డీజీపీ కేసులో సాయంత్రం 5 గంటలకు తీర్పు
క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డీజీపీ దినేష్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో ఆదివారం వాదనలు ముగిశాయి. తీర్పును సాయంత్రం 5 గంటలకు వాయిదా వేశారు. తన పదవీ కాలన్నీ ఏడాది పాటు పొడగించాలని కోరుతూ ఆయన హౌస్ మోషన్ పిటీషన్ హైకోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
పదవీ విరమరణ వయస్సుతో సంబంధం లేకుండా డీజీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్ల పాటు సేవ చేయొచ్చని, ఆ మేరకు తన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడగించాలని ఆయన ఆ పిటిషన్లో కోరారు. కాగా తనను మరో ఏడాది డీజీపీగా కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దినేష్‌రెడ్డి విన్నపాన్ని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తోసిపుచ్చడంతో హైకోర్టును ఆశ్రయించారు.