ఎలన్‌ మస్క్‌కు భారీ షాక్‌, ట్వీట్‌ చేశావుగా..రూ.1200 కోట్లు కట్టు..! | JPMorgan Fights Tesla Over Warrants | Sakshi
Sakshi News home page

Elon Musk: ఎలన్‌ మస్క్‌కు భారీ షాక్‌, రూ.1200కోట్లు కట్టు..ట్వీట్‌ చేశావుగా..!

Published Wed, Nov 17 2021 12:39 PM | Last Updated on Wed, Nov 17 2021 1:37 PM

JPMorgan Fights Tesla Over Warrants - Sakshi

టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌కు షాక్‌ తగిలింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్ధిక సంస్థ జేపీ మోర్గాన్ ఎలన్‌ మస్క్‌కు చెందిన టెస్లా పై $162 మిలియన్ల (ఇండియన్‌ కరెన్సీలో రూ.12,04,86,69,000.00)  దావా వేసింది. టెస్లా స్టాక్ వారెంట్‌లకు సంబంధించిన ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ దావాలో పేర్కొంది. ముఖ్యంగా మస్క్ ట్వీట్లు షేర్ ధరలు తగ్గేలా ప్రేరేపించాయని ఆరోపించింది.   

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. 
మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో జేపీ మోర్గాన్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ప్రకారం..మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. కన్వర్టిబుల్ నోట్లను జారీ చేయడం ద్వారా దాని స్టాక్స్‌ వ్యాల్యూ తగ‍్గే ప్రమాదాన్ని నివారించడం, ఆదాయపు పన్ను మినహాయింపు పొందేలా 2014లో జేపీ మోర్గాన్ టెస్లా నుండి వారెంట్లను కొనుగోలు చేసింది. వారెంట్ల గడువు ముగిసినప్పుడు, టెస్లా స్టాక్ నిర్దిష్ట స్ట్రైక్ ధర కంటే ఎక్కువగా ఉంటే జేపీ మోర్గాన్‌కు షేర్లు లేదా నగదు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఎలన్‌ చేసిన ట్వీట్లతో టెస్లా స్టాక్‌ ధర.. ట్వీట్‌కు ముందు భారీగా ఉన్న ధర కాస్త తగ్గింది. దీంతో  స్టాక్‌ వారెంట్‌లను ఒప్పొందం చేసుకున్న జేపీ మోర్గాన్‌ నష్టపోయింది. ఇదే అంశంపై జేపీ మోర్గాన్ ప్రతినిధులు తాజాగా మాన్‌ హట్టన్‌ కోర్టులో ఎలన్‌ మస్క్‌ తమకు 162 మిలియన్ల నష్టపరిహారం చెల్లించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.  

కొంప ముంచిన ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌ 
2018, ఆగస్ట్‌ 7న టెస్లా సంస్థ గురించి ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. టెస్లాను ఉద్దేశిస్తూ 'గోయింగ్ ప్రైవేట్' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ దెబ్బతో టెస్లాతో పాటు, అందులో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు చెందిన కంపెనీల స్టాక్‌ ధర తగ్గింది. మరికొద్ది సేపటికే ఆలోచనను విరమించుకున్నారు. కంపెనీ ఐపీఓకి వెళుతుందని ప్రకటించారు. 

ఆ గ్యాప్‌లోనే 
ఎలన్‌ మస్క్‌  గోయింగ్‌ ప్రైవేట్‌ అంటూ చేసిన ట్వీట్‌తో తమ కంపెనీకి చెల్లించాల్సిన మొత్తం కంటే తక్కువ  జేపీ మోర్గాన్ చేజ్ & కో షేర్‌ వ్యాల్యూ భారీగా పడిపోయిందని, దాంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని కోర్ట్‌లో వాదించింది. మస్క్‌ అనాలోచితమైన ట్వీట‍్ల వల్ల తమ కంపెనీ భారీగా నష్టపోయిందని, న్యాయం చేయాలని కోర్టును కోరింది.  

చదవండి: చేతిలో చిల్లిగవ్వ లేదు, షేర్లను అమ్మేస్తా..! మీరేమంటారు?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement