అమెరికాలో బ్యాంకింగ్‌ సంక్షోభం.. 6 వారాల్లో మరో బ్యాంక్‌ మూసివేత! | First Republic Bank Seized Us Regulator Fdic, Acquired By Jpmorgan Chase | Sakshi
Sakshi News home page

అమెరికాలో బ్యాంకింగ్‌ సంక్షోభం.. 6 వారాల్లో మరో బ్యాంక్‌ మూసివేత!

Published Mon, May 1 2023 4:05 PM | Last Updated on Mon, May 1 2023 4:46 PM

First Republic Bank Seized Us Regulator Fdic, Acquired By Jpmorgan Chase - Sakshi

అమెరికాకు చెందిన ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ (First Republic Bank) మూత పడింది. కాలిఫోర్నియా రెగ్యులేటరీ ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (Fdic) ఈ బ్యాంక్‌ను మూసివేసింది. దివాళాతో ప్రముఖ పెట్టుబడుల సంస్థ జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ (JPMorgan Chase) కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ సందర్భంగా జేపీ మోర్గాన్‌.. ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసిందనే నివేదికలపై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ప్రొటక్షన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సంస్థ (Dfpi) అధికారిక ప్రకటన చేసింది. పెట్టుబడుల సంస్థ (జేపీ మోర్గాన్‌) డిపాజిట్లు, ఇన్సూరెన్స్‌ లేని డిపాజిట్లు,  ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌కు చెందిన ఎక్కువ మొత్తం ఆస్తులకు బాధ్యత వహిస్తున్నట్లు తెలిపింది. ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ కొనుగోలు, డిపాజిటర్ల బాధ్యతతో పాటు ఇతర అంశాలపై మధ్యవర్తిగా కాలిఫోర్నియా రెగ్యులేటరీ ఫెడరల్‌ డిపాజిట్ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ను నియమించింది. 

ఈ సందర్భంగా జేపీ మోర్గాన్‌ సీఈవో జామీ డిమోన్ మాట్లాడుతూ.. నష్టాల్లో ఉన్న  ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు తెచ్చినట్లు చెప్పారు. వాటికి అనుగుణంగా బ్యాంక్‌ కొనుగోలుకు బిడ్లు దాఖలు చేశామన్నారు. 

చదవండి👉 జస్ట్..రూ.99కే సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసిన హెచ్‌ఎస్‌బీసీ!

కొనుగోలు ఒప్పందం ఎలా జరిగింది. 

ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌కు చెందిన మెజారిటీ ఆస్తులు జేపీ మోర్గాన్‌ను సొంతం చేసుకుంది. వాటిలో 173 బిలియన్‌ డాలర్ల లోన్లు, 30 బిలియన్‌ డాలర్ల సెక్యూరిటీలు ఉన్నాయి. 

వీటితో పాటు ఓ అంచనా ప్రకారం.. 92 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు, 30 బిలియన్‌ డాలర్ల భారీ ఎత్తున బ్యాంక్‌ డిపాజిట్లు ఉన్నట్లు ఎఫ్‌డీఐసీ తెలిపింది. 

ఎఫ్‌డీఐసీ ఒప్పందం ప్రకారం.. నష్టాలను భర్తీ చేసేందుకు గాను ఎవరైతే పస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ను కొనుగోలు చేస్తారో వారికి సింగిల్‌ ఫ్యామిలీ రెసిడెన్షియల్‌ మోర్టగేజ్‌ లోన్‌ (Mortgage Loan ), కమర్షియల్‌ లోన్లతో పాటు ఐదేళ్లలో 50 బిలియన్‌ డాలర్లపై వడ్డీని చెల్లించనుంది. 

పస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌కు చెందిన కార్పొరేట్‌ అప్పులు, స్టాక్స్‌ పై ఎలాంటి బాధ్యత వహించబోదని జేపీ మోర్గాన్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. 

జేపీ మోర్గాన్‌ వివరాల ప్రకారం.. ఫస్ట్‌ రిపబ్లికన్‌ బ్యాంక్‌కు 229.1 బిలియన్ల డాలర్ల ఆస్తులు, 103.9 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు ఉన్నట్లు తెలిపింది. 

బ్యాంక్‌ దివాలకు కారణం అదేనా
ఇప్పటికే గత ఆరు వారాల వ్యవధిలో అమెరికాకు చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంకులు ఆర్ధిక నష్టాల్ని ఎదుర్కొన్నాయి. తాజాగా అమెరికా చరిత్రలో దివాల తీసిన రెండో అతిపెద్ద బ్యాంక్‌కు ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ నిలిచింది. ఈ బ్యాంక్‌ దివాలకు కారణం ఇటీవల ఆ సంస్థ విడుదల చేసిన ఫలితాలేనని తెలుస్తోంది. ఏప్రిల్‌ 25న బ్యాంక్‌ ఫలితాలతో దాదాపూ 90 శాతం స్టాక్‌ వ్యాల్యూని కోల్పోయింది. దీనికి తోడు గత నెలలో సుమారు 100 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లను పెట్టుబడిదారులు వెనక్కి తీసుకోవంటి కారణం బ్యాంకు దివాలకు కారణమని తెలుస్తోంది.

 చదవండి👉 ఎస్‌వీబీని ముంచేసి..భార్యతో ఎంచక్కా చెక్కేసిన సీఈవో, లగ్జరీ ఇంట్లో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement