JPMorgan
-
ఉద్యోగుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న జేపీ మోర్గాన్.. అదేంటంటే?
ఇజ్రాయెల్ - హమాస్ వార్ కారణంగా అక్కడి వాతావరణం భీకర దాడులతో భయానకంగా ఉంది. ఈ సందర్భంగా గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం 'జేపీ మోర్గాన్ చేజ్' (JP Morgan Chase) తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇజ్రాయెల్‌లోని తన సిబ్బందిని పరిస్థితులు చక్కబడే వరకు ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేయాల్సిందిగా కోరింది. పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ చేసిన ఆకస్మిక దాడి రెండు వైపుల హింసాత్మక సంఘర్షణకు దారితీసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్, మిలిమెంట్ గ్రూపుల మధ్య జరుగుతున్న దాడుల్లో ఏ నిమిషం ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. దీంతో ఆఫీసులకు వచ్చి విధులు నిర్వహించే అవకాశం లేదు. కావున సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: చిన్నప్పుడే చదువుకు స్వస్తి.. నమ్మిన సూత్రంతో లక్షలు సంపాదిస్తున్న చాయ్‌వాలా..!! ఇజ్రాయెల్‌లో జేపీ మోర్గాన్‌లో 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులను ప్రపంచంలోని చాలా దేశాలు ఖండిస్తున్నాయి. ఇప్పటికే యుద్ధంలో వందల మందికిపైగా మరణించినట్లు, మరి కొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. రానున్న రోజులు మరింత భయానకంగా ఉండే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు. -
రూపాయి హై జంప్: కారణం ఇదే!
Rupee rises దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో శుక్రవారం ఒక రేంజ్లో పుంజుకుంది. ఆరంభంలోనే 38 పైసలు పెరిగి 82.75 స్థాయిని తాకింది. చివరికి 19 పైసల లాభంతో 82.93 వద్ద ముగిసింది. గురువారం 2 పైసలు తగ్గి 83.13 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జేపీ మోర్గాన్ బాండ్ ఇండెక్స్‌లో భారతదేశాన్ని చేర్చడం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. 2024 , జూన్ నుంచి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల బాండ్ ఇండెక్స్‌లో భారత ప్రభుత్వ బాండ్లను (IGBs) చేర్చనున్నట్లు ప్రకటించింది. దీన్ని ఆర్థికమంత్రిత్వ శాఖ స్వాగతించింది. (సాక్షి మనీ మంత్రా: వరుస నష్టాలతో కుదేలైన నిఫ్టీ) ప్రధాన గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌లో భారతదేశాన్ని చేర్చడం వల్ల దేశ రుణ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు ప్రవాహం భారీగా పెరగనుందని అంచనా. భారత ప్రభుత్వ బాండ్లను , బెంచ్‌మార్క్ ఎమర్జింగ్-మార్కెట్ ఇండెక్స్‌లో చేర్చాలని జేప్ మోర్గాన్ చేజ్ & కో తీసుకున్న నిర్ణయం, భారతదేశ డెట్ మార్కెట్ గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందని ఫారెక్స్ వ్యాపారులు భావిస్తున్నారు. రూపాయి ఎన్‌డిఎఫ్ మార్కెట్లలో సుమారు 0.42 శాతం వృద్ధి చెంది 82.80 స్థాయిలకు చేరుకోవడం మంచి పరిణామమని నిపుణులు పేర్కొంటున్నారు. (దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమైనాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్ 221 పాయింట్లు నష్టపోగా,నిఫ్టీ 19700 దిగువన స్థిరపడింది. అటు ఆరు కరెన్సీల బాస్కెట్‌తో గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.12 శాతం పెరిగి 105.48కి చేరుకుంది. ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.61 శాతం పెరిగి 93.87 డాలర వద్ద ఉంది. విదేశీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) గురువారం క్యాపిటల్ మార్కెట్లో నికర అమ్మకం దారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం వారు రూ3,007.36 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. (క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ. 9 వేల కోట్లు..ఏం చేశాడంటే?) -
అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం.. 6 వారాల్లో మరో బ్యాంక్ మూసివేత!
అమెరికాకు చెందిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ (First Republic Bank) మూత పడింది. కాలిఫోర్నియా రెగ్యులేటరీ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Fdic) ఈ బ్యాంక్‌ను మూసివేసింది. దివాళాతో ప్రముఖ పెట్టుబడుల సంస్థ జేపీ మోర్గాన్ ఛేజ్ (JPMorgan Chase) కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా జేపీ మోర్గాన్.. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కొనుగోలు చేసిందనే నివేదికలపై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటక్షన్ అండ్ ఇన్నోవేషన్ సంస్థ (Dfpi) అధికారిక ప్రకటన చేసింది. పెట్టుబడుల సంస్థ (జేపీ మోర్గాన్) డిపాజిట్లు, ఇన్సూరెన్స్ లేని డిపాజిట్లు, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌కు చెందిన ఎక్కువ మొత్తం ఆస్తులకు బాధ్యత వహిస్తున్నట్లు తెలిపింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కొనుగోలు, డిపాజిటర్ల బాధ్యతతో పాటు ఇతర అంశాలపై మధ్యవర్తిగా కాలిఫోర్నియా రెగ్యులేటరీ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ను నియమించింది. ఈ సందర్భంగా జేపీ మోర్గాన్ సీఈవో జామీ డిమోన్ మాట్లాడుతూ.. నష్టాల్లో ఉన్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు తెచ్చినట్లు చెప్పారు. వాటికి అనుగుణంగా బ్యాంక్ కొనుగోలుకు బిడ్లు దాఖలు చేశామన్నారు. చదవండి👉 జస్ట్..రూ.99కే సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసిన హెచ్ఎస్బీసీ! కొనుగోలు ఒప్పందం ఎలా జరిగింది. ►ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌కు చెందిన మెజారిటీ ఆస్తులు జేపీ మోర్గాన్‌ను సొంతం చేసుకుంది. వాటిలో 173 బిలియన్ డాలర్ల లోన్లు, 30 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలు ఉన్నాయి. ►వీటితో పాటు ఓ అంచనా ప్రకారం.. 92 బిలియన్ డాలర్ల డిపాజిట్లు, 30 బిలియన్ డాలర్ల భారీ ఎత్తున బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు ఎఫ్‌డీఐసీ తెలిపింది. ►ఎఫ్‌డీఐసీ ఒప్పందం ప్రకారం.. నష్టాలను భర్తీ చేసేందుకు గాను ఎవరైతే పస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను కొనుగోలు చేస్తారో వారికి సింగిల్ ఫ్యామిలీ రెసిడెన్షియల్ మోర్టగేజ్ లోన్ (Mortgage Loan ), కమర్షియల్ లోన్లతో పాటు ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్లపై వడ్డీని చెల్లించనుంది. ►పస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌కు చెందిన కార్పొరేట్ అప్పులు, స్టాక్స్ పై ఎలాంటి బాధ్యత వహించబోదని జేపీ మోర్గాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. ►జేపీ మోర్గాన్ వివరాల ప్రకారం.. ఫస్ట్ రిపబ్లికన్ బ్యాంక్‌కు 229.1 బిలియన్ల డాలర్ల ఆస్తులు, 103.9 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నట్లు తెలిపింది. బ్యాంక్ దివాలకు కారణం అదేనా ఇప్పటికే గత ఆరు వారాల వ్యవధిలో అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకులు ఆర్ధిక నష్టాల్ని ఎదుర్కొన్నాయి. తాజాగా అమెరికా చరిత్రలో దివాల తీసిన రెండో అతిపెద్ద బ్యాంక్‌కు ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ నిలిచింది. ఈ బ్యాంక్ దివాలకు కారణం ఇటీవల ఆ సంస్థ విడుదల చేసిన ఫలితాలేనని తెలుస్తోంది. ఏప్రిల్ 25న బ్యాంక్ ఫలితాలతో దాదాపూ 90 శాతం స్టాక్ వ్యాల్యూని కోల్పోయింది. దీనికి తోడు గత నెలలో సుమారు 100 బిలియన్ డాలర్ల డిపాజిట్లను పెట్టుబడిదారులు వెనక్కి తీసుకోవంటి కారణం బ్యాంకు దివాలకు కారణమని తెలుస్తోంది. చదవండి👉 ఎస్వీబీని ముంచేసి..భార్యతో ఎంచక్కా చెక్కేసిన సీఈవో, లగ్జరీ ఇంట్లో! -
జేపీ మోర్గాన్ లాభం 42% డౌన్..
న్యూయార్క్: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ జేపీ మోర్గాన్ చేజ్ నికర లాభం 42 శాతం క్షీణించింది. 8.3 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలు, భారీ ద్రవ్యోల్బణ ప్రభావాలతో దాదాపు 1.5 బిలియన్ డాలర్ల రష్యన్ అసెట్స్‌ను రైటాఫ్ చేయడం ఇందుకు కారణం. గతేడాది తొలి త్రైమాసికంలో జేపీమోర్గాన్ చేజ్ లాభం 14.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కరోనా వైరస్ పరిణామాలతో తలెత్తే మొండి బాకీల ప్రొవిజనింగ్ కోసం ముందుజాగ్రత్తగా పక్కన పెట్టిన నిధులను చేజ్ క్రమంగా బైటికి తీస్తుండటంతో గతేడాది లాభాలు భారీ స్థాయిలో నమోదయ్యాయి. ప్రస్తుతం, అందుకు భిన్నంగా రష్యన్ అసెట్స్‌ను రైటాఫ్ చేయాల్సి రావడం, బేస్ ఎఫెక్ట్ వంటి అంశాల కారణంగా బ్యాంక్ లాభాలు తగ్గాయి. రైటాఫ్ చేసిన నిధులు .. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగం, అసెట్ మేనేజ్మెంట్ వ్యాపారాలకు సంబంధించినవని జేపీ మోర్గాన్ చేజ్ వెల్లడించింది. తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన వాల్ స్ట్రీట్ దిగ్గజాల్లో మొదటి సంస్థ జేపీ మోర్గాన్ చేజ్. ఈ సంస్థకు రష్యాలో ఒక మోస్తరు స్థాయిలో వ్యాపారం ఉంది. మరోవైపు, రష్యాలో గణనీయంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కన్జూమర్ బ్యాంకింగ్ కార్యకలాపాలున్న సిటీగ్రూప్... గురువారం ఆర్థిక ఫలితాలు ప్రకటించనుంది. -
ఎలన్ మస్క్‌కు భారీ షాక్, ట్వీట్ చేశావుగా..రూ.1200 కోట్లు కట్టు..!
టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు షాక్ తగిలింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్ధిక సంస్థ జేపీ మోర్గాన్ ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా పై $162 మిలియన్ల (ఇండియన్ కరెన్సీలో రూ.12,04,86,69,000.00) దావా వేసింది. టెస్లా స్టాక్ వారెంట్లకు సంబంధించిన ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ దావాలో పేర్కొంది. ముఖ్యంగా మస్క్ ట్వీట్లు షేర్ ధరలు తగ్గేలా ప్రేరేపించాయని ఆరోపించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో జేపీ మోర్గాన్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ప్రకారం..మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. కన్వర్టిబుల్ నోట్లను జారీ చేయడం ద్వారా దాని స్టాక్స్ వ్యాల్యూ తగ్గే ప్రమాదాన్ని నివారించడం, ఆదాయపు పన్ను మినహాయింపు పొందేలా 2014లో జేపీ మోర్గాన్ టెస్లా నుండి వారెంట్లను కొనుగోలు చేసింది. వారెంట్ల గడువు ముగిసినప్పుడు, టెస్లా స్టాక్ నిర్దిష్ట స్ట్రైక్ ధర కంటే ఎక్కువగా ఉంటే జేపీ మోర్గాన్‌కు షేర్లు లేదా నగదు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఎలన్ చేసిన ట్వీట్లతో టెస్లా స్టాక్ ధర.. ట్వీట్‌కు ముందు భారీగా ఉన్న ధర కాస్త తగ్గింది. దీంతో స్టాక్ వారెంట్లను ఒప్పొందం చేసుకున్న జేపీ మోర్గాన్ నష్టపోయింది. ఇదే అంశంపై జేపీ మోర్గాన్ ప్రతినిధులు తాజాగా మాన్ హట్టన్ కోర్టులో ఎలన్ మస్క్ తమకు 162 మిలియన్ల నష్టపరిహారం చెల్లించాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. కొంప ముంచిన ఎలన్ మస్క్ ట్వీట్ 2018, ఆగస్ట్ 7న టెస్లా సంస్థ గురించి ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. టెస్లాను ఉద్దేశిస్తూ 'గోయింగ్ ప్రైవేట్' అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఆ దెబ్బతో టెస్లాతో పాటు, అందులో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు చెందిన కంపెనీల స్టాక్ ధర తగ్గింది. మరికొద్ది సేపటికే ఆలోచనను విరమించుకున్నారు. కంపెనీ ఐపీఓకి వెళుతుందని ప్రకటించారు. ఆ గ్యాప్‌లోనే ఎలన్ మస్క్ గోయింగ్ ప్రైవేట్ అంటూ చేసిన ట్వీట్‌తో తమ కంపెనీకి చెల్లించాల్సిన మొత్తం కంటే తక్కువ జేపీ మోర్గాన్ చేజ్ & కో షేర్ వ్యాల్యూ భారీగా పడిపోయిందని, దాంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని కోర్ట్‌లో వాదించింది. మస్క్ అనాలోచితమైన ట్వీట్ల వల్ల తమ కంపెనీ భారీగా నష్టపోయిందని, న్యాయం చేయాలని కోర్టును కోరింది. చదవండి: చేతిలో చిల్లిగవ్వ లేదు, షేర్లను అమ్మేస్తా..! మీరేమంటారు? -
ఫ్రెడీ మ్యాక్‌కు 5.1 బిలియన్ డాలర్లు చెల్లించనున్న జేపీ మోర్గాన్
న్యూయార్క్: తప్పుడు వివరాలతో తనఖా రుణాలను బదలాయించిన వివాదంలో ఫ్రెడీ మ్యాక్, ఫ్యానీ మే సంస్థలకు జేపీమోర్గాన్ చేజ్ 5.1 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించనుంది. 2005-2007 మధ్యలో జేపీ మోర్గాన్ ఈ రుణాలను బదలాయించింది. వీటిని రాబట్టుకోవడం సులువేనని నమ్మించింది. అయితే, అటుపైన తనఖా రుణాల సంక్షోభం దరిమిలా ఫ్రెడీ మ్యాక్, ఫ్యానీ మే తీవ్రంగా నష్టపోయాయి. దీంతో, ప్రభుత్వరంగానికి చెందిన ఈ రెండు సంస్థలను నిర్వహిస్తున్న ఫెడరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఏజెన్సీ , ఇలాగే నష్టపోయిన మరికొన్ని సంస్థలతో కలిసి జేపీ మోర్గాన్ చేజ్పై దావా వేసింది. అయితే, ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో చేజ్ తో 5.1 బిలియన్ డాలర్లకి సెటిల్మెంట్ చేసుకునేందుకు ఎఫ్హెచ్ఎఫ్ఏ అంగీకరించింది.