నాగాయలంకలో భారీ పోలీసు బందోబస్తు | heavy police security in Nagayalanka | Sakshi
Sakshi News home page

నాగాయలంకలో భారీ పోలీసు బందోబస్తు

Published Mon, Sep 21 2015 12:23 PM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

heavy police security in Nagayalanka

కృష్ణా జిల్లా నాగాయలంక, ఎదురుమొండి పట్టణాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మండలంలోని ఎదురుమొండిలో 2007లో అప్పటి ఎంపీపీ కన్నా జనార్దనరావు హత్యకు గురయ్యారు. ఆకేసు విచారణ పూర్తయిన తర్వాత నేటి సాయంత్రం దీనిపై బందరులోని జిల్లా కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ సందర్భంగా జనార్దన్ స్వగ్రామం ఎదురుమొండి, మండల కేంద్రం నాగాయలంకలో పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. అల్లర్లు జరగొచ్చనే అనుమానంతోనే ముందు జాగ్రత్తగాఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement