
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని తీర్పు వెల్లడించారు.
అమెరికాలో ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగులను తొలగించాలన్న ప్రభుత్వ చట్టవిరుద్ధమైన ఆదేశాలపై పలు యూనియన్లు, న్యాయవాద సంఘాలు దావా వేశాయి. దీనిపై తాజాగా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ కీలక తీర్పును వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్ మేనేజ్‌మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని స్పష్టంచేశారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పారు. దీంతో, ట్రంప్‌కు భారీ షాక్ తగిలినట్టు అయ్యింది.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అమెరికాలో అనవసర ఖర్చులను తగ్గించే ప్రణాళికలో భాగంగా ఫెడరల్ ఉద్యోగులను తొలగించాలని ట్రంప్ డోజ్ శాఖకు సూచించారు. ఈ మేరకు వివిధ శాఖల్లో ఉద్యోగులను తొలగించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్చి 13లోగా ప్రణాళికలను అందించాలని ఆదేశించారు. ఉద్యోగుల తొలగింపుతో పాటు ఉద్యోగ స్థానాన్ని కూడా పూర్తిగా తొలగించాలని అందులో పేర్కొన్నారు. వీటి ఫలితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ పనితీరులో విస్తృత మార్పులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక, ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.

🚨Shocking: US judge temporarily blocks White House from ordering mass firing of federal workers pic.twitter.com/YFlzyBjiDS
— EverthingEverything (@EverthingEv) February 28, 2025
ఇదిలా ఉండగా.. ట్రంప్ నిర్ణయాల కారణంగా పలు విషయాల్లో ఆయనకు ఎదురుదెబ్బలు తగిలాయి. జన్మత:పౌరసత్వం, యూఎస్‌ఎయిడ్‌లో ఉద్యోగుల తొలగింపు, పలు నిర్ణయాలను కోర్టు తప్పుబట్టింది. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులను వెల్లడించాయి.
US judge temporarily blocks White House from ordering mass firing of federal workers Ruling deals blow to efforts by Donald Trump and Elon Musk to shrink government workforce Source - Financial Times
— Prime View News (@primeviewnews) February 28, 2025
Comments
Please login to add a commentAdd a comment