2023లో అమెరికన్ బ్యాంకింగ్ చరిత్రలో ఇతర బ్యాంకుల కంటే జేపీ మోర్గాన్ భారీ లాభాల్ని అర్జించింది. దీంతో జేపీ మోర్గాన్ సీఈఓ జామీ డిమోన్ పరిహారం దాదాపు 4.3 శాతం పెరగడంతో 36 మిలియన్లను (రూ. 299 కోట్లకు పైగా) దక్కించుకున్నారు. ఈ మొత్తంలో 1.5 మిలియన్ల మూల వేతనం, 34.5 మిలియన్లను ప్రదర్శించిన పనితీరు ఆధారంగా సొంతం చేసుకున్నట్లు ఫార్చ్యూన్ నివేదించింది.
‘2023 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదిక డిమోన్ పనితీరు కారణంగా సంస్థ లాభాల్లో గణనీయైమన వృద్ధిని సాధించింది’ అని బ్యాంక్ ఒక ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో జేపీ మోర్గాన్ 2023కి 49.6 బిలియన్ డాలర్ల లాభాల్ని అర్జించినట్లు తెలిపింది. ఈ వార్షిక ఆదాయాలు.. గతంలో వచ్చిన ఫలితాల్ని కంటే గణనీయంగా పెరిగాయి.
67 ఏళ్ళ వయసులో జామీ డిమోన్ అమెరికాలోనే అతిపెద్ద బ్యాంక్‌కు ఎక్కువ కాలం సీఈఓగా పనిచేస్తున్న ఘనతను సాధించారు. 2005 నుండి జేపీ మోర్గాన్ సీఈఓగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ప్రకారం అతని నికర విలువ 1.7 బిలియన్లని అంచనా
Comments
Please login to add a commentAdd a comment