federal agents
-
గత వారం దేశం కోసం ఏం చేశారు?
న్యూయార్క్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక దాదాపు అనధికార అధ్యక్షుడిగా చలామణి అవుతున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) విభాగం నుంచి వివాదాస్పద నిర్ణయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా వేర్వేరు ప్రభుత్వ విభాగాలైన ఫెడరల్ ఏజెన్సీల్లోని సిబ్బంది పనితీరును క్రోడీకరించే పేరుతో వారి ఉద్యోగాలకు కోత పెట్టే పనిని మొదలెట్టారు. ఈ మేరకు ఫెడరల్ ఏజెన్సీలోని ఉద్యోగులకు తాజాగా ఒక మెయిల్ వచ్చింది. అందులో ‘‘దయచేసి ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ ఈ–మెయిల్‌కు మీ స్పందన తెలియజేయండి. గత వారం మీరంతా విధినిర్వహణలో భాగంగా దేశం కోసం ఏమేం పనులు చేశారు?. ఒక ఐదు కీలకమైన అంశాలను విడివిడిగా కుప్లంగా పేర్కొంటూ ప్రతిస్పందన మెయిల్ పంపించండి. సోమవారం రాత్రి 11.59 గంటలకల్లా మెయిల్‌ను పంపించండి. మీరు గనక ఈ–మెయిల్ పంపించకపోతే మీరు ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తాం’’అని మెయిల్లో ఉంది. ఆగ్రహం వ్యక్తంచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు గత వారం మొత్తంలో దేశం కోసం ఏమేం చేశారని సంజాయిషీ అడగడమేంటని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్(ఓపీఎం) విభాగం నుంచి వచ్చిన ఈ మెయిల్‌ను స్పందనగా మెయిల్‌ను పంపొద్దని తమ సిబ్బందికి అమెరికా జాతీయ వాతావరణ సేవల కేంద్రం తదితర ఏజెన్సీలు సూచించాయి. ‘‘ప్రజల కోసం పనిచేస్తున్న ఉద్యోగులను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉద్యోగులను చట్టవ్యతిరేకంగా తొలగిస్తే ఊరుకోం. కోర్టుల్లో సవాల్ చేస్తాం. అసలు కనీసం ఒక్క గంట సమయం నిజాయతీగా ప్రజాసేవ చేయని, ఎన్నికల్లో పోటీచేయని ప్రపంచకుబేరుడు మస్క్‌తో ఉద్యోగులకు విధినిర్వహణపై హితబోధ చేయించడాన్ని మించిన అవమానం మరోటి లేదు’’అని అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు ఎవిరెట్ కెల్లీ అన్నారు. ఇప్పటికే వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించడమో లేదంటే కొన్ని నెలల జీతం ముందస్తుగా ఇచ్చి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు లేఖలు రాయించుకోవడమే డోస్ చేసింది. మాజీ ఉద్యోగుల వ్యవహరాల విభాగం, రక్షణ, ఆరోగ్యం, మానవీయ సేవలు, అంతర్గత రెవిన్యూ సేవు, జాతీయవనాల విభాగం తదితర ఏజెన్సీల్లోని చాలా మంది తాత్కాలిక, శాశ్వత ఉద్యోగులపై వేటువేసిన సంగతి విదితమే. ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించడమే లక్ష్యంగా డోజ్ వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. -
ఫెడరల్ ఏజెన్సీలకు మంగళమే: మస్క్
వాషింగ్టన్: ఫెడరల్ ఏజెన్సీలన్నింటినీ అమెరికా వదిలించుకోవాల్సిన సమయం వచ్చేసిందని టెక్ దిగ్గజం, డోజ్ సారథి ఎలన్ మస్క్ గురువారం స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరును సమూలంగా పునర్ వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ చర్య తప్పదన్నారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్‌లో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ‘టెక్ సపోర్ట్’అని ముద్రించిన నల్ల టీషర్టు ధరించి కన్పించారు. ‘‘ప్రజాపాలన స్థానంలో ఉద్యోగస్వామ్యం (బ్యూరోక్రసీ) పాలన నడుస్తోంది. ఈ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్నే మించిపోయింది’’అంటూ ఆక్షేపించారు. ఫెడరల్ ఏజెన్సీలు సాధారణంగా నిర్దిష్ట ప్రయోజనం నిమిత్తం అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థలు. అంతరిక్ష సంస్థ నాసాతో పాటు న్యాయ శాఖ వంటివి కూడా ఇలా ఏర్పాటు చేసినవే కావడం విశేషం! వృథా ఖర్చుల తగ్గింపు, సామర్థ్య పెంపు కోసం ఏజెన్సీల సామూహిక మూసివేతలు తప్పవని మస్క్ తాజా ప్రసంగంలో స్పష్టం చేశారు. ‘‘పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడిక ఈ ఏజెన్సీల్లో చాలావాటిని పక్కన పెట్టినా పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదు. మెరుగైన ఫలితాలు కనిపించాలంటే వాటిని మొత్తంగా తొలగించాల్సిందే. ఎందుకంటే కలుపును కూకటివేళ్లతో సహా తొలగించకపోతే మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటుంది’’అని వ్యాఖ్యానించారు. అమెరికా ఇతర దేశాల వ్యవహారాల్లో మితిమీరి జోక్యం చేసుకోకుండా సొంత వ్యవహారాలపై దృష్టి పెట్టాలని మస్క్ వాదిస్తున్నారు. ఆ దిశగా మొత్తంగా అమెరికా విదేశాంగ విధానంలోనే భారీగా మార్పుచేర్పులు తెచ్చేందుకు మస్క్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డోజ్ దూకుడు మస్క్ నేతృత్వంలో ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) ఇప్పటికే ఫెడరల్ ఉద్యోగుల్లో వీలైనంత మందిని తొలగించే పనిలో పడింది. ట్రంప్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అనేక విభాగాలకు బడ్జెట్లను ఇప్పటికే తగ్గించింది. చాలాకాలంగా విదేశాలకు సాయమందిస్తున్న యూఎస్ ఎయిడ్ వంటి పలు ఏజెన్సీలను మూసేసింది. విద్యార్థుల ప్రతిభను ఎప్పటికప్పుడు బేరీజు వేసే స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన విద్యా శాఖ కాంట్రాక్టుల విభాగానికి నిధులను ఏకంగా 100 కోట్ల డాలర్ల మేర తగ్గించే దిశగా మస్క్ తాజాగా చర్యలు చేపట్టారు. ఇది కార్యరూపం దాలిస్తే ఆ విభాగం దాదాపుగా మూతపడ్డట్టే. ఏజెన్సీల ఉద్యోగుల సామూహిక తొలగింపును వేగవంతం చేయడానికి మస్క్ వివాదాస్పద విధానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని చట్టపరంగా సవాలు చేసిన పలు ఉద్యోగ సంఘాలకు తాజాగా కోర్టులోనూ చుక్కెదురైంది. ఆ విధానాన్ని సవాలు చేసే హక్కు వారికి లేదని డి్రస్టిక్ట్ కోర్టు జడ్జి జార్జ్ ఓ టూల్ జూనియర్ బుధవారం తీర్పు వెలువరించారు. దానిపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ హర్షం వెలిబుచ్చారు కూడా. -
అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం.. 6 వారాల్లో మరో బ్యాంక్ మూసివేత!
అమెరికాకు చెందిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ (First Republic Bank) మూత పడింది. కాలిఫోర్నియా రెగ్యులేటరీ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Fdic) ఈ బ్యాంక్‌ను మూసివేసింది. దివాళాతో ప్రముఖ పెట్టుబడుల సంస్థ జేపీ మోర్గాన్ ఛేజ్ (JPMorgan Chase) కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా జేపీ మోర్గాన్.. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కొనుగోలు చేసిందనే నివేదికలపై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటక్షన్ అండ్ ఇన్నోవేషన్ సంస్థ (Dfpi) అధికారిక ప్రకటన చేసింది. పెట్టుబడుల సంస్థ (జేపీ మోర్గాన్) డిపాజిట్లు, ఇన్సూరెన్స్ లేని డిపాజిట్లు, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌కు చెందిన ఎక్కువ మొత్తం ఆస్తులకు బాధ్యత వహిస్తున్నట్లు తెలిపింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కొనుగోలు, డిపాజిటర్ల బాధ్యతతో పాటు ఇతర అంశాలపై మధ్యవర్తిగా కాలిఫోర్నియా రెగ్యులేటరీ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ను నియమించింది. ఈ సందర్భంగా జేపీ మోర్గాన్ సీఈవో జామీ డిమోన్ మాట్లాడుతూ.. నష్టాల్లో ఉన్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు తెచ్చినట్లు చెప్పారు. వాటికి అనుగుణంగా బ్యాంక్ కొనుగోలుకు బిడ్లు దాఖలు చేశామన్నారు. చదవండి👉 జస్ట్..రూ.99కే సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసిన హెచ్ఎస్బీసీ! కొనుగోలు ఒప్పందం ఎలా జరిగింది. ►ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌కు చెందిన మెజారిటీ ఆస్తులు జేపీ మోర్గాన్‌ను సొంతం చేసుకుంది. వాటిలో 173 బిలియన్ డాలర్ల లోన్లు, 30 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలు ఉన్నాయి. ►వీటితో పాటు ఓ అంచనా ప్రకారం.. 92 బిలియన్ డాలర్ల డిపాజిట్లు, 30 బిలియన్ డాలర్ల భారీ ఎత్తున బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు ఎఫ్‌డీఐసీ తెలిపింది. ►ఎఫ్‌డీఐసీ ఒప్పందం ప్రకారం.. నష్టాలను భర్తీ చేసేందుకు గాను ఎవరైతే పస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను కొనుగోలు చేస్తారో వారికి సింగిల్ ఫ్యామిలీ రెసిడెన్షియల్ మోర్టగేజ్ లోన్ (Mortgage Loan ), కమర్షియల్ లోన్లతో పాటు ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్లపై వడ్డీని చెల్లించనుంది. ►పస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌కు చెందిన కార్పొరేట్ అప్పులు, స్టాక్స్ పై ఎలాంటి బాధ్యత వహించబోదని జేపీ మోర్గాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. ►జేపీ మోర్గాన్ వివరాల ప్రకారం.. ఫస్ట్ రిపబ్లికన్ బ్యాంక్‌కు 229.1 బిలియన్ల డాలర్ల ఆస్తులు, 103.9 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నట్లు తెలిపింది. బ్యాంక్ దివాలకు కారణం అదేనా ఇప్పటికే గత ఆరు వారాల వ్యవధిలో అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకులు ఆర్ధిక నష్టాల్ని ఎదుర్కొన్నాయి. తాజాగా అమెరికా చరిత్రలో దివాల తీసిన రెండో అతిపెద్ద బ్యాంక్‌కు ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ నిలిచింది. ఈ బ్యాంక్ దివాలకు కారణం ఇటీవల ఆ సంస్థ విడుదల చేసిన ఫలితాలేనని తెలుస్తోంది. ఏప్రిల్ 25న బ్యాంక్ ఫలితాలతో దాదాపూ 90 శాతం స్టాక్ వ్యాల్యూని కోల్పోయింది. దీనికి తోడు గత నెలలో సుమారు 100 బిలియన్ డాలర్ల డిపాజిట్లను పెట్టుబడిదారులు వెనక్కి తీసుకోవంటి కారణం బ్యాంకు దివాలకు కారణమని తెలుస్తోంది. చదవండి👉 ఎస్వీబీని ముంచేసి..భార్యతో ఎంచక్కా చెక్కేసిన సీఈవో, లగ్జరీ ఇంట్లో! -
ఫెడరల్ ఏజెన్సీల్లో అమెరికన్లకే ఉద్యోగాలు
వాషింగ్టన్: అమెరికా జాబ్ మార్కెట్‌పై ఆశలు పెట్టుకున్న భారతీయులకు మరో దుర్వార్త. అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను ఆదేశిస్తూ సోమవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. విదేశీయులు, ముఖ్యంగా హెచ్1బీ వీసాదారులకు ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగావకాశాలు కల్పించకూడదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ‘అన్ని ప్రభుత్వ సంస్థలు నాలుగు నెలల్లోగా అంతర్గత ఆడిటింగ్ పూర్తి చేసుకుని, ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే మానవ వనరులు ఉండేలా చూసుకోవాలి’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి వరకు హెచ్ 1బీ వీసాలతో పాటు పలు ఇతర వర్క్ వీసాలను నిలిపేస్తూ ఇప్పటికే యూఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్న స్వదేశీయులకు ఊరట కల్పించే దిశగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘అమెరికన్లకే ఉద్యోగాలు అనే సింపుల్ సిద్ధాంతాన్నే ఈ ప్రభుత్వం ఆచరిస్తుంది. అందుకు సంబంధించిన ఒక ఉత్తర్వుపై ఈ రోజు సంతకం చేయబోతున్నాను’ అని ట్రంప్ సోమవారం పేర్కొన్నారు. చవకగా లభించే విదేశీ ఉద్యోగి కోసం కష్టపడి పనిచేసే అమెరికన్‌ను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తన ప్రభుత్వం సహించబోదన్నారు. ‘అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించే అత్యున్నత నైపుణ్యాలు కలిగిన విదేశీయులకు మాత్రమే హెచ్1బీ వీసాలు.. అంతేకాని అమెరికన్ల ఉద్యోగాలు లాక్కొనే వారికి కాదు’ అని స్పష్టం చేశారు. ‘త్వరలో కొత్త ఇమిగ్రేషన్ బిల్లుపై చర్చించబోతున్నాం. అది చాలా సమగ్రంగా ఉండబోతోంది’ అని ట్రంప్ ప్రకటించారు. -
ఆ బెడ్ బాక్స్ చూసి అవాక్కయ్యారు!
న్యూయార్క్: ఓ అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు ఊహించని షాక్ తిన్న ఘటన అమెరికాలోని మసాచుసెట్స్‌లో చోటు చేసుకుంది. వెస్ట్బరోలోని ఓ వ్యక్తిపై నిఘా ఉంచి.. ఫ్లాట్‌లో సోదాలు చేయగా బెడ్ బాక్స్ నిండా నోట్ల కట్టలు కనిపించాయి. వివరాలు.. రెనె రెజిరో రొచా అనే వ్యక్తి ఇటీవల బ్రెజిల్ నుంచి అమెరికాకు వచ్చాడు. అతడు హడ్సన్‌లోని ఓ రెస్టారెంట్లో మనీ లాండరింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడికి సంబంధించిన అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించగా సుమారు 20 మిలియన్ డాలర్లు బెడ్ బాక్స్‌లో గుర్తించారు. దొరికిన డబ్బు.. పిరమిడ్ బిజినెస్‌లో జనాన్ని ముంచి ప్రస్తుతం బ్రెజిల్లో తలదాచుకుంటున్న కార్లోస్ వాంజెలర్ అనే వ్యక్తికి సంబంధించినదిగా గుర్తించామని ఫెడరల్ అధికారులు వెల్లడించారు.