ఫ్రెడీ మ్యాక్‌కు 5.1 బిలియన్ డాలర్లు చెల్లించనున్న జేపీ మోర్గాన్ | JPMorgan paying $5.1B in Fannie, Freddie deal | Sakshi
Sakshi News home page

ఫ్రెడీ మ్యాక్‌కు 5.1 బిలియన్ డాలర్లు చెల్లించనున్న జేపీ మోర్గాన్

Published Sun, Oct 27 2013 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM

JPMorgan paying $5.1B in Fannie, Freddie deal

న్యూయార్క్: తప్పుడు వివరాలతో తనఖా రుణాలను బదలాయించిన వివాదంలో ఫ్రెడీ మ్యాక్,  ఫ్యానీ మే సంస్థలకు జేపీమోర్గాన్ చేజ్ 5.1 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించనుంది. 2005-2007 మధ్యలో జేపీ మోర్గాన్ ఈ రుణాలను బదలాయించింది. వీటిని రాబట్టుకోవడం సులువేనని నమ్మించింది. అయితే, అటుపైన తనఖా రుణాల సంక్షోభం దరిమిలా ఫ్రెడీ మ్యాక్, ఫ్యానీ మే తీవ్రంగా నష్టపోయాయి. దీంతో, ప్రభుత్వరంగానికి చెందిన ఈ రెండు సంస్థలను నిర్వహిస్తున్న ఫెడరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఏజెన్సీ , ఇలాగే నష్టపోయిన మరికొన్ని సంస్థలతో కలిసి జేపీ మోర్గాన్ చేజ్‌పై దావా వేసింది. అయితే, ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో చేజ్ తో 5.1 బిలియన్ డాలర్లకి సెటిల్మెంట్ చేసుకునేందుకు ఎఫ్‌హెచ్‌ఎఫ్‌ఏ అంగీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement