదు? తమపై రాజకీయ కక్ష అంటున్నారు కానీ.. మరి రాజధాని పేరిట జరిగిన భూకుంభకోణంలో కరకట్ట ఇంటి నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు జరిగిన స్కాం గురించి ఎందుకు వివరించలేదు? అని వైఎస్సార్సిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. తాత ఎన్టీఆర్‌ను ఇందిరాగాంధీ పదవి నుంచి తప్పించారని చెప్పిన లోకేష్.. అదే నోటితో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి తన తండ్రి చంద్రబాబు పదవి లాక్కున్నారని చెప్పి ఉంటే మరింత నిజాయతీగా ఉండేదంటున్నారు. 05:54 PM ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉంటున్న స్నేహ బ్లాక్ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు 04:47 PM మౌనంగా వెళ్లిపోయిన లూథ్రా ► చంద్రబాబుతో ముగిసిన లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ములాఖత్ ► దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ములాఖత్ ► బయటకు వచ్చాక.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన లూథ్రా 03:46 PM రాజమండ్రి జైలు వద్దకు చేరుకున్న లూథ్రా ► చంద్రబాబుతో మూలాఖత్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు లాయర్ సిద్ధార్థ లూథ్రా చేరుకున్నారు. ► మరికాసేపట్లో చంద్రబాబుతో లూథ్రా భేటీ ► చంద్రబాబు భద్రత రిత్యా.. కారును బయటే నిలిపివేయాలని జైలు అధికారుల సూచన ► అధికారుల సూచన మేరకు కారు బయటే ఆపి లోపలికి నడుచుకుంటూ వెళ్లిన లూథ్రా ► ములాఖత్‌కు బయల్దేరే ముందు బాబు కుటుంబ సభ్యులతో లాయర్ లూథ్రా భేటీ 03:21 PM జైలు వద్ద భారీ భద్రత ► రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు ► జైలు లోపలా.. బయటా సెక్యూరిటీ పెంపు ► ఉన్న సీసీ కెమెరాకు అదనంగా సీసీ కెమెరాల ఏర్పాటు ► చంద్రబాబు భద్రతను నిత్యం పర్యవేక్షిస్తున్న జైలు శాఖ ఉన్నతాధికారులు 03:09 PM కాసేపట్లో చంద్రబాబుతో లాయర్ లూథ్రా భేటీ ► న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కాసేపట్లో చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. ► స్కిల్ స్కామ్ లో ముద్దాయి చంద్రబాబు తరపున లూథ్రా వాదనలు ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబుతో భేటీ కానున్న లూథ్రా ►ములాఖత్‌కు ముందు.. కాసేపటి కిందట గురుగోవింద్ సింగ్ వ్యాఖ్యలను ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేసిన లూథ్రా ► చంద్రబాబు హౌజ్ రిమాండ్ పిటిషన్ కొట్టివేత.. హైకోర్టు పిటిషన్ల విచారణ వాయిదా పడడంతో ఏం తోచని స్టేజ్‌లో బాబు లాయర్లు! 03:03 PM చంద్రబాబుతో పవన్ ములాఖత్? ► నారా చంద్రబాబు నాయుడితో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ములాఖత్ ► రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్ వెళ్లనున్నట్లు సమాచారం ► సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాబుతో ములాఖత్ అయ్యే ఛాన్స్! ► బాబుతో పవన్ ములాఖత్‌పై జైలు అధికారుల నుంచి రావాల్సిన స్పష్టత 01:31 PM టీడీపీ ముఖ్య నేతలతో భువనేశ్వరి భేటీ ► రాజమండ్రిలో తొలిసారి పార్టీ నాయకులతో సమావేశమైన భువనేశ్వరి ► చంద్రబాబు కేసు పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ ► పార్టీ పరిస్థితితో పాటు లీగల్‌గా ఏర్పడిన ఇబ్బందులను భువనేశ్వరీకి వివరించిన లీడర్లు ► చట్టపరంగా అన్ని ఆధారాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని వివరణ 01:03 PM ► విజయవాడ: ఏసీబీ కోర్టుకు చేరుకున్న సిట్ అధికారులు ► కస్టడీ పిటిషన్ పై హైకోర్టు స్టే ఇచ్చిందన్న అధికారులు ► హైకోర్టు ఉత్తర్వులు అందాకే తదుపరి ఆదేశాలన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 12:33 PM ► అక్రమ నిర్బంధం, గృహ నిర్బంధాలంటూ హైకోర్టులో టిడిపి పిటిషన్ ► పిటిషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ► పిటిషనర్ తరఫున వాదించిన లాయర్ యలమంజుల బాలాజీ ► ప్రతివాదులకు ఏపీ హైకోర్టు నోటీసులు ► రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు 12:12 PM ► రాజమండ్రి : టిడిపి సీనియర్లతో లోకేష్ ఎడతెగని మంతనాలు ► సోమిరెడ్డి, అయ్యన్నపాత్రుడు, కనకమేడలతో లోకేష్ సుదీర్ఘ చర్చలు ► లీగల్ అంశాల పై లోకేశ్ తో మాట్లాడిన అడ్వొకేట్ లక్ష్మినారాయణ ► చంద్రబాబు చేసిన అవినీతికి పక్కాగా ఆధారాలున్నాయంటున్న బాబు లీగల్ టీం ► ఇప్పుడున్న పరిస్థితుల్లో కిం కర్తవ్యం అంటూ లోకేష్ చర్చలు ► చంద్రబాబు జైల్లోనే ఉండాల్సి వస్తే.. ఎవరు నాయకత్వమని పార్టీలో చర్చ 11:42 AM ► రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహ బ్లాక్‌లో సకల సౌకర్యాలు ► చంద్రబాబు గదిలో ఒక హాస్పిటల్ బెడ్, ఫ్యాన్, టీవీ, ► చంద్రబాబు ఐదు ఛానల్స్ చూసే అవకాశం ► న్యూస్ పేపర్లు అందుబాటులో ఉంచిన అధికారులు ► స్నానానికి ప్రతిరోజు రెండు బకెట్ల వేడి నీళ్లు అందిస్తోన్న జైలు సిబ్బంది ► నిబంధనల మేరకు ఇంటి నుంచి భోజనం, అల్పాహారం ► భోజనాన్ని పరీక్షలు చేసిన అనంతరం చంద్రబాబుకు ఇస్తోన్న జైలు సిబ్బంది 11:42 AM ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో చంద్రబాబు కస్టడీ కోరిన ACB ► కస్టడీ కోసం అవినీతి నిరోధక శాఖ ACB ప్రయత్నాలు ► రాజమండ్రి జైలు నుంచి పిటి వారెంటు మీద బాబును కస్టడీ తీసుకునేందుకు ఏర్పాట్లు ► ఈ విషయంలో ఇప్పటికే ACB కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన ఏసీబీ అధికారులు ► ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో A1గా చంద్రబాబు, A2గా నారాయణ, A6గా లోకేష్ ► క్విడ్ ప్రో కో జరిగిందని ఇప్పటికే కావాల్సినన్ని ఆధారాలు సేకరించిన ACB 11:40 AM ► రాజమండ్రి జైలులో కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తనిఖీలు ► స్నేహ బ్లాక్‌ను పరిశీలించిన కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ► చంద్రబాబుకు కోర్టు ఆదేశాల మేరకు అందుతున్న వసతులపై జైళ్ల శాఖ డీఐజీ ఆరా 11:35 AM ► రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి హైకోర్టులో బాబు లాయర్ల పిటిషన్ ► CID నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ బాబు లాయర్ల పిటిషన్ ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ కౌంటర్ దాఖలు చేయాలని CIDకి ఆదేశం ► చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 19కి వాయిదా వేసిన హైకోర్టు ► ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 19కి వాయిదా. 11:30 AM ► హైకోర్టులో వాదనల సందర్భంగా ఆసక్తికర చర్చ ► అర్జంటుగా పిటిషన్‌పై వాదనలు వినాలన్న బాబు లాయర్ లుథ్రా ► గతంలో చంద్రబాబు CMగా ఉన్నప్పుడు నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేశానన్న హైకోర్టు జడ్జి ► మీకేమైనా అభ్యంతరాలుంటే కేసును వేరే బెంచ్‌కు మారుస్తామన్న న్యాయమూర్తి ► అలాంటిదేమి లేదు, ఎలాంటి అభ్యంతరాలు లేవన్న బాబు లాయర్ సిద్ధార్థ్ లుథ్రా ► ఒక కేసులో కౌంటర్ కూడా దాఖలు కాకుండా వాదనలు ఎలా వినాలన్న హైకోర్టు న్యాయమూర్తి ► కౌంటర్ దాఖలు అనంతరం పూర్తి వాదనలు వింటానని చెప్పిన జడ్జి ► మంగళవారం వరకు పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు 11:20 AM ► 17A సెక్షన్‌పై వాదనలు వినిపిస్తానంటూ పట్టుబట్టిన సిద్దార్థ్లుథ్రా ► బాబు అరెస్ట్‌పై గవర్నర్ అనుమతి కావాల్సిందేనంటూ జడ్జికి విజ్ఞప్తి ► ముందు CID నుంచి కౌంటర్ పిటిషన్ దాఖలు కానివ్వాలని సూచించిన హైకోర్టు న్యాయమూర్తి ► CID తరపున హైకోర్టులో వాదనలు వినిపించిన AAG పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ► కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలన్న AAG ► కౌంటర్ దాఖలు తర్వాత పూర్తి వాదనలు వింటామన్న హైకోర్టు ► ఈ నెల 19వరకు పిటిషన్‌ను వాయిదా వేసిన హైకోర్టు ► అప్పటివరకు ACB కోర్టు కస్టడీ పిటిషన్‌పై నిర్ణయానికి రావొద్దన్న హైకోర్టు 11:15 AM ► క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేయడంతో నీరుగారిపోయిన బాబు లాయర్లు ► చంద్రబాబు కేసు కోసం హైకోర్టులో భారీగా మోహరించిన 20 మంది టాప్ లాయర్లు ► ఢిల్లీ నుంచి వచ్చిన సిద్దార్థ్ లుథ్రా & కో ► పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తోన్న చంద్రబాబు లాయర్ల బృందం ► ఏసీబీ కోర్టులో పిటిషన్లు, హైకోర్టులో పిటిషన్లు ► ఢిల్లీలో మరింత మంది సీనియర్ లాయర్లతో టిడిపి లీగల్ సెల్ మంతనాలు 11:15 AM ► క్వాష్ పిటిషన్‌ను ఈ నెల 19కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ► ఈనెల 18 వరకు కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశం ► తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఇప్పటికే ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ ► సీఐడీ వేసిన పిటిషన్ పై విచారణను ఈనెల 18 వరకు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశం ► తాజాగా హైకోర్టు ఆదేశాలతో మంగళవారం వరకు కస్టడీ పిటిషన్ వాయిదా 11:10 AM ► ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు దక్కని అత్యవసర ఊరట ► క్వాష్ పిటిషన్‌పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా 10:50 AM ► చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ప్రారంభమైన విచారణ. ► వాదనలు వినిపిస్తున్న ఇరు పక్షాల న్యాయవాదులు. 10: 35 AM ► రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ముద్దాయి చంద్రబాబు. ఆయన భద్రత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. బాబు భద్రతకు సంబంధించిన వివరాలు హోం సెక్రటరీ వద్ద తీసుకున్నాం. బాబుకు పూర్తి భద్రత కల్పించామని ఏసీబీ కోర్టుకు తెలిపాం. - ఏజీ శ్రీరామ్. 10:15 AM ► చంద్రబాబు పోలీస్ కస్టడీ పిటిషన్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ. ► పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి హైకోర్టుని ఆశ్రయించిన చంద్రబాబు న్యాయవాదులు. ► క్వాష్ పిటిషన్ రూపంలో నిన్న హైకోర్టుని ఆశ్రయించిన చంద్రబాబు న్యాయవాదులు. ► చంద్రబాబు రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని.. అత్యవసరంగా విచారించాలని కోరారు. ► అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదన్న హైకోర్టు.. విచారణ నేటికి వాయిదా. ► నేడు క్వాష్ పిటిషన్‌తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో ముందస్తు బెయిల్‌పై వాదనలు. ► క్వాష్ పిటిషన్‌పై విచారణ సాకుతో ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయకుండా సాగదీయాలని చంద్రబాబు తరపు న్యాయవాదుల ఆలోచన?. ► మరోవైపు నందిగామలో ఓ న్యాయవాదిపై దాడి ఘటన నేపథ్యంలో నేడు న్యాయవాదుల విధుల బహిష్కరణకి పిలుపునిచ్చిన బెజవాడ బార్ అసోషియేషన్. ► న్యాయవాదుల విధుల బహిష్కరణతో విజయవాడలోని జిల్లా కోర్టులు బంద్. ► నేడు ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్‌పై విచారణ జరుగుతుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. 9.00 am నేడు విధుల బహిష్కరణకు బెజవాడ బార్ అసోసియేషన్ పిలుపు ► విధుల బహిష్కరణకు పిలుపు ఇచ్చిన నందిగామ బార్ అసోసియేషన్. సంఘీభావం తెలిపిన బెజవాడ బార్ అసోసియేషన్. ► చంద్రబాబును కస్టడీకి కొరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ. ► బీబీఏ విధులు బహిష్కరణ పిలుపుతో విచారణ జరుగుతుందా.. వాయిదా పడుతుందా అని పిటిషనర్లలో సందిగ్ధం. 8.45 am సానుభూతి కోసం నారా భువనేశ్వరి ఆరోపణలు.. ► చంద్రబాబు కుటుంబసభ్యులు కోరిన అన్ని సదుపాయాలు జైలులో కల్పిస్తున్నారు. ఇంకా ఏవైనా సదుపాయాలు కావాలంటే జైలు అధికారులను కోరవచ్చు లేదా కోర్టులో పిటిషన్ వేయవచ్చు. న్యాయవ్యవస్థపై టీడీపీ, వాళ్ల మద్దతుదారులు ఆరోపణలు చేయడం దారుణం. న్యాయ వ్యవస్థను కించపరిచే వారిపై చర్యలు తీసుకుంటాం? - వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి 8:10 AM రాజమండ్రి జైలులో చంద్రబాబు దినచర్య.. ► మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చంద్రబాబు నిద్రలోకి వెళ్లాడు. ఉదయం నిద్రలేచి వాకింగ్, మెడిటేషన్ చేసిన చంద్రబాబు. బ్లాక్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్స్ చదివిన బాబు. ► స్నేహ బ్లాక్ మొత్తం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ. నేడు చంద్రబాబును టీడీపీ సీనియర్ నేతలు కలిసే అవకాశం. ► స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో.. ప్రధాన నిందితుడు చంద్రబాబు నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ACB కోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు నేటికి వాయిదా పడ్డాయి. చంద్రబాబు లాయర్లు ఈ పిటిషన్‌పై ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు. ► అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపున దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. లిస్టింగ్‌లో ఈ పిటిషన్ మెన్షన్ చేసి ఉంది. ఈ స్కాంలో ఏ1గా చంద్రబాబు పేరు ఉన్న సంగతి తెలిసిందే. నేడు కోర్టులో వాదనలు.. ► ACB కోర్టు - చంద్రబాబు కస్టడీ కోరుతూ CID పిటిషన్ ► హైకోర్టు - స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో తనను తప్పించాలంటూ చంద్రబాబు స్క్వాష్ పిటిషన్ క్వాష్తో పాటు హైకోర్టులో మరో రెండు! ► స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టేయడం, ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ను సస్పెండ్ చేయడం, ఈ కేసులో స్టే ఇవ్వాలంటూ చంద్రబాబు తరుపున క్వాష్ పిటిషన్ ► క్వాష్ పిటిషన్ తో పాటు హైకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలు ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో A1 గా ఉన్న చంద్రబాబుకు బెయిల్ కోరుతూ మరో పిటిషన్ ► అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోసం ఇంకొక పిటిషన్ ► చంద్రబాబుకు సంబంధించిన మూడు పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగే అవకాశాలు ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు పక్కా ఆధారాలతో దొరికిపోయిన విషయం తెలిసిందే.దీంతో, ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. -
కామాంధులకు 20 ఏళ్ల జైలు, జరిమానా
కామంతో కళ్లు మూసుకు పోయి అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడికి పాల్పడిన వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు కామాం ధులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానాలు శుక్రవారం సంచలన తీర్పులిచ్చాయి. కర్నూలు(లీగల్)/పార్వతీపురంటౌన్/అనంతపురం: కామంతో కళ్లు మూసుకుపోయి వేర్వేరు ప్రాంతాలకు చెందిన అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడికి పాల్పడిన ముగ్గురు కామాంధులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానాలు శుక్రవారం సంచలన తీర్పునిచ్చాయి. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం జిల్లెల గ్రామానికి చెందిన పెరుమాళ్ల వెంకటేశ్వర్లు కుమార్తె (17) నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతూ హాస్టల్లో ఉండేది. 2019 నవంబర్ 12వ తేదీన కళాశాల నుంచి ఇంటికి వచ్చిన కుమార్తెను భయపెట్టి మధ్యాహ్నం సమయంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పదిరోజుల అనంతరం తన తండ్రి చేసిన అఘాయిత్యం గురించి తల్లికి చెప్పింది. దీంతో తల్లి, కుమార్తె నందివర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి వెంకటేశ్వర్లుపై పోక్సో చట్టం, ఐపీసీ 376 కింద కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలు జిల్లా పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి జి.భూపాల్‌రెడ్డి ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలసలోని ఓ పాఠశాలలో నాలుగోతరగతి చదువుతున్న చిన్నారిని విడిచిపెట్టి తల్లి ఎటో వెళ్లిపోయింది. చిన్నారి ఐరన్ షాపులో పనిచేస్తున్న తండ్రి వద్దనే ఉంటూ చదువుకుంటోంది. 2022 సంవత్సరం జూలై నెలలో చిన్నారి ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు కసాయి తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారం రోజుల తరువాత చిన్నారి పుట్టినరోజు సందర్భంగా నిందితుడు కేక్ తెచ్చాడు. దీంతో చిన్నారి తన స్నేహితురాలిని ఇంటికి ఆహ్వానించింది. బాధితురాలితో పాటు ఆమె స్నేహితురాలు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిద్రపోతుండగా ఇద్దరిపైనా కసాయి తండ్రి లైంగికదాడికి యత్నించాడు. చిన్నారులు ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టాడు. విషయాన్ని బాధితురాలి స్నేహితురాలు తన తల్లికి చెప్పింది. వెంటనే ఆమె ఇద్దరు బాలికలను తీసుకెళ్లి రెండు ఘటనలపైనా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్ కేసు నమోదు చేశారు. రెండు కేసుల్లోనూ నేరం రుజువు కావడంతో ఎస్సీ, ఎస్టీ పోక్సోకోర్టు ఇన్చార్జి జడ్జి షేక్‌సికిందర్ బాషా ముద్దాయికి ఒక్కో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధిత చిన్నారులు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ వివరాలను పార్వతీపురం మన్యం జిల్లాఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. అదే విధంగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల గ్రామంలో తల్లిదండ్రులతో కలసి 13 ఏళ్ల బాలిక ఉండేది. 2019 ఆగస్టు 7వ తేదీన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పూజారి ఈశ్వరయ్య అనే వ్యక్తి బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు గోరంట్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ముద్దాయిపై అభియోగాలు రుజువు కావడంతో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష , రూ.5 వేల జరిమానా విధిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు చెప్పారు. అలాగే బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. -
హత్రాస్ సామూహిక అత్యాచారం కేసు.. యూపీ కోర్టు కీలక తీర్పు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్‌లో 2020లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి యూపీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నలుగురు నిందితుల్లో ముగ్గురు.. రవి, రాము, లవ్‌కుష్‌ను నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రధాన నిందితుడు సందీప్ ఠాకూర్‌ను దోషిగా తేల్చినప్పటికీ అతనిపై అత్యాచారం, హత్య అభియోగాలు లేకుండా బాధితురాలిని తీవ్రంగా గాయపరిచినట్లు మాత్రమే న్యాయస్థానం పేర్కొంది. హత్రాస్ సామూహిక అత్యాచార ఘటన 2020లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పొలంలో తల్లి, సోదురుడితో ఉన్న దళిత యువతిని అదేగ్రామంలో ఉన్నతకులానికి చెందిన వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వాంగ్మూలంలో పేర్కొంది. ఆ ఘటనలో యువతిని తీవ్రంగా హింసించారు నిందితులు. దీంతో ఆమెకు చాలా చోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయి. అనంతరం కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి యువతి మరణించింది. అయితే పోలీసులు కుటుంబసభ్యులను ఇంట్లోనే బంధించి రాత్రికిరాత్రే ఆమె అంత్యక్రియలు నిర్వహించడంతో సీఎం యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసులో పోలీసులు కూడా నిందితులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. బాధితురాలు వాంగ్మూలం ఇచ్చేవరకు వారు నిందితులపై అత్యాచార అభియోగాలు మోపలేదు. చదవండి: హోం మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకోని వ్యక్తి మృతి ..కానీ కాన్వాయ్.. -
Andhra Pradesh: రోడ్ షోలు – పౌర హక్కులు – కోర్టు తీర్పులు
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలపై పరిమితులు విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం సహేతుకమైనదేనా? ఇది ఎమర్జెన్సీని తలపిస్తోందా? ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనా? ఈ జీఓ బ్రిటిష్ కాలం నాటిదా? మరి కోర్టు తీర్పులు ఈ అంశాలపై ఎలా ఉన్నాయి? రోడ్ షోలు, ర్యాలీల పేరుతో ఎక్కడపడితే అక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ, ప్రభుత్వాన్నీ, మంత్రులనూ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్‌లో తూలనాడుతూ, చెప్పు చూపుతూ హెచ్చరికలు చేయడం, బూతులు తిట్టడం, ‘వర్కవుట్’ కాకపోతే ఎవరు ఎంత మందినైనా పెళ్లి చేసుకోవచ్చనే రీతిలో మాట్లాడటం, మంత్రులను బూతులతో సంబోధించడం... ఇవన్నీ చట్టబద్ధత కిందికే వస్తాయా? భావప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)ఏ, ఆర్టికల్ 19(1)బీ కిందికి వస్తాయా? మరి న్యాయస్థానాల తీర్పులు ఏం చెబుతున్నాయి? ఒకసారి పరిశీలిద్దాం! ఈ దేశంలో ఏ శాసనాలు అయినా, వాటిని అనుసరించి జారీ చేసే ఏ ఉత్తర్వులు అయినా భారత రాజ్యాంగం ప్రకారమే ఉంటాయి తప్ప... ఇతర దేశాలకు చెంది ఉండవు అనేది సగటు మనిషికి కూడా తెలుసు. భారత రాజ్యాంగ రూపకల్పనలో బ్రిటిష్, అమెరికా వంటి దేశాల రాజ్యాంగాల్లోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వంటి అంశాలు కొన్ని అవసరమైన మార్పులతో స్వీకరించారు. ఆ విధంగా ఈ దేశంలో బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఎన్నో కొనసాగుతున్నాయి. ఇవి భారతదేశ చట్టాలు గానే పరిగణించాలి. అంతేకానీ వాటిని బ్రిటిష్ చట్టాలు అని ప్రచారం చేయడం ప్రజల్ని తప్పుదారి పట్టించడం అవుతుంది. పౌరుల హక్కులను అతిక్రమించి రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నప్పుడు వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అనీ, మరీ ముఖ్యంగా పోలీసుల దేననీ న్యాయస్థానాలు వివిధ కేసుల్లో తీర్పులు ఇచ్చాయి. ఉదాహరణకు కేరళ హైకోర్టులో ‘పీపుల్స్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ కేసులో రోడ్షోలఫై దాఖలైన ‘రిట్ అఫ్ మాండమస్’పై జస్టిస్ కె. బాలకృష్ణన్, జస్టిస్ పి. సుబ్రమణియన్, జస్టిస్ జె. కోషితో కూడిన త్రిసభ్య ధర్మాసనం సమగ్ర విచారణ జరిపి తీర్పునిచ్చింది. ఈ విచారణలో కొన్ని ఇతర రాష్ట్రాల తీర్పులను కూడా ఉటంకించారు. కాగా కామేశ్వర ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో, ప్రదర్శనలు– నినాదాలు కూడా భావ ప్రకటనా స్వేచ్ఛకిందికి వస్తాయా? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. డిమాన్స్ట్రేషన్కి సంబంధించి, భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానాలను కూడా పేర్కొంది. ఆ ప్రకారం చూస్తే, పవన్ కల్యాణ్ మంత్రులను గాడిదలని సంబోధించడం, చెప్పులు చూపుతూ హెచ్చరికలు చేయటం వంటివన్నీ ఆర్టికల్ 19(1)ఏ ఆర్టికల్ 19(1)బీకి విరుద్ధమైనవీ, శిక్షార్హమైనవీ. ఇక కేసు విషయానికి వస్తే... వాహనదారులు, పాదచారులు సంచరించే ప్రధాన రహదారులపై రోడ్ షోలు, ర్యాలీలు అంటే పౌరుల హక్కులను కాలరాయడమే అనీ, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, వాణిజ్య సముదాయాలు, బస్సుస్టేషన్, రైల్వేస్టేషన్ వంటి ప్రదేశాలకు పౌరులు సంచరించకుండా చేయడం అంటే పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేననీ ధర్మాసనం పేర్కొంది. పౌరుల ఈ హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వం మరీ ముఖ్యంగా పోలీసులదేననీ, ట్రాఫిక్‌ను నియంత్రించే హక్కు ఎవరికీ లేదు అని కోర్టు అభిప్రాయ పడింది. సభను నిర్వహించుకునే హక్కు పార్టీలకు ఉన్నా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించటానికి వీలు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 49, పోలీస్ యాక్ట్ సెక్షన్ 29 కింద శిక్షార్హులు. వీధుల్లో కవాతులు, ప్రదర్శనలు నియంత్రించే అధికారం పోలీసులకు ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తుల రక్షణ చట్టం(ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ) 1984, సబ్ సెక్షన్ 3 ప్రకారం, ఊరేగింపులు ప్రదర్శనల పేరుతో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే, ఐదేళ్ల పాటు జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. ఈ వివరాలన్నీ ఉటంకిస్తూ, రోడ్ షోలు, ఊరేగింపులు, ప్రదర్శనలకు సంబంధించి ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలనీ, ఆ ప్రకారం కఠిన నిబంధనలను అమలు చేయాలనీ, లేదంటే పోలీసులకు కష్టసాధ్యమనీ కోర్ట్ అభిప్రాయపడింది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడినట్టే అని వ్యాఖ్యానించింది. రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించదలచుకున్నవారు ముందుగా కనీసం ఆరు రోజుల ముందు పోలీసు అధికారుల అనుమతి పొందాలి. అనుమతి పొందినా రోడ్డు మొత్తం ఆక్రమించడానికి వీలు లేదు. ర్యాలీ ఏం జరుగుతున్నా ట్రాఫిక్‌కి అంతరాయం కలగకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించి పోలీసులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం సర్క్యులర్లు జారీ చేయాలి. ర్యాలీలో పెద్ద పెద్ద బ్యానర్లు నిషిద్ధం. పోలీసులు బ్యానర్ సైజులు నియంత్రించాలి. ఇదీ రోడ్ షోలు, ర్యాలీలకు సంబంధించి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో గౌరవ న్యాయస్థానం తీర్పునకు లోబడి ఉందా? అప్రజాస్వామికంగా ఉందా? ప్రజాస్వామ్యవాదులు ఒకపరి ఆలోచించండి!! - పి. విజయ బాబు కానిస్టిట్యూషన్ లా నిపుణులు -
ఇక మహిళలకు ఆయుధాలు ఇవ్వాలేమో!: స్మితా సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: రేప్ కేసుల్లో తాజా కోర్టు తీర్పులపై ముఖ్యమంత్రి కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ స్పందించారు ‘‘దేశంలో న్యాయపరంగా ఇలాగే నిరాశాజనక ధోరణి కొనసాగితే.. ఆయుధాలు కలిగి ఉండే హక్కును మహిళలకు కల్పించడానికి ఇది సరైన సమయం కావచ్చు’’.. అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం, చట్టం రెండూ వేర్వేరు అంశాలు కాకూడదని ఆమె ట్వీట్ చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో ఓ దోషికి విధించిన శిక్షను 25 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించడంతో పాటు అతడికి బెయిల్ మంజూరు చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు, ఢిల్లీలో సంచలనం రేపిన ఓ అత్యాచారం, హత్యకేసులో దోషులకు విధించిన మరణ శిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె ఈవిధంగా స్పందించారు. బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడంపైనా ఆమె గతంలో ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. If this trend of Judicial let-downs continue, it may be time to allow women of this country the Right to bear Arms ! 'Justice and Law cannot be two different things'. #shameful pic.twitter.com/JUrWKq2frY — Smita Sabharwal (@SmitaSabharwal) November 8, 2022 -
జ్ఞానవాపీ మసీదు కేసులో శివలింగంపై కోర్టు కీలక తీర్పు
లక్నో: జ్ఞాన్వాపీ కేసులో హిందువుల పిటిషన్‌ను తిరస్కరించింది వారణాసి జిల్లా కోర్టు. మసీదు ప్రాంగణంలో లభించిన శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించేందుకు అనుమతి నిరాకరించింది. అలా చేస్తే శివలింగం దెబ్బతింటుందని ఈమేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించి అది ఏ కాలం నాటిదో తేల్చాలని హిందువులు పిటిషన్ దాఖలు చేయగా.. ముస్లింలు దీన్ని వ్యతిరేకిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలను విన్న న్యాయస్థానం హిందువుల పిటిషన్‌ను తిరస్కరించింది. జ్ఞాన్వాపీ మసీదు ఆవరణలో శ్రీనగర్ గౌరి మాతను పూజించేందుకు అనుమతించాలని ఐదుగురు హిందూ మహిళలు 2021 ఆగస్టులో కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణలో భాగంగా మసీదు ప్రాంగణంలో వీడియో సర్వే నిర్వహించగా.. శివలింగం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో దానికి కార్బన్ డేటింగ్ నిర్వహించాలని హిందువులు పిటషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. చదవండి: ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట -
సంచలన తీర్పు.. ఆ మానవ మృగానికి 142 ఏళ్ల జైలు శిక్ష
తిరువనంతపురం: అత్యాచారం కేసులో కేరళలోని పతనంతిట్టా పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 10 ఏళ్ల చిన్నారిపై రెండేళ్లకుపైగా లైంగిక దాడికి పాల్పడిన 41 ఏళ్ల మానవ మృగానికి ఏకంగా 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దాంతో పాటు రూ.5 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే.. నిందితుడు మరో మూడేళ్లు జైలులో ఉండాలని పోక్సో న్యాయస్థానం స్పష్టం చేసింది. పోక్సో కేసులో ఓ వ్యక్తికి విధించిన గరిష్ఠ శిక్షగా అధికారులు తెలిపారు. 2019 నుంచి 2021 మధ్య రెండేళ్ల పాటు 10 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం, లైంగిక దాడికి పాల్పడినట్లు 2021, మార్చి 20న తిరువల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు నందన్ పీఆర్ అలియాస్ బాబు బాధితురాలి కుటుంబానికి దూరపు బంధువు, వారి ఇంటిలోనే ఉండటంతో ఈ విషయం బయటకు రాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి కోర్టులో నివేదిక సమర్పించారు. ‘బాధితుల తరఫున పోక్సో ప్రాసిక్యూటర్ అడ్వకేట్ జాసన్ మాథ్యూ వాదనలు వినిపించారు. సాక్షుల వాంగ్మూలం, మెడికల్ రికార్డులు, ఇతర ఆధారాలు ప్రాసిక్యూషన్‌కు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు.. తిరువల్ల పోలీస్ ఇన్స్పెక్టర్ హరిలాల్ కేసు దర్యాప్తు చేపట్టి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో నిందితుడికి మొత్తం 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది’ అని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ముగ్గురు స్నేహితుల లైంగిక దాడి.. 10 ఏళ్ల బాలుడు మృతి -
జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం
లక్నో: జ్ఞానవాపి కేసుపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్‌ను తిరస్కరించింది. మసీదు ఆవరణలోని శృంగార గౌరి ప్రతిమకు పూజలు చేసేందుకు అనుమతించాలని హిందూ సంఘాలు వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈనెల 22 నుంచి హిందూ సంఘాల పిటిషన్లపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని అంజుమన్ ఇంతజామియా కమిటీ తెలిపింది. మరోవైపు వారణాసి కోర్టు తీర్పును హిందూ సంఘాలు స్వాగతించాయి. ఇదీ కేసు.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని తటాకంలో శివలింగాకారం బయటపడిందని, హిందూ నేపథ్యం ఉన్న కారణంగా అక్కడ పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో... కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ అక్కడ వీడియో సర్వే నిర్వహించింది కూడా. అయితే.. అది శివలింగం కాదంటూ మసీద్ కమిటీ వాదిస్తోంది. ఆపై సుప్రీం కోర్టుకు చేరిన ఈ వ్యవహారం.. తిరిగి వారణాసి కోర్టుకే చేరింది. కమిటీ రిపోర్ట్ సీల్డ్ కవర్లో వారణాసి కోర్టుకు చేరగా.. అదీ, వీడియో రికార్డింగ్‌కు సంబంధించిన ఫుటేజీలు బయటకు రావడంతో కలకలం రేగింది. చదవండి: ఎట్టకేలకు.. సోనాలి ఫోగట్ కేసులో కీలక పరిణామం -
అమ్మకానికి విజయ్‌మాల్యా ఇల్లు.. చివరి నిమిషంలో ట్విస్ట్
లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాకి లండన్ కోర్టులో ఊరట లభించింది. బ్యాంకు లోన్లు చెల్లించని కారణంగా ఇంటిని జప్తు చేయోచ్చుంటూ గతంలో వచ్చిన తీర్పుపై ఆయనకు ఊపశమనం లభించింది. విజయ్ మాల్యా కుటుంబానికి లండన్‌లోని కార్న్‌వాల్‌లో విలాసవంతమైన భవనం ఉంది. విజయ్ మాల్యా తల్లి లలితా మాల్యాతో పాటు కొడుకు సిద్ధార్థ్ మాల్యా అక్కడ నివసిస్తున్నారు. గతంలో స్విస్ బ్యాంక్, రోజ్ క్యాపిటల్ వెంచర్స్‌ల నుంచి తీసుకున్న రుణాన్ని విజయ్ మాల్యా సకాలంలో చెల్లించలేదు. దీంతో అప్పు కింద మాల్యా కుటుంబం నివిస్తున్న ఇంటిని స్వాధీనం చేసుకుంటామంటూ అప్పిచ్చిన సంస్థలు కోర్టును ఆశ్రయయించాయి. అనేక వాయిదాల్లో విచారణ జరిగిన తర్వాత ‘ విజయ్ మాల్యా తక్షణమే ఇంటిని ఖాళీ చేయాలని.. అప్పిచ్చిన సంస్థలు ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చంటూ ’ కోర్టు తీర్పు ఇచ్చింది. స్విస్ బ్యాంక్, రోజ్ క్యాపిటల్ వెంచర్స్‌ల దగ్గర తీసుకున్న అప్పులను మాల్యా ఫ్యామిలీ ట్రస్టు నిధుల నుంచి చెల్లిస్తానని, తన ఇంటి జప్తును ఆపాలంటూ తిరిగి కోర్టును ఆశ్రయించాడు విజయ్‌మాల్యా. అయితే గతంలో ఈ తరహాలోనే అనేక హామీలు ఇచ్చి వాటిని నేరవేర్చలేదని. కాబట్టి తన అప్పులను ట్రస్టు ద్వారా తీరుస్తానంటూ ఇచ్చే హామీని తోసిపుచ్చాలంటూ అప్పులు ఇచ్చిన సంస్థలు న్యాయస్థానం ముందు వాదించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ట్రస్ ద్వారా అప్పులు చెల్లించడం చట్ట విరుద్ధమైమీ కాదంటూ 2022 మార్చి 4న తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్పటికిప్పుడు లండన్ ఇంటిని బ్యాంకులు స్వాధీనం చేసుకునే పని ఆగి పోయింది. వృద్ధురాలైన తల్లితో లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న మాల్యాకు తాజా తీర్పు గొప్ప ఉపశమనం కలిగించింది. చదవండి: విజయ్‌మాల్యాకు భారీ షాక్! లండన్ నివాసం నుంచి గెట్ అవుట్ ? -
రోడ్డున పడ్డ విజయ్‌మాల్యా.. ఉన్న ఇళ్లు కూడా పాయే!
London High Court Verdict Vijay Mallya: ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్‌గా వార్తల్లో నిలుస్తూ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన వ్యాపారవేత్త, లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. బ్యాంకులకు అప్పులు ఎగవేసిన కేసులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో లండన్‌లో ప్రస్తుతం మాల్యాకి నిలువ నీడ లేకుండా పోయింది. ఇళ్లు ఖాళీ చేయండి స్విట్జర్లాండ్‌కు చెందిన యూబీఎస్‌కు 20.4 మిలియన్ బ్రిటన్ పౌండ్ల చెల్లింపుల రికవరీ కేసుకి సంబంధించి లండన్ హై కోర్టులో కేసు నడుస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఈ కేసు వాయిదాలు పడుతూ వస్తుండగా తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. లండన్‌లోని రిజెంట్ పార్క్‌లో ఉన్న కార్న్‌వాల్ టెర్రస్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ని అప్పు కింద జమ చేసుకోవచ్చంటూ యూబీఎస్ బ్యాంకికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు విజయ్ మాల్యా స్వచ్ఛందంగా ఇంటిని ఖాళీ చేయాలని లేదంటూ న్యాయాధికారుల సమక్షంలో ఖాళీ చేయించాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. లండన్ హై కోర్టు తీర్పుతో ఏన్నాళ్లుగానో విజయ్‌మాల్యా తాను నివసిస్తున్న ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తోంది. అప్పీల్‌కి అవకాశం లేదు లండన్ ఇంటిని కాపాడుకునేందుకు విజయ్ మాల్యా విశ్వ ప్రయత్నం చేశారు. ఇప్పటికే పలు మార్లు ఈ కేసుపై వాయిదాలు కోరుతూ వచ్చారు. వేరే బెంచ్‌కి మార్చేందుకు ప్రయత్నించారు. అయితే తాజా తీర్పులో న్యాయమూర్తి వీటన్నింటీని ప్రస్తావిస్తూ తీర్పు ఇచ్చారు. ‘ఇప్పటికే అప్పులు తీర్చేందుకు విజయమాల్యాకు అనేక అవకాశాలు ఇచ్చాం.. సరిపడ సమయం కల్పించాం.. ఐనప్పటికీ అప్పులు చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. ఈ కేసు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఏ న్యాయమూర్తి అయినా తనకంటే భిన్నంగా తీర్పు ఇవ్వరు. కాబట్టి మళ్లీ అప్పీల్ చేసుకోవడం కూడా వృధా అంటూ’ అప్పీల్‌ను సైతం న్యాయమూర్తి నిరాకరించారు. చివరి ప్రయత్నం లండన్‌లో ప్రస్తుతం మాల్యా నివసిస్తున్న లగ్జరీ అపార్ట్మెంట్లో అతని కొడుకు సిద్ధార్థ్మాల్యా (34)తో పాటు విజయ్ మాల్యా తల్లి లలితా మాల్యా కూడా ఉన్నారు. ఆమె వయస్సు ఇప్పుడు 95 ఏళ్లు. ఈ వయస్సులో ఇప్పటికిప్పుడు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయడం ఆమె మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని... కనీసం మానవతా దృక్పథంతో విజయ్‌మాల్యా తల్లి వయస్సుని పరిగణలోకి తీసుకునైనా తీర్పు ఇవ్వాలంటూ మాల్యా తరఫున న్యాయవాదులు కోరారు. కానీ విజయ్ మాల్యాకి ఊరట లభించలేదు. వాళ్లు ఊరుకోలేదు భారత్ బ్యాంకులను కోట్లాది రూపాయల మేర మోసం చేసి, బ్రిటన్‌కు విజయ్‌మాల్యా పారిపోయారు. రుణాలు ఇచ్చిన బ్యాంకులన్నీ కన్సార్టియంగా ఏర్పడి ఎస్బీఐ నేతృత్వంలో న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే మాల్యాకు సంబంధించిన పలు ఆస్తులు అమ్మకానికి వచ్చాయి. ఇందులో చాలా వరకు మాల్యా పెద్దగా ఉపయోగించని ఫార్మ్‌హౌస్‌లు, లగ్జరీ యాచ్‌లే ఉన్నాయి. కానీ స్విట్జర్లాండ్ బ్యాంకు రుణాల రికవరీలో భాగంగా విజయ్‌మాల్యా నివసించే ఇంటినే లాగేసింది. ఉన్నపళంగా ఆయన రోడ్డు మీదకు నెట్టేసింది. చదవండి: అమ్మకానికి విజయ్‌మాల్యా విల్లా.. వేలంలో దక్కించుకున్న హైదరాబాద్ సంస్థ అక్కడే ఉంటారేమో విజయ్‌మాల్యా హవా నడిచినప్పుడు అందమైన మోడళ్లతో బీచ్‌లలో లగ్జరీ యాచ్‌లలో గడిపేవారు, వేలం పాటలో ఖరీదైన, యాంటిక్ వస్తువులను దక్కించుకున్నారు. ఫార్ములా వన్ టీమ్‌ని కొనుగోలు చేశారు. తన ఫార్ములా వన్ టీమ్ ఏస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కుటుంబానికి సంబంధించిన రెండు ఇళ్లను విజయ్‌మాల్యా ఆ రోజుల్లో కొనుగోలు చేశారు. అవి ఇంగ్లండ్‌లోని టెవిన్, హెర్డ్ఫోర్షైర్లో ఉన్నాయి. ప్రస్తుతం విజయ్‌మాల్యా తన మకాం ఇక్కడికే మార్చే అవకాశం ఉంది. చేతులెత్తిసినట్టేనా ? వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన విజయ్‌మాల్యా గడిచిన ఐదేళ్లుగా అనేక కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నారు. కేవలం లాయర్ల ఫీజులు చెల్లించేందుకు ఆయన ఆస్తులు అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైనా మీడియా కంట పడిన ఆయన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే వచ్చారు. కాగా లండన్ ఇంటిని కాపాడుకోలేకపోవడం విజయ్‌మాల్యాకి గట్టి ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. ముందు ముందు న్యాయస్థానాల్లో ఆయన పోరాటం ఎంత వరకు కొనసాగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: Vijay Mallya : రోజులు ఎప్పుడూ ఒక్కలా ఉండవు ! -
ఐదేళ్ల పోరాటం: బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!
బన్సీలాల్‌పేట్: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అదే విధంగా 10 వేల రూపాయల జరిమానా విధించింది. బుధవారం పోక్సో కేసు ప్రత్యేక జడ్జి జి.ప్రేమలత ఈ మేరకు తీర్పునిచ్చారు. గాంధీనగర్ ఇన్స్పెక్టర్ మోహన్‌రావు కథనం ప్రకారం..2017 సంవత్సరంలో కవాడిగూడ సింగాడికుంటకు చెందిన ఆకుల రాము(29) గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడగా...బాలిక గర్భం దాల్చింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి ఇన్స్పెక్టర్ ఎ. సంజీవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సుమారు ఐదేళ్లుగా కోర్టులో కేసు నడుస్తూ వస్తున్నది. బుధవారం ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడింది. నాటి ఇన్స్పెక్టర్, నేటి డీఎస్పీ ఎ.సంజీవరావు బుధవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ ఎంతో కష్టపడి ప్రాసిక్యూషన్ ముందు సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేశామన్నారు. బాలికకు జన్మించిన పసికందు మృతిచెందాడని, పసివాడి డీఎన్ఏ సేకరించి నిందితుడి డీఎన్ఏతో పోల్చి..పక్కా ఆధారాలు సేకరించి ప్రాసిక్యూషన్ ముందు నిరూపించామన్నారు. చదవండి: పట్ట‘పగ’లు మాజీ సర్పంచ్ దారుణ హత్య -
‘గిరిజనులకు అన్యాయం జరగనివ్వం’
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాలకు సంబంధించిన జీవో నంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో గిరిజనులకు న్యాయం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఏపీ ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాలను కోరిందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తీర్పుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా వాకబు చేశారని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానిక గిరిజనులకే అన్ని ఉద్యోగాలు వచ్చేలా 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్న 2000 సంవత్సరంలో అప్పటి గవర్నర్ జీవో నెంబర్.3 ను జారీ చేశారన్నారు. (‘ఆయన చెప్పిందే నిజమైంది’) అయితే ఈ జీవో ఆధారంగా ఏజెన్సీ ఏరియాలోని టీచర్ల నియామకాల్లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఆక్షేపిస్తూ కొంత మంది సుప్రీం కోర్టును ఆశ్రయించగా, 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని వాఖ్యానిస్తూ సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం జీవో నెంబర్.3ను కొట్టి వేసిందని వివరించారు. ఈ తీర్పు నేపథ్యంలో గిరిజనులకు న్యాయం జరిగేలా ఏ చర్యలు తీసుకోవాలనే విషయంగా న్యాయ కోవిదులను సంప్రదిస్తున్నామని చెప్పారు. సుప్రీం తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉందని, ఆ వివరాలు వచ్చాక న్యాయ నిపుణులతో చర్చించి, వారు సూచించిన విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వివరించారు. ప్రభుత్వం ఏజెన్సీ గిరిజనులకు న్యాయం జరిగేలా చూస్తుందని పుష్ప శ్రీవాణి హామీ ఇచ్చారు. (‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగు) -
పురపాలికల్లో కానరాని ఎన్నికల సందడి
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపాలిటీల్లో రాజకీయ సందడి తగ్గింది. రెండు నెలల క్రితం పురపాలికల్లో నెలకొన్న ఎన్నికల హడావిడి ఇప్పుడు ఎక్కడా కన్పించడం లేదు. అన్నీ వదులుకుని ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమైన ఆశావహులందరూ ఇప్పుడు మళ్లీ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. మొన్నటి వరకు ‘పుర’ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చిన రాజకీయ పార్టీల్లో ఇప్పుడు స్తబ్దత నెలకొంది. సాక్షి, మహబూబ్‌నగర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం జూన్, జూలైలో చేపట్టిన వార్డుల పునర్విభజన.. కులాల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, అధికారులు నిర్లక్ష్యంగా ఏకపక్షంగా ప్రక్రియను పూర్తి చేశారంటూ ఒకరి తర్వాత మరొకరు మొత్తం 13మున్సిపాలిటీల నుంచి ఆశావహులు, రాజకీయ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అందిన ఫిర్యాదులు.. అధికారుల తప్పిదాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర హైకోర్టు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 13 మున్సిపాలిటీల్లో ఎన్నికలపై స్టే విధించింది. తప్పులన్నీ సరి దిద్ది.. ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అందుకు ప్రభుత్వమూ పలుమార్లు ఎన్నికల నిర్వహణపై చేపట్టిన కసరత్తుపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వ వివరణ విన్న హైకోర్టు ఇప్పటి వరకు ప్రక్రియపై సంతృప్తి చెందలేదు. ఎన్నికల నిర్వహణపై తుది తీర్పును కూడా ప్రకటించలేదు. దీంతో హైకోర్టు తీర్పు వస్తుంది.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని ఆశావాహులు, పార్టీలు రెండు నెలల తరబడి ఉత్కంఠతో ఎదురుచూశారు. ఇంత వరకు వెలువడని హైకోర్టు తీర్పు.. ఎన్నికల నిర్వహణపై నీలినీడల్ని చూసి ఎన్నికల్లో పోటీపై ఆశలు వదులుకున్నారు. అవకాశం వస్తే పార్టీ గుర్తు మీద.. లేకుంటే స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలవాలనే లక్ష్యంతో తమ తమ పనుల్ని వదిలేసి వార్డుల్లో ప్రచారానికి తెరలేపిన ఆశావహులందరూ ఇప్పుడు మళ్లీ సొంత పనులపై దృష్టిసారించారు. ఇటు అదే స్థాయిలో స్పందించిన రాజకీయ పార్టీల ప్రభావమూ మున్సిపాలిటీల్లో ఇప్పుడు తగ్గింది. నెలన్నర రోజుల క్రితం వార్డుల వారీగా అభ్యర్థుల అన్వేషణపై దృష్టిపెట్టిన అధికార టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ నేతలందరూ ప్రక్రియను నిలిపేశారు. గత పాలకవర్గంలో కౌన్సిల్లో ఉన్న బలాబలాలు లెక్కలేసుకోవడంతో పాటు ఈ సారి ఆయా ‘పుర’ పీఠాలు దక్కించుకునే విధంగా వ్యూహాలకు పదునుపెట్టిన నేతలు కోర్టు తీర్పు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సభలు, సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల ఎంపికలో పాటించాల్సిన విధి విధానాలు, అంశాలపై చర్చించుకున్న నాయకులకూ నిరీక్షణ తప్పడం లేదు. 13 పురాల్లో ఎన్నికపై స్టే.. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, బాదేపల్లి, నారాయణపేట, గద్వాల, అయిజ, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, అమరచింత, పెబ్బేరు, కోస్గి, మక్తల్, అలంపూర్, వడ్డేపల్లి, కొత్తకోట, ఆత్మకూరు, భూత్పూర్ మున్సిపాలిటీలున్నాయి. ఇందులో అచ్చంపేట మున్సిపాలిటీకి మార్చి 6, 2016న ఎన్నికలు జరగగా.. ఆ పాలకవర్గం పదవీ కాలం 2021 మార్చి వరకు ఉంది. బాదేపల్లి మున్సిపాలిటీ ఇప్పటికీ గ్రామ పంచాయతీలో కొనసాగుతోంది. దీంతో అచ్చంపేట, బాదేపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగని పరిస్థితి నెలకొంది. కాగా.. వార్డుల పునర్విభజన... కులాల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రి యలో అక్రమాలు జరిగాయంటూ మహబూబ్‌నగర్, భూత్పూర్, కోస్గి, మక్తల్, ఆత్మకూరు, అమరచింత, కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి, గద్వాల, అయిజ, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీలకు చెందిన పలువురు ఆశావాహులు, పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో మొత్తం ఎన్నికల నిర్వహణకు బ్రేక్‌పడింది. ఎదురుచూస్తున్న.. నా పేరు ఆనంద్‌గౌడ్, మాది మహబూబ్‌నగర్ పట్టణం లోని 12వ వార్డు. స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్న. పన్నెండేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకుంటున్న. మున్సిపల్ పాలక మండలి పదవి కాలం పూర్తి అయినప్పటి నుంచి ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని చూసున్న. కచ్చితంగా వార్డు రిజర్వేషన్ నాకే అనుకూలంగా వస్తుందనే ధీమాతో ఉన్న. ఆరు నెలల నుంచి పనులన్నీ మానేసి.. వార్డుల్లో అందరినీ కలుస్తున్న. కానీ కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల నిర్వహణపై స్టే వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురుచూసి..నెల రోజుల నుంని మళ్లీ నా పనిలో నిమగ్నమయ్యాను. ఎన్నికలపై స్టే ఉన్న పురపాలికలు మహబూబ్‌నగర్ భూత్పూర్ కోస్గి మక్తల్ ఆత్మకూరు అమరచింత కొత్తకోట పెబ్బేరు వనపర్తి గద్వాల అయిజ కల్వకుర్తి కొల్లాపూర్ -
గురజాల కోర్టు తీర్పును రద్దు చేసిన హైకోర్టు
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తి హత్య కేసులో నలుగురికి మరణశిక్ష విధిస్తూ 2018లో గుంటూరు జిల్లా, గురజాల పదో అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఆ నలుగురు నిర్దోషులని ప్రకటించింది. ఇతర ఏవైనా కేసుల్లో వీళ్ల అవసరం లేకుంటే, వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. కాలిబాటకు సంబంధించిన వివాదంలో గుంటూరు జిల్లా, తంగేడ గ్రామానికి చెందిన సైదా అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన గాదెరిపల్లె సుభాని, పెదజాన్, మౌలాలి, మహ్మద్ కత్తితో పొడిచి చంపారన్న ఆరోపణలపై దాచేపల్లి పోలీసులు 2011లో కేసు నమోదు చేశారు. 2012లో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ జరిపిన గురజాల పదో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు.. సుభాని తదితరులు సైదాను హత్య చేశారని నిర్ధారిస్తూ 2018లో మరణశిక్ష విధించింది. అదే సమయంలో మరణశిక్ష పడ్డ దోషులు నలుగురు కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.సురేశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హతుడిని ఈ నలుగురు వ్యక్తులు చంపుతుండగా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరన్నారు. అరుదైన, హేయమైన కేసుల్లోనే మరణశిక్ష విధిస్తారని నివేదించారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాస్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు మరణశిక్ష విధించదగ్గ కేసు కాదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మృతుడు సైదాతో ఆ నలుగురు వ్యక్తులకు ఏవో వివాదాలు ఉన్నంత మాత్రాన అతనిని వారే హత్య చేశారని చెప్పడానికి ఏ మాత్రం వీల్లేదంది. గురజాల కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.