DGP Dinesh reddy
-
అంతా కిరణే చేశారు.
-
కానిస్టేబుల్ కొడుకే డీజీపీ
తెనాలి/నరసరావుపేట, న్యూస్‌లైన్ : ఓ కానిస్టేబుల్ కొడుకు పోలీసుశాఖ రాష్ట్ర సర్వోన్నతాధికారి అయ్యారు. డీజీపీ దినేష్‌రెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలంటూ వేసిన పటిషన్ హైకోర్టు తోసిపుచ్చడంతో కొత్త ఇన్చార్జి డీజీపీగా బయ్యారపు ప్రసాదరావును నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 1979 బ్యాచ్‌కు చెందిన ప్రసాదరావు గుంటూరు జిల్లా తెనాలి వాసి కావడం గమనార్హం. ఈయన తండ్రి శ్రీనివాసరావు పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తూ ఉద్యోగరిత్యా తెనాలికి వచ్చి ఇక్కడి ఐతానగర్లో స్థిరపడ్డారు. 1955లో జన్మించిన ప్రసాదరావు ప్రాధమిక విద్యను నర్సరావుపేటలో అభ్యసించారు. కొల్లూరు జెడ్పీహైస్కూలులో ఉన్నత విద్యను చదివి, ఇంటర్, గ్రాడ్యుయేషన్‌ను విజయవాడ లయోలా కళాశాలలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ను మద్రాస్ ఐఐటీలో పూర్తి చేశారు. ఐదుగురు సంతానంలో ప్రసాదరావు పెద్దవారు. ముగ్గురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. ప్రసాదరావు తల్లి సుశీలమ్మది తెనాలి మండలం తేలప్రోలు గ్రామం. ఎన్నిసార్లు తెనాలికి వచ్చినా, పెదరావూరులోని తన మేనమామ వేజండ్ల అలీషా కుటుంబాన్ని కలవకుండా వెళ్లరు. ఫిజిక్స్ అంటే ఉన్న మక్కువతో ఇప్పటికీ తరంగ సిద్దాంతం, బిగ్‌బ్యాంగ్ థియరీలపై రిసెర్చ్ చేస్తుంటారు. నరసరావుపేటలో... ప్రసాదరావు తండ్రి శ్రీనివాసరావు నరసరావుపేటలో కానిస్టేబుల్‌గా కొద్దికాలం పనిచేశారు. అప్పటికి పట్టణంలోని కొండలరావుపేట కొత్తబావి ఎదురుగా ఉన్న పెంకుటింటిలో స్థానిక మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లాల్‌బహుదూర్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో ప్రసాదరావు ప్రాధమిక విద్యను అభ్యసించారు. ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న సమయంలో రెండేళ్ళ క్రితం నరసరావుపేట వచ్చినపుడు తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాను పట్టణంలోని పాత పోలీస్‌స్టేషన్ వెనుకవైపు ఉండే పెంకుటింటిలో ఉన్న పాఠశాలలో చదువుకున్నానని చెప్పారు. అంతేకాకుండా తాను చిన్నప్పుడు చదువుకున్న స్కూలును సందర్శించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. -
వీడ్కోలు వందనం స్వీకరించిన దినేష్ రెడ్డి
హైదరాబాద్ : డీజీపీ దినేష్ రెడ్డి పదవీ కాలం నేటితో ముగియనున్న సందర్భంగా ఆయన సోమవారం వీడ్కోలు వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌గ్రౌండ్స్‌లో పోలీస్ విభాగం కవాతు నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ కార్యక్రమానికి అందరూ ఐపీఎస్‌లు, అడిషనల్ డీజీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ డీజీపీగా రెండేళ్ల మూడు నెలలు పని చేశానన్నారు. తాను బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రం అల్లకల్లోలంగా ఉందని.... అయితే అందరి సహకారంతో శాంతిభద్రతలు అదుపులోకి తీసుకు వచ్చినట్లు దినేష్ రెడ్డి తెలిపారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం గొప్పగా పని చేస్తోందని చెప్పారు. తన పదవీ కాలంలో శాంతి భద్రతలు కాపాడటానికి సహకరించిన పోలీసులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
డీజీపీ కేసులో సాయంత్రం 5 గంటలకు తీర్పు
క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డీజీపీ దినేష్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో ఆదివారం వాదనలు ముగిశాయి. తీర్పును సాయంత్రం 5 గంటలకు వాయిదా వేశారు. తన పదవీ కాలన్నీ ఏడాది పాటు పొడగించాలని కోరుతూ ఆయన హౌస్ మోషన్ పిటీషన్ హైకోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పదవీ విరమరణ వయస్సుతో సంబంధం లేకుండా డీజీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్ల పాటు సేవ చేయొచ్చని, ఆ మేరకు తన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడగించాలని ఆయన ఆ పిటిషన్లో కోరారు. కాగా తనను మరో ఏడాది డీజీపీగా కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దినేష్‌రెడ్డి విన్నపాన్ని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తోసిపుచ్చడంతో హైకోర్టును ఆశ్రయించారు. -
శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ దినేశ్ రెడ్డి
తిరుమల శ్రీవారిని డీజీపీ దినేశ్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయకు స్వాగతం పలికారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆయన కలియుగ దైవాన్ని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు డీజీపీకి అందజేశారు. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమలలో భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. -
డిజీపీ దినేష్ రెడ్డికి క్యాట్‌లో మరోసారి చుక్కెదురు!
-
డీజీపీగా దినేష్ రెడ్డి ను కొనసాగించలేము
-
దినేష్ రెడ్డి కొనసాగింపుపై క్యాట్‌లో వాదనలు
-
దినేష్ రెడ్డి కొనసాగింపుపై క్యాట్‌లో వాదనలు
హైదరాబాద్ : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా దినేష్ రెడ్డి పదవీ కాలంపు పొడిగింపుపై గురువారం క్యాట్‌లో విచారణ కొనసాగుతోంది. డిజిపిగా తన పదవీ కాలాన్ని సెప్టెంబర్ 30, 2014 వరకూ పొడిగించాలని కోరుతూ డిజిపి దినేష్ రెడ్డి క్యాట్ హైదరాబాద్ బెంచిని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై దినేష్ రెడ్డిని కొనసాగించాలా.... వద్దా అనే దానికి రాష్ట్ర ప్రభుత్వం క్యాట్‌కు నివేదిక ఇవ్వనుంది. 'ప్రకాష్ సింగ్ తదితరులు - భారత ప్రభుత్వం తదితరుల' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పదవీ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా డిజిపిగా తన నియామకం జరిగిన తేదీ నుంచి రెండేళ్ళపాటు పదవిలో కొనసాగేలా అవకాశమివ్వాలని దినేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సుప్రీం తీర్పు ఆధారంగానే తన నియామకం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా దినేష్ రెడ్డి పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. -
డీజీపీ దినేష్ రెడ్డి పదవీకాలంపై విచారణ వాయిదా
హైదరాబాద్ : డీజీపీ దినేష్ రెడ్డి పదవీకాలం పొడిగింపు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) బుధవారానికి వాయిదా వేసింది. ఎల్లుండికల్లా దినేష్ రెడ్డి పదవీకాలం పొడిగిపుపై ప్రభుత్వం... క్యాట్‌కు సమాచారం ఇవ్వనుంది. అంతకు ముందు ప్రభుత్వ న్యాయవాది... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నందున దినేష్ రెడ్డి పదవీకాలంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. డీజీపీగా దినేష్‌రెడ్డి కొనసాగింపుపై ఈనెల 23వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని క్యాట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. -
ది హిందూ 'నగేష్' అరెస్ట్‌కు సిద్ధమైన పోలీసులు!
పాతబస్తీలో మతగురువు ముస్తాఫా ఇద్రూస్ బాబాను డీజీపీ దినేష్ రెడ్డి కలసిన అంశంపై కథానాన్ని ప్రచురించిన కేసులో ది హిందు రెసిడెంట్ ఎడిటర్ నగేష్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు శనివారం రంగం సిద్ధం చేశారు. అందులోభాగంఆ ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు నగేష్ నివాసానికి చేరుకున్నారు. అయితే ఆయన ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు. అదికాక నగేష్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు. అందుకు సంబంధించిన పత్రాలు ఏవి తమకు అందలేదని పోలీసులు తెలిపారు. కాగా హిందూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ నగేష్‌కు హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పదివేల రూపాయలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని నగేష్‌ను ఆదేశించింది. అంతేకాక నాలుగు వారాల పాటు ప్రతి శనివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారుల ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. అలాగే పోలీసు దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పాతబస్తీలో మత గురువు ముస్తాఫా ఇద్రూస్ బాబాను డీజీపీ దినేష్‌రెడ్డి ఈ నెల 12వ తేదీన కలిసిన అంశాన్ని ప్రచురించినందుకు నమోదు చేసిన కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందుస్తు బెయిల్‌ను మంజూరు చేయాలంటూ నగేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ చంద్రకుమార్ విచారించారు. పోలీసుల చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. పోలీసుల చర్య ఏకపక్షంగా ఉందని ఆయన తెలిపారు. విధుల్లో భాగంగానే డీజీపీ వార్తను ప్రచురించామని, మరుసటి రోజు డీజీపీ పంపిన వివరణను సైతం ప్రముఖంగా ప్రచురించడం జరిగిందని, ఇందులో ఎటువంటి దురుద్దేశాలు లేవని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, నగేష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. -
ఆస్తుల కేసు దర్యాప్తుపై డిజిపి వివరణ
-
హైదరాబాద్ జోలికొస్తే... ఊరుకోం: కోదండరాం
హైదరాబాద్/నల్లగొండ, న్యూస్‌లైన్: తెలంగాణలో అంతర్భాగమైన హైదరాబాద్ జోలికి వస్తే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద టీఎస్, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ పరిరక్షణ సభ జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ‘తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర’ అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సభల్లో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణను పరిరక్షించుకునేందుకు అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 29లోపు పార్లమెంటులో బిల్లు పెట్టకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని వనరులను దోచుకున్న సీమాంధ్రపెట్టుబడిదారులే హైదరాబాద్‌పై వివాదాలను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తే తెలంగాణకే నష్టం: ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తే తెలంగాణకే నష్టమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సీమాంధ్రలో ప్రైవేటు బస్సులను అధిక సంఖ్యలో నడపడంతో పాటు, ప్రస్తుత సమ్మె నష్టాన్ని కప్పి పుచ్చుకునేందుకే సంస్థను ప్రభుత్వపరం చేయాలనుకుంటోందని ఆరోపించారు. తద్వారా సీమాంధ్ర ప్రాంత నష్టాలను ఈ ప్రాంతం భరించాల్సి ఉంటుందని, ఇక్కడి లాభాలను సీమాంధ్రులు గడిస్తారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసన్నారు. హైదరాబాద్ నిజాం పాలకుల నుంచే అభివృద్ధి చెందుతూ వచ్చిందని వివరించారు. రాజ్యాంగపరంగా ఉండేందుకు హక్కులు ఉంటాయని, హైదరాబాద్ తమదని సీమాంధ్రులంటే ఒప్పుకోబోమన్నారు. ఢిల్లీలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు సమైక్య రాగం వినిపిస్తున్నారని తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిన ఆవశ్యకతపై చెప్పకుండా సీమాంధ్రకు నష్టం జరుగుతుందని మాత్రమే పేర్కొనడం భావ్యం కాదన్నారు. బాధ్యతాయుతమైన వ్యక్తిగా.. ఇరు పక్షాల సమస్యలను పెద్దల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. డీజీపీ మానసికస్థితి బాగాలేదు: అక్రమ ఆస్తులపై సీబీఐ ప్రశ్నించనుందన్న విషయం తెలిసినప్పటి నుంచి డీజీపీ దినేష్‌రెడ్డి మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు. తెలంగాణ జర్నలిస్తులపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని, అదే సీమాంధ్రలో పోలీసులు దగ్గరుండి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. ఆత్మబలిదానం చేసుకోవద్దు: ‘తెలంగాణ రాష్ట్రం కచ్చితంగా వస్తుంది.. ఐక్యంగా కొట్లాడి సాధించుకుందాం.. దీంట్లో ఎవరికీ అనుమానం అవసరం లేదు.. దయచేసి ఎవ రూ ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని’ కోదండరాం కోరారు. తెలంగాణ కోసం ఆత్మహత్యకు యత్నించిన మమతను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్న విధానాలతోనే తెలంగాణ వస్తుందో రాదో అనే అనుమానం ప్రజలకు కలుగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్లి, తెలంగాణ తెస్తామనే భరోసాను ప్రజల్లో కలిగించాలని కోరారు. టీఎస్, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ పరిరక్షణ సభలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఉద్యోగ సంఘాల నాయకులు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, నాయకులు బెల్లయ్యనాయక్, రసమయి బాలకిషన్, అద్దంకి దయాకర్, సంజీవనాయక్ తదితరులు హాజరయ్యారు. -
‘జీ 24 గంటలు’పై రెండు కేసులు
సాక్షి, హైదరాబాద్: డీజీపీ దినేష్‌రెడ్డి గురువారం హైదరాబాద్ పాతబస్తీలోని ఫతేదర్వాజాలో ప్రముఖ ముస్లిం మత గురువు హజ్రత్ హబీబ్ ముజ్తబా అల్ హైద్రూస్‌ను కలవడంపై అవాస్తవాలు ప్రసారం చేశారంటూ ‘జీ 24 గంటలు’ వార్తా చానల్‌పై శుక్రవారం రెండు కేసులు నమోదయ్యాయి. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు ఒక కేసు నమోదు చేయగా, హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. డీజీపీ వెళ్లి హైద్రూస్‌ను కలవడంపై ‘జీ 24 గంటలు’ చానల్లో ‘స్పెషల్ స్టోరీ’ ప్రసారమైంది. గురువారం డీజీపీ తన వెంట ఎలాంటి ఫైళ్లను తీసుకువెళ్లలేదని, ఒంగోలులో స్వామిని కలిసినప్పుడు కూడా ఆయన కాళ్లకు మొక్కలేదని, వీటికి సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ ద్వారా సృష్టించి ప్రసారం చేరారని డీజీపీ కార్యాలయంలో పరిపాలన విభాగం ఏఐజీగా పని చేస్తున్న సుబ్బారావు శుక్రవారం సీసీఎస్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ 469, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 66 (ఏ) కింద కేసు నమోదు చేశారు. మరోవైపు తన తండ్రిని మంత్రగాడంటూ కల్పిత కథనాలను ప్రసారం చేశారంటూ హైద్రూస్ కుమారుడు హబీబ్ మహ్మద్ చేసిన ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. జీ-24పై దాడిని ఖండించిన పాత్రికేయ సంఘాలు జీ-24 గంటలు చానల్ కార్యాలయంపై పోలీసులు శుక్రవారం చేసిన ఆకస్మిక దాడిని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌యూజే) నేతలు ఒక ప్రకటనలో ఖండించారు. విలేకరులపై కేసులు పెట్టడం, సోదాల పేరిట దాడులు చేయడం సరికాదన్నారు. దాడులు మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని పేర్కొన్నారు. అతిగా వ్యవహరించిన పోలీసులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
డీజీపీ దినేష్‌రెడ్డి పిటిషన్‌పై క్యాట్‌లో విచారణ
హైదరాబాద్ : డీజీపీగా దినేష్‌రెడ్డి కొనసాగింపుపై ఈనెల 23వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీజీపీ వ్యవహారంపై రెండు వారాల గడువు ఇవ్వాలని క్యాట్‌ను ప్రభుత్వం కోరినా.... క్యాట్ అనుమతి ఇవ్వలేదు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం తన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించాలని కోరుతూ డీజీపీ దినేష్‌రెడ్డి చేసుకున్న విజ్ఞప్తిపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ అంతకు ముందు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. -
లాయర్ల విధుల బహిష్కరణ
సాక్షి, నెట్వర్క్ : తెలంగాణ ప్రజానీకాన్ని రెచ్చగొట్టడానికే హైకోర్టు కేంద్రంగా సీమాంధ్ర న్యాయవాదులు కుట్రలు చేస్తున్నారని న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. సీమాంధ్ర న్యాయవాదుల దాడులకు నిరసనగా రాష్ట్ర న్యాయవాద జేఏసీ పిలుపు మేరకు బుధవారం తెలంగాణ జిల్లాల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అంబరీషరావు, సునీల్ తదితరులు పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టిస్తే.. తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందనే వారు ఇలా వ్యవహరిస్తున్నారని, దీన్ని తెలంగాణవాదులు అడ్డుకోవాలని కోరారు. సీమాంధ్ర న్యాయవాదులు హైకోర్టు నిబంధనలను సైతం ధిక్కరిస్తున్నారని ఆరోపించారు. ఒక ప్రాంతానికి పక్షపాతిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్, జనగామలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఖమ్మంలోని జిల్లా కోర్టు ముందు సీమాంధ్ర న్యాయవాదుల దిష్టిబొమ్మను దహనం చేసి, రాస్తారోకో నిర్వహించారు. భద్రాచలంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి, జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌కు, సబ్ కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. ఇల్లెందులో కూడా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. నల్లగొండ న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి, కోర్టు ఎదుట సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్లగొండలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వె ళుతున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను న్యాయవాదులు అడ్డుకునేందుకు యత్నించగా, పోలీసులు సర్దిచెప్పి పంపారు. నిజామాబాద్‌లో న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ కోర్టుల్లో విధులను బహిష్కరించి నిరసన వ్యక్తంచేశారు. బోధన్‌లో విద్యార్థి సంఘాల జాక్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు 1354వ రోజుకు చేరుకున్నాయి. కరీంనగర్ జిల్లాలోనూ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. -
జిల్లా బంద్ సంపూర్ణం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్రెడ్డిలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తెలంగాణను అడ్డుకోవడానికి యత్నిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం బంద్ పాటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. అన్ని సంఘాలూ బంద్‌లో పాల్గొనడంతో జిల్లాలోని ఆరు డిపోల్లో ఉన్న 635 బస్సులు రోడ్డెక్కలేదు. విద్యాసంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, వ్యవసాయ మార్కెట్లు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఉద్యోగులు విధులు బహిష్కరించి ప్రగతిభవన్‌నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. నిజామాబాద్ బస్టాండ్ ఆవరణలో తెలంగాణ వాదులు నల్లజెండాను ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. బోధన్ ఎన్డీఎస్ఎల్ కర్మాగారంలో కార్మికులు విధులు బహిష్కరించి, నిరసన తెలిపారు. బోధన్‌లో ఆర్టీసీ డిపో గేటుకు తాళం వేశారు. నాగన్‌పల్లి, రెంజల్ మండలం తూంపల్లిలలో రాస్తారోకో చేశారు. ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, మహిళలు, కులసంఘాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారంతా బంద్‌ను జయప్రదం చేయడం ద్వారా సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పక్షపాత వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. నిజామాబాద్‌లో బీజేపీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, కామారెడ్డిలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బంద్‌ను పర్యవేక్షించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీ ఎన్జీవోలు హైదరాబాద్‌లో నిర్వహించిన సభకు ముఖ్యమంత్రి, డీజీపీల అండదండలున్నాయని నేతలు ఆరోపించారు. బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు వెలవెలబోయాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాలు జనం లేక బోసిపోయాయి. శనివారం ప్రగతిభవన్‌లో జరగాల్సిన నీటి సలహా బోర్డు సమావేశాన్ని బంద్ కారణంగా అధికారులు వాయిదా వేశారు. నిరసన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతల చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా తెలంగాణ వాదులు రాస్తారోకోలు, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారు. సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. డిచ్పల్లి మండలంలోని తెలంగాణ యునివర్సిటీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తరగతులు బహిష్కరించి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ తీసి నిరసన తెలిపారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ హాస్టల్‌తో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యకాండను తెలంగాణవాదులు తీవ్రంగా ఖండించారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణప్రాంతానికి చెందిన కానిస్టేబుల్‌పై సీమాంధ్ర పోలీసులు దాడి చేయడాన్ని తప్పుపట్టారు. ఉద్యోగుల పేరుతో సంఘ వ్యతిరేక శక్తులను హైదరాబాద్ తరలించి, తెలంగాణవాదులపై దాడి చేయించారని ఆరోపించారు. విద్యార్థులపై దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంద్‌ను జయప్రదం చేయడానికి రాజకీయ జేఏసీ భాగస్వామ్య పక్షాలైన టీఆర్ఎస్, న్యూడెమోక్రసీలోని రెండు వర్గాలు, పీడీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు తీశారు. -
దినేష్ రెడ్డి ఆస్తులపై విచారణకు సుప్రీం ఆదేశం
-
దినేష్ రెడ్డి ఆస్తులపై విచారణకు సుప్రీం ఆదేశం
హైదరాబాద్ : పోలీస్ డైరక్టర్ జనరల్ దినేష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ఆస్తులపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐపీఎస్ ఉమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు ఇచ్చింది. దినేష్‌డ్డితో సహా ఆయన సతీమణి కమలా రెడ్డికి చెందిన అన్ని ఆస్తుల లావాదేవీలతో పాటు డీజీపీ కుటుంబసభ్యులు వై.రవిప్రసాద్, ఏ.కృష్ణారెడ్డి జరిపిన అన్ని లావాదేవీలపై పూర్తి విచారణకు ఆదేశించాలంటూ ఆయన తన పిటీషన్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు... ఉమేష్ కుమార్ పిటిషన్‌లోని అభియోగాలను ఎదుర్కోవల్సిందేనని దినేష్ రెడ్డికి స్పష్టం చేసింది. దర్యాప్తులోని అభ్యంతరాలను ట్రయిల్ కోర్టులో తేల్చుకోవాలని డీజీపీకి సుప్రీంకోర్టు సూచించింది. డీజీపీ భార్యకు రంగారెడ్డి జిల్లా చంపాపేట, మహేశ్వరం, మేడ్చల్ లలో 90కి పైగా భూముల లావాదేవీలు అమ్మటం, కొనటం జరిగిందని ఉమేష్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా దినేష్‌రెడ్డి తన భార్య పేరుతో బెనామీగా ఆస్తులను కూడబెట్టారంటూ ఉమేశ్‌కుమార్, అలాగే షూ కుంభకోణంలో ఉమేశ్‌కుమార్ నిందితుడిగా ఉన్నారంటూ దినేష్‌రెడ్డి పరస్పర ఆరోపణలతో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోంది: మందకృష్ణ
సాక్షి, హైదరాబాద్: రక్తపాతం సృష్టించైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు.. సీమాంధ్ర సమ్మెకు సీఎం కిరణ్ నాయకత్వం వహిస్తుంటే, ఏపీఎన్జీవోల సభకు డీజీపీ దినేశ్‌రెడ్డి రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, నాయకుడు రాజఎల్లయ్య మాదిగలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో సభలు జరుపుకొంటామంటే అనుమతివ్వని ప్రభుత్వం ఏపీఎన్జీవోల సభకు నాలుగురోజుల ముందే అనుమతి ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఏపీఎన్జీవో సభను అడ్డుకొనేందుకు నలువైపుల నుంచి ప్రతిఘటన దళాలు సిద్ధంగా ఉంటాయని, ఆ ప్రతిఘటన ఏ రూపమైనా తీసుకోవచ్చని హెచ్చరించారు. ఈ నెల ఏడున తెలంగాణ ప్రజలు భారీగా తరలివచ్చి ఎల్బీ స్టేడియంలో జరగబోతున్న కుట్రను భగ్నం చేయాలని మందకృష్ణ పిలుపునిచ్చారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఆరు, ఏడు తేదీల్లో హైదరాబాద్‌కు ప్రయాణించవద్దని, ఒకవేళ ప్రయాణాలేవైనాఉంటే రద్దు చేసుకోవాలని కోరారు. 6న అణగారినవర్గాల సభకు అనుమతివ్వనందుకు నిరసనగా శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. -
'సీమాంధ్ర ఉద్యమాన్ని సీఎం, డీజీపీలు నడుపుతున్నారు'
సీఎం కిరణ్, డీజీపీ దినేష్ రెడ్డిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు బుధవారం మెదక్ లో నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7వ తేదీన ఏపీఎన్జీవోలు చేపట్టనున్న 'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. అదే రోజు తెలంగాణ ఉద్యోగులు చేపట్టనున్న శాంతి ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన కిరణ్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ సర్కార్ సీమాంధ్రవారిని ఓ విధంగా, తెలంగాణ ప్రాంతం వారిని మరో విధంగా చూస్తుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ఉద్యమాన్ని సీఎం,డీజీపీలు దగ్గర ఉండి నడపుతున్నారని ఆయన ఆరోపించారు. -
త్వరలో కొత్త పోలీసు చట్టం
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పోలీసు సంస్కరణలన్నింటికీ చట్టబద్ధత కల్పించే విధంగా రాష్ట్రంలో కొత్త పోలీసు చట్టానికి రూపకల్పన జరుగుతోంది. ఈ మేరకు పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. డీజీపీ వి. దినేష్‌రెడ్డి, పోలీసు ఆపరేషన్స్ విభాగం డెరైక్టర్ జనరల్ జేవీ రాముడు, ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్కే కౌముది, పోలీసు కోఆర్డినేషన్ విభాగం అదనపు డీజీ వీకే సింగ్, పోలీసు పరిపాలన విభాగం అదనపు డీజీ ఆనురాధ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. పోలీసు సంస్కరణలకు అనుగుణంగా కొత్త పోలీసు చట్టాన్ని రూపొందించుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న మూడు పోలీసు చట్టాలు.. ఆంధ్రప్రదేశ్ పోలీసు చట్టం, తెలంగాణ పోలీసు చట్టం, హైదరాబాద్ పోలీసు చట్టం స్థానంలో ఒకే పోలీసు చట్టాన్ని రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లు తయారుచేసేందుకు న్యాయ నిపుణుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. సుప్రీం ఆదేశాల మేరకు..: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర హోంశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిన సంస్కరణలన్నింటికీ పోలీసు చట్టంలో స్థానం కల్పించనున్నారు. డీజీపీతోపాటు జిల్లా ఎస్పీ, శాంతిభద్రతల విభాగంలో పనిచేసే అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో)లకు ఖచ్చితంగా రెండేళ్ల పదవీకాలం ఉండేలా చట్టం రూపొందించనున్నారు. వారిపై తీవ్రమైన ఆరోపణలు, పనితీరులో అసమర్ధత నేపథ్యంలో మాత్రమే రెండేళ్లకన్నా ముందుగా వారిని బదిలీచేసే అవకాశం ఉంటుంది. హైకోర్టు/సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి చైర్మన్‌గా పోలీసు ఫిర్యాదుల విభాగం (పీసీఏ)ను కూడా చట్టబద్ధం చేయనున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై పీసీఏ విచారణ జరుపుతుంది. రాష్ట్ర భద్రతా కమిషన్ (ఎస్ఎస్సీ) ఏర్పాటుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతన చట్టం ముసాయిదా బిల్లు తయారైన అనంతరం శాసనసభ ఆమోదానికి పంపుతారు. -
దినేష్‌రెడ్డి వినతిపై నిర్ణయం తీసుకోండి
రాష్ట్రప్రభుత్వానికి క్యాట్ ఆదేశం.. సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం తన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించాలని కోరుతూ డీజీపీ దినేష్‌రెడ్డి చేసుకున్న విజ్ఞప్తిపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించింది. ఈ మేరకు క్యాట్ హైదరాబాద్ బెంచ్ సభ్యులు జస్టిస్ పి.స్వరూప్‌రెడ్డి, పి.కె.బసులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిస్తూ ఈ పిటిషన్‌పై విచారణను ముగించింది. -
ఉమేష్ కుమార్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
ఢిల్లీ: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి) దినేష్రెడ్డిపై ఉమేష్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. ఫోర్జరీ కేసులో గతంలో ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిటీష్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ కేసులో డీజీపీ దినేష్ రెడ్డిని ప్రతివాదిగా చేర్చాలంటూ ఉమేష్ మధ్యంతర పిటిషన్ వేశారు. దీంతో గతంలో దినేష్ రెడ్డికి సుప్రీం కోర్టుకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల మధ్య తలెత్తిన వివాదంపై గతంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించారు. నిజాయితీ గల ఐఎఎస్ అధికారితో కానీ ఐపీఎస్ అధికారితో కానీ విచారణ జరిపించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీజీపీగా పని చేస్తున్న వ్యక్తికి సంబంధించిన ఆస్తులపై విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. డీజీపీ దినేష్‌రెడ్డి తన భార్య పేరుతో అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఉమేష్‌కుమార్ ఆరోపించగా, షూ కోనుగోళ్లలో ఉమేష్‌కుమార్ అక్రమాలకు పాల్పడట్లుగా దినేష్‌రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
కిరణ్, దినేష్‌లకు పదవిలో కొనసాగే హక్కులేదు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. వారికి పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ ముల్కీ అమరవీరుల వారోత్సవం నిర్వహిస్తామని కోదండరామ్ మంగళవారమిక్కడ తెలిపారు. వచ్చే నెల 7వ తేదీన హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని కోదండరామ్ వెల్లడించారు. రాష్ట్ర విభజన అంశంలో సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని అమలు చేయటంలో జాప్యం వల్లే ఈ గందరగోళం నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల తీరు సక్రమంగా లేదని కోదండరామ్ అన్నారు. దీనిపై త్వరలో వారిని కలవనున్నట్లు ఆయన తెలిపారు. -
డీజీపీ దినేష్‌రెడ్డి పదవీకాలం పొడిగింపు?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) వేణుంబాక దినేష్‌రెడ్డి పదవీకాలాన్ని మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్ర హోంశాఖ తన సమ్మతిని తెలియజేసినట్లు విశ్వసనీయ సమాచారం. 2011 జూలైలో డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన దినేష్‌రెడ్డి వచ్చే నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలాన్ని ఏడాది పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. దీన్ని పరిశీలించిన కేంద్ర హోంశాఖ అదనంగా మూడు నెలలు మాత్రమే పొడిగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు దినేష్‌రెడ్డి ఈ ఏడాది డిసెంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. -
కేసీఆర్‌కు భద్రత పెంచాలి: టీఆర్ఎస్
గవర్నర్, డీజీపీలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వినతి సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత, ఎంపీ కె.చంద్రశేఖర్‌రావుకు భద్రతను పెంచాలని, బెదిరింపు ఫోన్లపై విచారణ జరిపించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను, డీజీపీ దినేష్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రాల్ని సమర్పించారు. అనంతరం టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్‌కు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయనీ, ఆయన హత్యకు కుట్ర జరుగుతున్నట్లుగా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, వీటిని గవర్నర్, డీజీపీలకు అందించినట్టుగా చెప్పారు. తెలంగాణ ఉద్యమ నేతను చంపడానికి కూడా పూనుకోవడం అత్యంత దారుణం, నీచమని ఈటెల విమర్శించారు. కేసీఆర్‌కు ఏదైనా జరిగితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని హెచ్చరించారు. గవర్నరు వెంటనే స్పందించి ఈ బెదిరింపు ఫోన్లపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనికి కారకులను గుర్తించి, వెంటనే అరెస్టు చేయాలని కోరారు. కేసీఆర్‌కు జడ్‌ప్లస్ భద్రతను కల్పించాలని, ఇందుకు అవసరమైన సిబ్బందిని కేటాయించాలని ఈటెల డిమాండ్ చేశారు. గవర్నరును, డీజీపిని కలిసిన వారిలో టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, డాక్టర్ టి.రాజయ్య, జూపల్లి కృష్ణారావు, నల్లాల ఓదేలు, హరీశ్వర్‌రెడ్డి, గంప గోవర్దన్, మొలుగూరి బిక్షపతి, అరవింద్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సుధాకర్‌రెడ్డి, స్వామిగౌడ్ తదితరులున్నారు. -
డీజీపీని కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
డీజీపీ దినేష్‌రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు బెదిరింపులు వస్తున్నాయని, ఆయనకు భద్రత పెంచాలని డీజీపీని వారు కోరారు. కేసీఆర్‌కు జెడ్ కేటగిరి భద్రత కల్పించే విషయంపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారికి దినేష్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను టీఆర్ఎస్ నాయకులు కలిశారు. కేసీఆర్‌కు భద్రత పెంచాలని గవర్నర్‌ను కోరారు. కేసీఆర్‌పై జరుగుతున్న కుట్రలపై పూర్తిస్థాయి విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా ఫిర్యాదు చేశారు. కిరణ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ప్రజలను పరిపాలించే నైతికహక్కు ఆయనకు లేదని పేర్కొన్నారు. -
రైల్‌రోకో చేస్తే కఠిన చర్యలు: డీజీపీ
-
రైల్‌రోకో చేస్తే కఠిన చర్యలు : డీజీపీ
హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ దినేష్ రెడ్డి గురువారం డీజీపీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైల్‌రోకో చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉద్యమకారులను ఆయన హెచ్చరించారు. రైళ్లను ఆపినా, రైల్వే ఆస్తులు ధ్వంసం చేసినా నాన్‌బెయిల్‌బుల్ కేసులు నమోదు చేస్తామని డీజీపీ వెల్లడించారు. రైల్‌రోకో కార్యక్రమాలను ఆషామాషీగా తీసుకోవద్దని ఆయన అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కఠిన చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైల్రోకోలపై నిషేధం ఉందన్ని....నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలిపితే ఎలాంటి అభ్యంతరం లేదని డీజీపీ అన్నారు. రైల్రోకోలను నిరోధించేందుకు తగినంత భద్రత ఉందని డీజీపీ తెలిపారు. జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేసినవారిపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరికలు చేశారు. ఆందోళనలను వీడియో తీస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర ఉద్యమాలకు అనుమతి లేదని డీజీపీ తెలిపారు. నిరసన తెలపాలనుకుంటున్న ఉద్యోగులు పికెటింగ్‌లు చేయరాదన్నారు. అలాగే హైదరాబాద్ లో ర్యాలీలకు అనుమతి లేదన్నారు.