sarva darsanam
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం (ఉచిత దర్శనం) కోసం 24 గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న(సెప్టెంబర్ 3, 2023)న శ్రీవారిని 81,459 మంది భక్తులు దర్శించుకున్నారు. 32, 899 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్లుగా తేలింది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు
సాక్షి, తిరుపతి: తిరుమలలలో స్వామివారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ కాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆగష్టు 31, 2023)న తిరుమల శ్రీవారిని 59, 808 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,618 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.6కోట్లుగా లెక్క తేలింది. అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చేస్తోంది టీటీడీ. ఇదీ చదవండి: సెప్టెంబర్ 18న తిరుమలకు సీఎం జగన్ -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. స్వామివారి ఉచిత దర్శనం కోసం 13కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి వెళ్ళే భక్తులకు 6 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక నిన్న(శనివారం, ఆగష్టు 19) స్వామివారిని 79,242 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 36,039 కాగా, స్వామివారి హుండీ ఆదాయం 4.76 కోట్లుగా లెక్క తేలింది. ఇదీ చదవండి: ఇక ఆక్టోపస్ బృందం పర్యవేక్షణలో శ్రీవారి ఆలయం -
తిరుమల: ఉచిత దర్శనానికి 15 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి చెంతకు భక్తుల క్యూ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనానికి(ఉచిత) 15 గంటలు సమయం పడుతోంది. అలాగే.. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. ఇదిలా ఉంటే మంగళవారం శ్రీవారిని 71,935 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.11 కోట్లుగా తేలింది. ఇదీ చదవండి: సాధారణ భక్తుల కోసం.. టీటీడీ ప్రయోగం సక్సెస్ -
శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(ఉచిత) 15 గంటల సమయం పడుతోంది. అలాగే.. దర్శనం కోసం 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. నిన్న(సోమవారం, జూన్ 19) శ్రీవారిని 69,879 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,510 మందిగా నమోదు అయ్యింది. ఇక తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లుగా తేలింది. అదనపు లడ్డూ కౌంటర్లు.. టీటీడీ కీలక నిర్ణయం -
TTD: సర్వదర్శనానికి 20 గంటల సమయం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి చెంతకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లలో దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న(ఆదివారం) శ్రీవారిని 86,181 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.59 కోట్లుగా తేలింది. ఇక తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 30,654గా ఉంది. ఇక.. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల సెప్టెంబరు నెల కోటాను ఇవాళ(జూన్ 19న) విడుదల చేయనుంది టీటీడీ. సుప్రభాతం, అర్చన, తోమాల, అషాదటళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీ డిప్ కోసం ఉదయం 10గంటల నుంచి జూన్ 21వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు నగదు చెల్లించి టికెట్‌ను ఖరారు చేసుకోవాలి. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవాకు సంబంధించిన టికెట్లు జూన్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. సెప్టెంబరు మాసం కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటా, సంబంధించిన దర్శన టికెట్ల జూన్ 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబరు నెల అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఈనెల 23న 10 గంటలకు విడుదల చేస్తారు. ఆగస్టు 27 నుంచి 29 వరకు జరగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను.. జూన్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. మరోవైపు నేడు టీటీడీ పాలక మండలి భేటీ అయ్యి.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: జూన్‌లో తిరుమల వెంకన్న దగ్గరకు ఎందుకు వెళ్లాలంటే.. -
శ్రీవారి సర్వ దర్శనానికి 30 గంటలు
తిరుమల: తిరుమలలో 25 క్యూ కంపార్ట్మెంట్లు నిండాయి. సర్వ దర్శన టోకెన్లు లేని వారికి 30 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు పడుతోంది. బుధవారం అర్ధరాత్రి వరకు 74,412 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 27,626 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.27 కోట్లు వేశారు. -
బ్రహ్మోత్సవాల సమయంలో ‘ప్రత్యేక’ దర్శనాలు రద్దు
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు టీటీడీ పెద్దపీట వేయనుంది. అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసింది. భక్తులకు సర్వదర్శనం మాత్రమే కల్పించనుంది. రూ.300 దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్టు దాతలకు, ఇతర ట్రస్టుల దాతలకు దర్శన టికెట్లు, వీఐపీ బ్రేక్, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం, తదితర దర్శనాలను రద్దు చేసింది. ఆర్జిత సేవలు కూడా రద్దు చేసినట్లు పేర్కొంది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే శ్రీవారి బ్రేక్ దర్శనం ఉంటుందని వెల్లడించింది. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, ఇతర టీటీడీ అధికారులతో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ..బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన సెప్టెంబర్ 27న సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. తొలిరోజు ధ్వజారోహణం కారణంగా రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవ ప్రారంభమవుతుందని, మిగతా రోజుల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తామన్నారు. పెరటాసి మాసం మూడో శనివారం నాడు గరుడ సేవ రావడంతో తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముందని, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులకు సేవలందించేందుకు 3,500 మంది శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తామన్నారు. గరుడసేవ నాడు పూర్తిగా, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించనున్నట్లు వెల్లడించారు. -
సులభంగా శ్రీవారి దర్శనం
-
సర్వదర్శనం టోకెన్ల జారీపై కీలక ప్రకటన చేసిన టీటీడీ చైర్మన్
-
శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ దినేశ్ రెడ్డి
తిరుమల శ్రీవారిని డీజీపీ దినేశ్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయకు స్వాగతం పలికారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆయన కలియుగ దైవాన్ని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు డీజీపీకి అందజేశారు. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమలలో భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది.