ఇజ్రాయెల్ - హమాస్ వార్ కారణంగా అక్కడి వాతావరణం భీకర దాడులతో భయానకంగా ఉంది. ఈ సందర్భంగా గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం 'జేపీ మోర్గాన్ చేజ్' (JP Morgan Chase) తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
కంపెనీ తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇజ్రాయెల్‌లోని తన సిబ్బందిని పరిస్థితులు చక్కబడే వరకు ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేయాల్సిందిగా కోరింది. పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ చేసిన ఆకస్మిక దాడి రెండు వైపుల హింసాత్మక సంఘర్షణకు దారితీసింది.
ప్రస్తుతం ఇజ్రాయెల్, మిలిమెంట్ గ్రూపుల మధ్య జరుగుతున్న దాడుల్లో ఏ నిమిషం ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. దీంతో ఆఫీసులకు వచ్చి విధులు నిర్వహించే అవకాశం లేదు. కావున సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: చిన్నప్పుడే చదువుకు స్వస్తి.. నమ్మిన సూత్రంతో లక్షలు సంపాదిస్తున్న చాయ్‌వాలా..!!
ఇజ్రాయెల్‌లో జేపీ మోర్గాన్‌లో 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులను ప్రపంచంలోని చాలా దేశాలు ఖండిస్తున్నాయి. ఇప్పటికే యుద్ధంలో వందల మందికిపైగా మరణించినట్లు, మరి కొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. రానున్న రోజులు మరింత భయానకంగా ఉండే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment