
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(ఉచిత) 15 గంటల..
సాక్షి, తిరుపతి: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(ఉచిత) 15 గంటల సమయం పడుతోంది. అలాగే.. దర్శనం కోసం 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు.
నిన్న(సోమవారం, జూన్ 19) శ్రీవారిని 69,879 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,510 మందిగా నమోదు అయ్యింది. ఇక తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లుగా తేలింది.