తిరుమల శ్రీవారిని డీజీపీ దినేశ్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయకు స్వాగతం పలికారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆయన కలియుగ దైవాన్ని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు డీజీపీకి అందజేశారు.
అయితే ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమలలో భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది.